మానసిక పరిణితి - ప్రేమ - వివాహం
మానసిక పరిణితి, ప్రేమ, వివాహం, వైవాహిక జీవిహం. వీటిల్లో వివాహానికి వెంటనే సంబంధం ఉన్న విషయం ప్రేమ తప్ప మానసిక పరిణితి కాదు. మానసిక పరిణితీ అయితే ఆ పరిణితి కి కొలమానం సమాజాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అటువంటి మానసిక పరిణితి లేని యువతీ తల్లిదండ్రులు ఒక అపరిచిత యువకుడిని తెచ్చి ఈమె అంగీకారం (కండీషనల్) తీసుకొని వివాహం చేసి వాళ్ళను పిల్లలను కనమని ఒత్తిడి తెచ్చి. ఆ పరిణితి లేని దంపతులు డబ్బు సంపాదిస్తూ పిల్లలను పరిణితి లేకుండా పెంచి సమాజం మీదకి వదలటాన్ని అంగీకరిస్తాము. ఇది ఎంత వరకు సమంజసము?
వైవాహిక జీవితము ఆనందించడానికా? సమాజానికి పిల్లలు కని పెట్టడానికా..? ఆనందించడానికి కావలసినది ప్రేమ తప్ప మానసిక పరిణితి కాదు. 18 సంవత్సరాలలో యువతకు సమాజాన్ని ఎదుర్కొనే అవగాహన లేకపోవచ్చు. కానీ శారీరకంగా వారు ఎదిగి ఉంటారు. సంసారానికి పనికి వస్తారు. పరిణితితో ప్రేమించినా, పరిణితి లేకుండా ప్రేమించినా ప్రేమలో ఆనందము ఉంటుంది. ఒక వేళ ఆ వివాహం ఫెయిల్ అయితే 28లో మరో పెళ్లి చేసుకోవచ్చు. అదీ ఫెయిల్ అయితే 38 లో మరో పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఆనందం, ప్రేమ, స్వేచ్ఛ లేకుండా 70 ఏళ్ళు బ్రతకటం లో అర్థం ఏమి ఉంది..?? పెళ్లి తరువాత వచ్చే పిల్లలు, సామజిక బాధ్యతల దృష్ట్యా ఒక యువతీ, లేదా యువకుడు తన జీవితంలో ఉన్న ఆనందాల్ని త్యాగం చెయ్యాల్సిన అవసరం ఏముంది?
- హరి రాఘవ్
Keywords : love, life, marriage
(13.02.2017 08:18:56pm)
No. of visitors : 1113
Suggested Posts
10 results found !
| నిజం ఆవస్యకతనిజాన్ని తెలుసుకోవడం అవసరమే. కానీ ప్రతీ నిజాన్ని తెలుసుకోవడం వల్ల జీవితం వృధా అవుతుంది. జ్ఞానం అనంతం. మనిషి జీవితం పరిమితం. పరిమిత జీవితకాలంలో చాలా వరకు తనకు తెలియకుండా సమాజ ప్రభావంతో కొట్టుకుపోతాడు. తనకు అర్థమయ్యింది అనుకునే లోపే తను అర్థం చేసుకున్నదంతా తప్పని అర్థమవుతుంది.
మనిషి తన మానసిక జీవితానికి సంబంధం లేని ఏ నిజాన్ని తెలుసుకున్నా అది వృధానే. అంత |
| నిజాలన్నీ అబద్దాలేమనిషి ప్రతీ క్షణం తన గతం నుండి భవిష్యత్తులోకి ప్రయాణం చేస్తూనే ఉంటాడు. జీవం ఉన్నంత వరకూ తనకు ఇష్టం ఉన్నా, లేకున్నా తన జీవితంలో మార్పు సంభవిస్తూనే ఉంటుంది. కాబట్టి #నేనెవరు? అన్న ప్రశ్నకు మనిషి దగ్గర ఎప్పటికీ సమాధానం ఉండదు. నేను ఫలానా అని చెప్పింది కేవలం తన గతం నుంచి తీసుకున్న కొంత భాగం లేదా ప్రస్తుతంలో తను అనుకున్న, చెప్పిన లక్షణం మాత్రమే.
