వాట్స్-యాప్ మెసేజ్ తో ఒకరి పై ఒకరు కత్తులతో దాడి

వాట్స్-యాప్

టీనేజ్ లో ఉన్న యువత తీవ్రంగా గుర్తిపు కోసం తపిస్తూ ఉంటుంది. ఏదో ఒక విధంగా సమాజంలో వారికీ గుర్తిపు కావలి. దానికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కొందరు విపరీతంగా చదివి గుర్తిపు తెచ్చుకుంటే, కొందరు స్పోర్ట్స్ ద్వారా తెచ్చుకోవాలని ప్రయతింస్తారు. కొందరు ఇతరులతో గొడవలు పెట్టుకోవటం ద్వారా గుర్తింపు తెచ్చుకుంటారు. మరికొందరు వారి బ్యాక్ బెంచీలలో కూర్చొని అల్లరి చెయ్యటం ద్వారా గుర్తిపు తెచ్చుకుంటారు.

ఇటీవల కాలంలో సోషల్ మీడియా ఉధృతి పెరగటంతో యువత సోషల్ మీడియాలో గుర్తింపు కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. ఫోటోలు షేర్ చేసుకోవటం, కామెంట్స్ చెయ్యటం, ఎక్కువ లైక్స్ తెచ్చుకోవటం వంటివి వీరికి గుర్తింపు తెచ్చేవి. కొందరు ఏదో ఒక సినీ హీరో ఫ్యాన్ గా మరి అతని గురించి పోస్టులు చేస్తూ గుర్తింపు పొందితే, కొందరు తమ మతం గురించో, కులం గురించో, సమాజం గురించే పోరాడుతున్నట్లుగా గుర్తింపు పొందాలని ప్రయత్నాలు చేసారు.

ఈ క్రమంలో ఒక వాట్సాప్‌ గ్రూపులో మెసేజ్‌ ఓ యువకుడిపై కత్తిపోట్లకు దారి తీసింది. హైదరాబాద్‌ శివారు పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రోహిత్‌(20), భువనేశ్వర్‌(20) మైసమ్మగూడలోని నర్సింహా రెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నారు. వీరు తమ స్నేహితులతో కలసి వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేసుకున్నారు. ఇటీవల రోహిత్, భువనేశ్వర్‌ల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. గురువారం రాత్రి భువనేశ్వర్‌ ʹశుక్రవారం రోహిత్‌ను నేను కొట్టబోతున్నానుʹ అంటూ వాట్సాప్‌ గ్రూపులో మెసేజ్‌ పెట్టాడు. దీన్ని చదివిన రోహిత్‌ శుక్రవారం ఉదయం తన స్నేహితులతో కలసి నర్సింహారెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజీ వద్ద మాటు వేసి, బస్సు దిగుతున్న భువనేశ్వర్‌పై కత్తితో దాడి చేశాడు.

ముఖం, చేతులు, నడుముకు గాయాలు కావడంతో అతడిని కళాశాల యాజమాన్యం ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తోంది. దాడిని అడ్డుకునేందు కు ప్రయత్నించిన మరో విద్యార్థి కూడా గాయపడినట్లు సమాచారం. ఈ విషయాన్ని యాజమాన్యం దాచేందుకు ప్రయత్నించినా ఆ నోటా ఈ నోటా పోలీసులకు చేరింది. రోహిత్‌తోపాటు అతని నలుగురు స్నేహితులు భువనేశ్వర్‌ను గట్టిగా పట్టుకుని కత్తితో దాడికి పాల్పడినట్లు క్షతగాత్రుని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

- హరి రాఘవ్

Keywords : whatsapp, social media, hyderabad, teens
(21.10.2017 07:44:23am)

No. of visitors : 603

Suggested Posts


8 results found !


టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?

టీనేజ్ పిల్లలో వచ్చే మానసిక శారీరక మార్పులేంటి? వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? వారితో తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలి?

NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు

NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు

టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?

టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?

