పిల్లల పెంపకం - నేటి పరిస్థితులు

పిల్లల

సృష్టిలో ఏ పేరెంట్స్ కి కూడా తమ బిడ్డలపై ప్రేమ లేకుండా ఉండదు. పురాణ కాలంలో ప్రహ్లాదుని తండ్రి అయిన హిరణ్య కశ్యపుని నుండి మొదలు నేటి తరం పేరెంట్స్ వరకు ఎవరూ కూడా తమ బిడ్డలు వృద్ధి లోకి రావాలనే తప్ప చెడిపోవాలి, సమాజానికి హానికరంగా మారాలని కోరుకోరు. కాని వారి వారి పెంపకం లో ఉన్న వైరుధ్యాల వలన బిడ్డలు వివిధ రకాలుగా ఎదిగి తరువాత గొప్ప వారిగా లేదా నేరస్తులుగా మారే అవకాశం ఉంది.

ఇటీవల నార్వే లో శిక్ష కు గురయిన తెలుగు దంపతుల విషయంలో కూడా వారికి తమ బిడ్డల పై ఉన్న ప్రేమను ప్రశ్నిమ్చాలేము. వారి ప్రతి ప్రయత్నము తమ బిడ్డలకు మంచి జీవితాన్ని అందించాలనే. దానిలో సందేహం లేదు. ఓస్లో కోర్టు ఆ పిల్లవాని మానసిక పరిస్థితిని పరిగణ లోకి తీసుకోక పోవటం విచారకరం. నాణానికి మరోవైపు చూసినట్లయితే, వారు ఆ పిల్లవానికి వాతలు పెట్టినట్లయితే అది ఏమాత్రం సమర్థించదగినది కాదు. వారి ఉద్ధ్యశ్యం మంచిదే అయినప్పటికీ ఆ విధమయిన ప్రవర్తన ఆ పిల్లవాని పట్ల ఏమాత్రం సత్పలితాలు ఇవ్వక పోగా సమస్యను ఇంకా జతిలం చేసే అవకాశం ఉంది.

బిడ్డల పెంపకంలో మన దేశంలో నేటి తరం అనుసరిస్తున్న విధానాలు సరయినవా అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే, చాల నిరాసకరమయిన పరిస్థితి కనిపిస్తుంది. మనకు కొంత కష్టమయిన ఒప్పుకొని తీరవలసిన నిజం. పూర్వ కాలంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వలన కొంత వరకు మేలు అనుకోవాలి. కాని నేడు విపరీత మయిన వేగం, పోటి జీవన విధానంలో పేరంట్స్ పిల్లలకు సరయిన న్యాయం చెయ్యలేక పోతున్నారు. ఉరుకులు పరుగుల తో కష్టపడి పనిచేసి బిడ్డలకోసం డబ్బు సంపాదిస్తున్నారే తప్ప వారికి కావలసిన సమయాన్ని కేటాయించలేక పోతున్నారు. డబ్బు వారికి మంచి జీవితాన్ని ఇస్తుందని భ్రమ పడుతున్నారు. పిల్లల పెమ్పకములో పొరపాట్లు జరగటానికి అనేక కారణాలు ఉన్నాయి.

లేట్ మ్యారేజ్స్
అనేక కారణాల వలన నేడు వివాహాలు చాల ఆలస్యంగా జరుగుతున్నాయి. ఆలస్యమవటం వలన వెంటనే ప్రణాళిక లేకుండా పిల్లలను కనటం. సరయిన వనరులు లేకపోవటం, పిల్లలను చూసుకోనేవారు లేకపోవటం. ఆయాల పైన, డే కేర్ ల పైన ఆధారపడవలసి వస్తుంది. పిల్లల పుట్టిన రోజులు జరుపుకోవటం లోఉన్న శ్రద్ద వారి పెంపకం పైన లేకపోవటం విచారించదగినది.

