టీనేజ్ లో శారీరకంగా వచ్చే మార్పుల గురించి చెందే మానసిక ఆందోళన

టీనేజ్

టీనేజ్ లోకి ప్రవేశించిన వెంటనే వారికి మొదట ఎదురయ్యే ఆందోళన వారి శరీర ఆకృతి గురించి. అప్పటివరకు ముద్దుగా, చిన్న పిల్లల మాదిరి ఉన్న శరీరం క్రమంగా తన ఆకృతిని మార్చుకుంటూ ఉంటుంది. మార్పులు సరయిన సమయంలో సరయిన విదంగా లేనట్లయితే వీరు విపరీతమయిన ఒత్తిడికి గురి అయ్యే అవకాశం ఉంది.

మొహంలో వచ్చే మార్పుల గురించి ఆందోళన
ఈ వయస్సులో పిల్లలు ఎక్కువ సమయం అద్దం ముందు గడుపుతూ ఉంటారు. దానికి కారణం వారి మోహంలో వచ్చేటటువంటి మార్పులు. తీవ్రమయిన హార్మోనుల ప్రభావం వలన మొహంపై మొటిమలు వీరిని విపరీతంగా భాదిస్తుంటాయి. మొటిమలతో వారి మొహం వారికే అసహ్యంగా అనిపిస్తుంటుంది. అవి తగ్గవేమోనని విపరీతంగా భయపడుతుంటారు. బాలురలో మొహంపై వచ్చే వెంట్రుకల గురించిన ఆలోచన. వారికి మీసాలు గడ్డలు వశ్తాయో రావో అని ఆందోళన. అదే సమయంలో బాలికలలో ఎక్కడ తమకు మొహం పైన వెంట్రుకలు వస్తాయోనని ఆవేదన.

ఛాతీ ఆకృతి లో వచ్చే మార్పుల గురించి ఆందోళన
ఛాతీ ఆకృతిలో వచ్చే మార్పు కూడా విపరీతమయిన ఒత్తిడికి గురిచేస్తుంది. బాలురు నిరంతరం తమ ఛాతీలో వచ్చే మార్పులు గమనిస్తుంటారు. ఎక్కడ ఆడ పిల్లల లాగా తమ ఛాతీ మారుతుందో అని ఆందోళన చెందుతుంటారు. అందుకు విరుద్ధంగా బాలికలు ఎక్కడ తమ ఛాతీలో మార్పులు సంభవించకుండా బాలుర మాదిరి ఉండిపోతోందో అని భయపడుతుంటారు. ఒక వేల మార్పు చెందుతుంటే అది ఎంత వరకు పెరుగుతుంది, ఎప్పోడు ఆగిపోతుంది, ఒక వేళ అది ఆగకుండా విపరీతంగా పెరిగిపోతే పరస్థితి ఏమిటి అనే ఆందోళన

తొడల భాగంలో వచ్చే మార్పుల గురించి ఆందోళన
తొడలు, పిరుదుల బాగాలలో ఆడపిల్లలకు ఈ వసుస్సులో మగవారికంటే కొంచెం ఎక్కువగా క్రొవ్వు చేరి లావుగా మారతాయి. ఈ మార్పులు తగిన సమయంలో వారికి కనిపించక పోతే విపరీతమయిన ఒత్తిడికి లోనవుతారు. కొందరికి జన్యు ప్రభావంతో కొంచెం ఎక్కువగా లావు అవుతారు. వీరికి ఎక్కడ తమ శరీర ఆకృతి అసహ్యంగా మారుతుందోనని భయపడుతుంటారు. కొంత మంది బాలురు జన్యు రీత్యగాని, జంక్ ఫుడ్ వలన గాని విపరీతంగా లావు అయినపుడు తొడల భాగం బాలికల మాదిరి లావుగా మారుతుంది. అది వీరిని విపరీతమయిన ఒత్తిడికి లోను చేస్తుంది.

ఈ అనుమానాలను భయాలను వీరు తల్లిదండ్రులతో గాని, టీచర్స్ తో గాని పంచుకోలేక వారు తమ స్నేహితులతో పంచుకుంటూ ఉంటారు. అదే వయస్సు, అంతే అవగాహన గల స్నేహితులు వీరి అనుమానాలను నివృత్తి చెయ్యలేక పోగా మరిన్ని భయాలను కలిగించడం సామాన్యంగా జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు వీరి అనుమానాలను వారితో పంచుకునేలగా ప్రోత్సహించి, ఓపికగా, శ్రద్ధగా విని, వారి అనుమానాలను నివృత్తి చేసి ఒత్తిడిని దూరం చెయ్యవలసిన అవసరం ఉంటుంది.