ప్రతీ మనిషి త |
| జీవితంఆధునిక కాలంలో మనిషి తన జీవితంలో ఎదురయ్యే ఆనందాన్ని అనుభవించడం కన్నా, తను ఆ స్థితికి చేరుకున్నాని ఇతరులకు తెలియజేయడంలో ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు. అనుకోకుండా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడినా లేదా ఏదైనా విహార యాత్రకు వెళ్ళినా ఆ అందమైన అనుభూతులను ఆస్వాదించ కుండా అక్కడ సెల్ఫీలు ఎలా తీసుకుంటే బాగుంటదో అనే ఆలోచనలే వారి మనస్సులో మొదలవుతాయి. |
| మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా?ఇతర జంతువులకు లేని అద్భుతమైన జ్ఞాపక శక్తి, సృజనాత్మక శక్తి మనిషికి లభించింది. అదే సమయంలో మనిషి ఆ జ్ఞాపక శక్తి, సృజనాత్మక శక్తి మనిషిని అనంతమైన దుఃఖంలోకి నెట్టివేస్తుంది. లభించిన సమాచారంలో అవసరమైనదేదో అనవసరమైనదేదో తేల్చుకోలేక ప్రతీ సమాచారాన్ని పరిగణలోకి తీసుకొని అవసరం లేని భయాలను, వేదనను పెంచుకోవడంలో మనిషి సిద్ధహస్తుడు. మనిషి తనకున్న భయాల నుంచి ఒక అభయం క |
| పోరాటమా? బ్రతుకా?మెయిన్ స్ర్టీమ్ మీడియా లాగా కాకుండా ఫేస్‌బుక్ గ్రూప్స్ లోను, ఇతర సామాజిక మాధ్యమాలలోను ప్రతీఒక్కరు స్పందించే అవకాశం ఉంటుంది. ఇది ఒక మంచి పరిణామం. ఏ సమస్యకయినా పరిష్కారం కనుగొనడంలో చర్చించడం ఒక ఉన్నతమయిన మార్గం. అయితే ఇందులో ఉన్న ఇబ్బంది ఏంటంటే చాలామంది చర్చల వరకే పరిమితం అవుతారు. |
| భార్యభర్తల మధ్య విభేదాలకు కల్చర్ ఎలా కారణమవుతుంది? వైవాహిక జీవితంలో కులాంతర, మతాంతర, ప్రాంతాంతర అంశాలు ప్రభావితం చేస్తాయా? ఒకవేళ అటువంటి అంశాలుంటే వాటిని ఎలా ఎదుర్కోవాలి? క్రాస్ కల్చర్ మ్యారేజ్ లలో చిన్నచిన్న ఇబ్బందులను సరయిన రీతిలో అర్థం చేసుకోకపోతే ఎలా జీవితాల మీద ప్రభావితం చేసే అవకాశం ఉంది? |
| సాంకేతిక అగాధంలో మనిషి..కాలానుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతూ వస్తుంది. ఒకప్పుడు పచ్చి మాంసం, పండ్లు తినే మనిషి మంటను కనుగొనడడం మానవ చరిత్రలో అతి పెద్ద అభివృద్ధి(?)గా భావించవచ్చు. తరువాతి క్రమంలో ఇంధనాలను మండించడం ద్వారా పారిశ్రామిక రంగాలకు పునాది పడింది. తదుపరి విద్యుత్తును కనిపెట్టడం ద్వారా మానవ, జంతు శ్రమకు బదులుగా విద్యుత్తును వాడుకునే పరికరాలు రూపొందాయి. చివరికి కుట్టు |
| ఆనందం నీ ఛాయస్ఈ విశ్వంలో జరిగిన ప్రతీ సంఘటనకు వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది. కారణం లేకుండా ఏదీ జరగదు. అయితే జీవించడానికి మాత్రం ఏ కారణం అవసరం లేదు. చాలామంది తామ జీవితం దుర్భరంగా మారినపుడు అసలు తాము ఎందుకు జీవిస్తున్నామో అర్థం కావడం లేదు అని అంటుంటారు. కొందరి వైవాహిక సంబంధాలు దెబ్బతిన్నపుడు పిల్లల కోసం జీవిస్తున్నట్లు చెప్పుకుంటారు. కానీ వ్యక్తి తన జీవితం ఎప్పుడూ తన కోసమ |
| ఆనందపు తలుపులుమనిషి జీవితానికి పరమార్థం వెతికే పనిలో పడతారు కొందరు మేధావులు. హాయిగా జీవించడమే తప్ప మారే పరమార్థం ఉండేది తెలుసుకుంటారు అందులో కొందరు. భార్య పిల్లలను వదిలి జ్ఞానం కోసం వెళ్లిన బుద్ధుడు ప్రపంచాన్ని గురువు, దేవుడు అయ్యాడు. కానీ ఆ భార్య పిల్లల దృష్టిలో బుద్ధుడు వేరు. సమాజంలో ఉన్న స్థితిని మరచి, ఉన్న భాద్యతలు మరచి భవిష్యత్తుకు ఇతరులను వదిలి వెళ్లడం వల్ల సమాజ |
| లైఫ్ ఛేంజింగ్ ఇయర్ - 2018మిత్రువులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోజు నుండి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. నిజానికి ప్రకృతిలో ఏదీ మారదు. మారాల్సింది మనం. మార్పు రావలసింది మన ఆలోచన విధానంలో. మనం మారితే ప్రపంచం మారుతుంది. మనం మారితే తోటి వారిలో మార్పు వస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు గమనించాల్సిన విషయం ఇది. మనం సమర్థవంతంగా మన టైం ని మేనేజ్ చేసుకోకుండా ఏవో వంకలు వెతుక్కోవటం లోన |
| డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు |
| కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది? |
| టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి? |
| మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా? |
| మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా? |
| NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు |
| టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి? |
| బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన |
| పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? |
| మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!! |
| పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా? |
| మనుసులో భావాలే కలలుగా వస్తాయా? |
| Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..? |
| తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా? |
| టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి? |
| మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా? |
more..