గర్భస్థ స్థితి నుండే
పిల్లల పెంపకం అంటే వారిని ఖరీదయిన స్కూల్ లో చేర్పించడం, ట్యూషన్ లు చెప్పించడం, ఖరీదయిన వస్తువులను కొనియ్యడం కాదు. పెంపకంలో సరయిన శ్రద్ధ వారు తల్లి కడుపులో పడ్డప్పుడు నుండి అవసరం. గర్భవతి అయిన స్త్రీ సరయిన ఆహారం తీసుకోక పోవడం పుట్టబోయే బిడ్డ ఎదుగుదల మీద వ్యతిరేక ప్రభావం చూపిస్తుంది. అంతే కాకుండా తను గర్భవతిగా ఉన్నప్పుడు ఎదుర్కున్న పరిస్థితులు, మానసిక పరిస్థితుల ప్రభావం పుట్ట బోయే బిడ్డ పైన ఉంటుంది. గర్భధారణ కు ముందు పేరెంట్స్ కు కౌన్సెలింగ్ చాల అవసరం. ఈ కాలంలో సిజేరియన్లు విపరీతంగా పెరిగినాయి. దీని ప్రభావం భవిష్యత్తులో పిల్లల మానసిక పరిస్థితి పైన విపరీతంగా ఉంటుంది.

కుటుంభ వ్యవస్థ
పూర్యం ఉమ్మడి కుటుంబాలలో తాత, నానమ్మ, పిన్ని, చిన్నన, మేనత్త ఇలా అనేక బంధుత్వాల తో కలసి పెరగటం వలన పిల్లలపై ఎవరో ఒకరు శ్రద్ద వహించే వారు. ఇప్పుడు ఆవిధమయిన కుటుంబ వ్యవస్థ నగరాలలోనే కాదు చిన్న చిన్న పట్టణాలలో కూడా కనిపించదు. ఇందుకు అనేక కారణాలు అనేకం ఉన్నప్పటికీ, పోటీ ప్రపంచంలో ఆర్ధికంగా నిలద్రోక్కుకోవాలనే తపన ముఖ్యమయినది. తల్లి, తండ్రి ఇద్దరూ కూడా సంపాదిస్తే తప్ప ఆర్ధికంగా నిలద్రోక్కుకోలేని పరిస్థితి. ఫలితంగా పిల్లల పైన సరయిన శ్రద్ధను పేరెంట్స్ వహించలేక పోతున్నారు.

వర్కింగ్ పేరెంట్స్
తల్లి, తండ్రి ఇద్దరూ పనిచేయటం వలన పిల్లలకు వారు సరయిన సమయం కేటాయించలేక పోవటం, తాత, నానమ్మలపైనానో, ఆయాల పైననో పూర్తిగా వదిలేయటం. వారు పిల్లలను సరిగా హేండిల్ చెయ్యలేక పోవటం జరుగుతున్నాయి. తల్లి దండ్రులు తమకు సమయం దొరికినపుడు పిల్లలను అతి గారభం చెయ్యడం, అవసరం అయిన వాటికంటే ఎక్కువ ఫెసిలిటీస్ కల్పించడం వలన వారు మొండిగా మారే అవకాశం ఉంది.

లింగ వివక్ష
ఈ రొజుకి కూడా మన దేశంలో మగ పిల్లవాడిని వశోద్ధరకుడిగా, ఆడ పిల్లను భారంగా భావించడం సర్వ సాధారణ మయిన విషయం. దీని వలన పిల్లల మానసిక పరిస్థితి సరిగా ఎదగక పోవడం జరుగుతుంది.

ద్వంద్వ ప్రమాణాలు
మోడలింగ్ లెర్నింగ్ అనేది పిల్లలు నేర్చుకోనే విధానాలలో ముఖ్యమయినది. తల్లి దండ్రులను చూసి పిల్లలు వారిని అనుకరించడం ద్వారా నేర్చుకుంటారు. తల్లి దండ్రులు వారు ఒక పనిని వారు చేస్తూ దానిని పిల్లలతో వద్దు అని చెబుతూ ఉంటారు. ఉదాహరణకు తండ్రి సిగరెట్ తాగుతూ కొడుకుని తాగకూడదు అని చెబుతాడు. తల్లి టీవీ చూస్తూ పిల్లలను చూడకూడదని చెపుతుంది. పిల్లల్లు తల్లి దండ్రులు ఏమి చెప్పారో కాకుండా ఏమి అనుసరిస్తున్నారో వాటిని చేర్చుకుంటారు.

పోల్చటం
తమ పిల్లలను ఇతర పిల్లలతో నిరంతరం పోల్చటం జరుగుతూ ఉంటుంది. ఇది పిల్లలకు చాల ఇబ్బంది కరమయిన పరిస్థితి. నిజానికి ఏ ఇద్దరు పిల్లలు ఒకే విధంగా ఉండరు. ఏ ఇద్దరినీ పోల్చటం సరయినది కాదు.