- హరి రాఘవ్

Keywords : teens, body, physic, grown
(19.10.2017 10:39:48pm)

No. of visitors : 517

Suggested Posts


8 results found !


టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?

టీనేజ్ పిల్లలో వచ్చే మానసిక శారీరక మార్పులేంటి? వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? వారితో తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలి?

NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు

NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు

టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?

టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?

పిల్లల పెంపకం - నేటి పరిస్థితులు

సృష్టిలో ఏ పేరెంట్స్ కి కూడా తమ బిడ్డలపై ప్రేమ లేకుండా ఉండదు. పురాణ కాలంలో ప్రహ్లాదుని తండ్రి అయిన హిరణ్య కశ్యపుని నుండి మొదలు నేటి తరం పేరెంట్స్ వరకు ఎవరూ కూడా తమ బిడ్డలు వృద్ధి లోకి రావాలనే తప్ప చెడిపోవాలి, సమాజానికి హానికరంగా మారాలని కోరుకోరు. కాని వారి వారి పెంపకం లో ఉన్న వైరుధ్యాల వలన బిడ్డలు వివిధ రకాలుగా ఎదిగి తరువాత గొప్ప వారిగా లేదా నేరస్తులుగ

వాట్స్-యాప్ మెసేజ్ తో ఒకరి పై ఒకరు కత్తులతో దాడి

టీనేజ్ లో ఉన్న యువత తీవ్రంగా గుర్తిపు కోసం తపిస్తూ ఉంటుంది. ఏదో ఒక విధంగా సమాజంలో వారికీ గుర్తిపు కావలి. దానికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కొందరు విపరీతంగా చదివి గుర్తిపు తెచ్చుకుంటే, కొందరు స్పోర్ట్స్ ద్వారా తెచ్చుకోవాలని ప్రయతింస్తారు. కొందరు ఇతరులతో గొడవలు పెట్టుకోవటం ద్వారా గుర్తింపు తెచ్చుకుంటారు. మరికొందరు వారి బ్యాక్ బెంచీలలో కూర్చొని అల్లరి చె

టీనేజర్స్ - కల్చర్

సంస్కృతి (కల్చర్) అనగానే మనకు సాధారణంగా గుర్తు వచ్చేవి సాలార్జంగ్ మ్యూజియం, రవీంద్ర భారతి, కాకతీయుల కాలం నాటి శిల్ప కళలు మొదలయినవి. ఇవన్ని అద్భుతమయిన మన గత జీవన విధానాన్ని తెలియజేసేవి. కాని టీనేజర్స్-సంస్కృతి అనగానే అవే గుర్తుకు వస్తాయా? లేక మరేమయినానా? ఖచ్చితంగా అవి కావు. కొన్ని భయంకరమయినవి, మరి కొన్ని భాధించేవి. జారి పోయే పాంట్లు, పొట్టి చొక్కాలు, చిరి

ఫేస్బుక్ అడిక్షన్

ఎందుకు యువత సోషల్ మీడియాకి బానిసగా మారుతుంది. తన కెరీర్, కొన్నిసార్లు జీవితాలను ఫణంగా పెట్టి కూడా సోషల్ మీడియా మీదనే సమయం వెచ్చించడానికి కారణం ఏంటి? బ్లూ వే

టీనేజ్ లో శరీకంగా వచ్చే మార్పుల గురించి చెందే మానసిక ఆందోళన

టీనేజ్ లోకి ప్రవేశించిన వెంటనే వారికి మొదట ఎదురయ్యే ఆందోళన వారి శరీర ఆకృతి గురించి. అప్పటివరకు ముద్దుగా, చిన్న పిల్లల మాదిరి ఉన్న శరీరం క్రమంగా తన ఆకృతిని మ
Search Engine

బయలాజికల్ మదర్
ఫేస్బుక్ ఓసీడీ (FBOCD)
నిజం ఆవస్యకత
నిజాలన్నీ అబద్దాలే
కెరీర్
చీమ మెదడులో చేరిన వైరస్
వ్యక్తి
జీవితం
హ్యూమనిజం
నేనెవరు?
PTSD
డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు
రిజర్వేషన్స్
కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది?
టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?
మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా?
Autism Treatment
మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా?
NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు
టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన
పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!
పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?
మనుసులో భావాలే కలలుగా వస్తాయా?
కలలు నిజాలు అవుతాయా?
ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్
Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..?
తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?
టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి?
రెండవ కూతురు
ఏకాగ్రత పెంచుకోవడం ఎలా?
మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా?
ఫ్రీ థింకింగ్
పోరాటమా? బ్రతుకా?
more..
టీనేజ్