పిల్లల పెంపకం - నేటి పరిస్థితులు

సృష్టిలో ఏ పేరెంట్స్ కి కూడా తమ బిడ్డలపై ప్రేమ లేకుండా ఉండదు. పురాణ కాలంలో ప్రహ్లాదుని తండ్రి అయిన హిరణ్య కశ్యపుని నుండి మొదలు నేటి తరం పేరెంట్స్ వరకు ఎవరూ కూడా తమ బిడ్డలు వృద్ధి లోకి రావాలనే తప్ప చెడిపోవాలి, సమాజానికి హానికరంగా మారాలని కోరుకోరు. కాని వారి వారి పెంపకం లో ఉన్న వైరుధ్యాల వలన బిడ్డలు వివిధ రకాలుగా ఎదిగి తరువాత గొప్ప వారిగా లేదా నేరస్తులుగ

టీనేజ్ లో శారీరకంగా వచ్చే మార్పుల గురించి చెందే మానసిక ఆందోళన

టీనేజ్ లోకి ప్రవేశించిన వెంటనే వారికి మొదట ఎదురయ్యే ఆందోళన వారి శరీర ఆకృతి గురించి. అప్పటివరకు ముద్దుగా, చిన్న పిల్లల మాదిరి ఉన్న శరీరం క్రమంగా తన ఆకృతిని మార్చుకుంటూ ఉంటుంది. మార్పులు సరయిన సమయంలో సరయిన విదంగా లేనట్లయితే వీరు విపరీతమయిన ఒత్తిడికి గురి అయ్యే అవకాశం ఉంది. మొహంలో వచ్చే మార్పుల గురించి ఆందోళన ఈ వయస్సులో పిల్లలు ఎక్కువ సమయం అద్దం ముందు గడుప

టీనేజర్స్ - కల్చర్

సంస్కృతి (కల్చర్) అనగానే మనకు సాధారణంగా గుర్తు వచ్చేవి సాలార్జంగ్ మ్యూజియం, రవీంద్ర భారతి, కాకతీయుల కాలం నాటి శిల్ప కళలు మొదలయినవి. ఇవన్ని అద్భుతమయిన మన గత జీవన విధానాన్ని తెలియజేసేవి. కాని టీనేజర్స్-సంస్కృతి అనగానే అవే గుర్తుకు వస్తాయా? లేక మరేమయినానా? ఖచ్చితంగా అవి కావు. కొన్ని భయంకరమయినవి, మరి కొన్ని భాధించేవి. జారి పోయే పాంట్లు, పొట్టి చొక్కాలు, చిరి

ఫేస్బుక్ అడిక్షన్

ఎందుకు యువత సోషల్ మీడియాకి బానిసగా మారుతుంది. తన కెరీర్, కొన్నిసార్లు జీవితాలను ఫణంగా పెట్టి కూడా సోషల్ మీడియా మీదనే సమయం వెచ్చించడానికి కారణం ఏంటి? బ్లూ వే

టీనేజ్ లో శరీకంగా వచ్చే మార్పుల గురించి చెందే మానసిక ఆందోళన

టీనేజ్ లోకి ప్రవేశించిన వెంటనే వారికి మొదట ఎదురయ్యే ఆందోళన వారి శరీర ఆకృతి గురించి. అప్పటివరకు ముద్దుగా, చిన్న పిల్లల మాదిరి ఉన్న శరీరం క్రమంగా తన ఆకృతిని మ
Search Engine

బయలాజికల్ మదర్
ఫేస్బుక్ ఓసీడీ (FBOCD)
నిజం ఆవస్యకత
నిజాలన్నీ అబద్దాలే
కెరీర్
చీమ మెదడులో చేరిన వైరస్
వ్యక్తి
జీవితం
హ్యూమనిజం
నేనెవరు?
PTSD
డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు
రిజర్వేషన్స్
కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది?
టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?
మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా?
Autism Treatment
మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా?
NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు
టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన
పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!
పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?
మనుసులో భావాలే కలలుగా వస్తాయా?
కలలు నిజాలు అవుతాయా?
ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్
Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..?
తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?
టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి?
రెండవ కూతురు
ఏకాగ్రత పెంచుకోవడం ఎలా?
మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా?
ఫ్రీ థింకింగ్
పోరాటమా? బ్రతుకా?
more..
వాట్స్-యాప్