దండన
పిల్లల క్రమశిక్షణ లో భాగంగా పిల్లలను దండించడం మన దేశంలో సాధారణ మయినది. పిల్లలు నేరస్తులు కాదు. మొక్కై వంగనిది మ్రానై వంగునా అన్న దానిని గ్రుడ్డిగా అనుసరిస్తూ పిల్లలను పేరెంట్స్ దండిస్తూ ఉంటారు. కాని ఇది ఏ మాత్రం సరైన ఫలితాలను ఇవ్వక పోగ వారి మానసిక స్థితి పైన వ్యతిరేకంగా పని చేస్తుంది. పేరెంట్స్ సరైనా అవగాహన లేకుండా పిల్లలను వారికి కోపం వచ్చినప్పుడు దండిస్తూ ఉంటారు. కొన్ని సార్లు ఇతరుల పై కోపంతో, లేదా విపరీత మయిన ఒతిడి తో, పిల్లలను దండిస్తారు.

అవగాహనా రాహిత్యం
పిల్లలను కనగానే వారిని పెంచే అవగాహన వచ్చినట్లుగా పేరెంట్స్ భావిస్తుంటారు. కాని పిల్లలను పెంచడం అనేది చాల క్లిష్టమయినది. దానికి సరైన శిక్షణ, ఓర్పు ఏంటో అవసరం. పేరెంట్స్ కు కౌన్సెలింగ్ చాల అవసరం. కాని ఇటువటివి మన దేశంలో ఎక్కడా కనిపించవు.

మీడియా ప్రభావం
గత దశాబ్ద కాలంగా మీడియా లో పెను మార్పులు సంభవించాయి. అవి ఒక విధంగా సమాజానికి మంచి చేస్తున్న, మరో విధంగా హాని కలిగిస్తున్నది. పేరెంట్స్ తమకు సమయంలేక పోవటం, ఓపిక లేక పోవడం తో, పిల్లలను టీవీ, వీడియొ గేమ్స్, ఇంటర్నెట్ వైపు ప్రోత్సహితుంటారు. ఇంట్లో ఉన్న పెద్దవారు తాము సీరియల్స్ చూడటం కోసం పిల్లలను కూడా చూడటానికి ప్రోత్సహితారు. పిల్లలు ఆ సీరియల్స్ లోని పాత్రలను అనుకరించడం జరుగుతుంది.

స్కూల్స్
స్కూళ్ళలో ఆట స్థలాలు లేక పోవటం. చిన్నవయస్సులో వారికి ఇష్ట పడేవి కాకుండా, ఎక్కువ సంపాదనకు అనువయిన కోర్సుల కోసం ఒత్తిడి చేయటం జరుగుతూ ఉంది. వారి సృజన్నత్మతకు విలువ లేకపోవటం, సమాజంలో ద్వంద్వ ప్రమాణాలు పిల్లలను విపరీతమయిన ఒత్తిడికి గురి చేస్తున్నాయి.

ఈ విధంగా అనేక రకాల కారణాలతో పిల్లల పెంపకంలో పేరెంట్స్ పిల్లలకు వారికి తెలియకుండా అన్యాయం చేస్తున్నారు. వారి ఉద్దేశ్యం మంచిదే అయినా అనుసరిస్తున్న విధానాలలో లోపల్లున్నాయి. వీటిని అధిగమించడానికి ప్రభుత్వాలు, స్వచ్చంద సంస్థలు, వ్యక్తులు అందరు కూడా మూలల నుండి మార్పుకు కృషి చెయ్యాలి. ప్రతి తల్లి, తండ్రి తమ పిల్లను భాధ్యతాయుతమయిన పౌరులుగా తీర్చి దిద్దటం ప్రధమ కర్తవ్యం.

"నేటి బాలలే రేపటి పౌరులు."

- హరి రాఘవ్

Keywords : kids, parenting, child, teens
(22.10.2017 06:15:50pm)

No. of visitors : 2667

Suggested Posts


10 results found !


బయలాజికల్ మదర్

19 సంవత్సరాల స్నేహ కడప జిల్లా జమ్మలమడుగు నుండి హైదరాబాద్ వచ్చి హాస్టల్లో ఉంటూ బి.ఫార్మసీ చదువుతుంది. గత కొన్ని నెలలుగా తీవ్రమైన డిప్రెషన్‌తో బాధ పడుతున్న స్నేహ కౌన్సిలింగ్ తీసుకుంటుంది. ఆమె బాల్యం గురించి లోతయిన విశ్లేషణ చేస్తున్నపుడు కొన్ని సున్నితమైన అంశాల పైన మరింత స్పష్టత వచ్చింది. స్నేహకు ఊహ తెలిసీ తెలియని వయస్సులో తల్లి చనిపోయింది. బయటి వాళ్ళయితే

టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?

టీనేజ్ పిల్లలో వచ్చే మానసిక శారీరక మార్పులేంటి? వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? వారితో తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలి?

పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!

మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!

పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?

పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?

తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?

తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?

ఒంటరి బిడ్డ వలన ఇబ్బంది ఏంటి?

ఇందిరా గాంధీ హయాములో దేశంలో జనసాంద్రత ఎక్కువగా ఉంది దాన్ని నియంత్రించాలని కుటుంభం నియంత్రణ పథకాలను తెచ్చారు. ప్రభుత్వం చాల డబ్బు వెచ్చించి చిన్నకుటుంబం వల్ల కలిగే లాభాలను ప్రచారం చేసింది. ʹమేమిద్దరం మాకిద్దరుʹ అనే నినాదం దేశంలో ప్రతీ గ్రామంలో గోడలపైన దర్శనమిచ్చింది. పీవీ నరసింహారావు హయాంలో మొదలయిన గ్లోబలైజేషన్ వల్ల ప్రజలలో ఆర్థికంగా పోటీ పడటం పెరిగి చివర

పిల్లలు చదవడం లేదని కొడుతున్నారా?

పిల్లలు చదవడం లేదని కొడుతున్నారా?

ఆనందపు తలుపులు

మనిషి జీవితానికి పరమార్థం వెతికే పనిలో పడతారు కొందరు మేధావులు. హాయిగా జీవించడమే తప్ప మారే పరమార్థం ఉండేది తెలుసుకుంటారు అందులో కొందరు. భార్య పిల్లలను వదిలి జ్ఞానం కోసం వెళ్లిన బుద్ధుడు ప్రపంచాన్ని గురువు, దేవుడు అయ్యాడు. కానీ ఆ భార్య పిల్లల దృష్టిలో బుద్ధుడు వేరు. సమాజంలో ఉన్న స్థితిని మరచి, ఉన్న భాద్యతలు మరచి భవిష్యత్తుకు ఇతరులను వదిలి వెళ్లడం వల్ల సమాజ

పిల్లల జ్ఞాపకశక్తి - తల్లిదండ్రుల పాత్ర - 2

చదువు అనగానే జ్ఞాపక శక్తి గుర్తు వస్తుంది. చాలామంది తల్లిదండ్రులు నా కొడుకుకి జ్ఞాపక శక్తి తక్కువ, లేదా నాకూతురికి తెలివి తక్కువ వంటి పదాలు వాడటం చూస్తాము. జ్ఞాపకశక్తి, తెలివి ఇవి వేటికి అవి వేరువేరు కాదు. వీటితో పాటు అనేక అంశాలు మిళితమై ఉంటాయి. ఒక విద్యార్థి తను ఒకసారి చూసిన సినిమా డైలాగ్స్ గుర్తుపెట్టుకున్నంత బాగా తన సబ్జక్ట్స్ విషయాలను గుర్తు పెట్టు
Search Engine

బయలాజికల్ మదర్
ఫేస్బుక్ ఓసీడీ (FBOCD)
నిజం ఆవస్యకత
నిజాలన్నీ అబద్దాలే
కెరీర్
చీమ మెదడులో చేరిన వైరస్
వ్యక్తి
జీవితం
హ్యూమనిజం
నేనెవరు?
PTSD
డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు
రిజర్వేషన్స్
కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది?
టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?
మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా?
Autism Treatment
మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా?
NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు
టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన
పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!
పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?
మనుసులో భావాలే కలలుగా వస్తాయా?
కలలు నిజాలు అవుతాయా?
ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్
Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..?
తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?
టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి?
రెండవ కూతురు
ఏకాగ్రత పెంచుకోవడం ఎలా?
మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా?
ఫ్రీ థింకింగ్
పోరాటమా? బ్రతుకా?
more..
పిల్లల