యువతను డిప్రెషన్ లోకి నెడుతున్న ఫేస్బుక్
ప్రస్తుత సోషల్ మీడియాలో ఫేస్బుక్ దే అగ్రస్థానం. దాదాపు సోషల్ మీడియా ఉపయోగించే వారందరికీ ఫేస్బుక్ అకౌంట్ ఉంటుంది. ట్విట్టర్ తో సహా అనేక ఇతర సోషల్ మీడియా సైట్ లు ఉన్నప్పటికీ ఫేస్బుక్ ఇచ్చేటటువంటి ఫీచర్స్ వల్ల యూజర్స్ ఫేస్బుక్ కి అతిగా అటాచ్ అవుతున్నారు. కొందరు రోజుకు 6 నుంచి 8 ఫేస్బుక్ లో గడపటం కూడా జరుగుతుంది.
సామజిక ఉద్యమాలకు, భావజాల వ్యాప్తికి ఫేస్బుక్ మంచి వేదికగా మారింది. కొత్త కొత్త వ్యక్తులను సులభంగా కలవటం ఇబ్బంది ఉన్నట్లయితే వారిని బ్లాక్ చేసుకోవటం వంటివే కాకుండా చిన్నతనంలో కోల్పోయిన స్నేహితులను మరల పొందే అవకాశం ఫేస్బుక్ సామాన్యులకు కల్పిస్తుంది.
మరీ ముఖ్యంగా ఇంట్రావర్ట్స్ కి ఫేస్బుక్ ఒక అద్భుతమయిన సాధనంగా ఉపయోగపడుతుంది. ఇంతో విలువయిన ఆలోచనలు ఉన్నటువంటి ఇంట్రావర్ట్స్ నిజజీవితంలో ఇతరులతో కలవటానికి ఇబ్బంది పడతారు. ఇటువంటి వారు కూడా ఫేస్బుక్ వేదికగా తమ ఆలోచనలను ఇతరులతో పంచుకోగలుగుతున్నారు. అలాగే పేద కళాకారులు తమ సృజనాత్మకతను ఫేస్బుక్ ద్వారా ప్రపంచానికి తెలియజేయగలుగుతున్నారు.
ఫేస్బుక్ వల్ల అనుకూల ఫలితాలే కాకుండా దారుణమైన ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సెల్ఫ్-ఎస్టీమ్ తక్కువ ఉన్నవారు, మరియూ ఇంట్రావర్ట్స్ ఫేస్బుక్ వల్ల తీవ్రముగా డిప్రెషన్ కి లోనవుతున్నట్టు లేటెస్ట్ సర్వే లు తెలుపుతున్నాయి. వీరు అధిక సమయం ఫేస్బుక్ మీద గడుపుతూ ఉండటం వల్ల వారి పనులను సకాలంలో నిర్వర్తించలేక పోతున్నారు. అసలే ఇతరులతో కలవటానికి ఇబ్బంది పడే వీరు నిజ సమాజం నుండి పూర్తిగా దూరమవుతున్నారు.
అంతే కాకుండా ఫేస్బుక్ లో వీరు కొందరితో అతిగా అటాచ్ అయి ఎమోషనల్ డిపెండెంట్ గా మారుతున్నారు. కొన్ని సందర్భాలలో వారు ఎవరి మీదనయితే ఆధార పడుతున్నారో వారి రోజువారీ పనులలో నిమగ్నమయిన భరించలేని పరిస్థితికి చేరుకోవటం, ఎదుటి వారి పట్ల పోసిస్సివ్ గా ఉండటం వారు ఎవరితోనయినా సంతోషంగా గడిపినట్లు కనిపించినా భరించలేని స్థితికి చేరుకుంటున్నారు. వీరిలో ʹసోషల్ కంపారిసన్ʹ విపరీతంగా ఉంటుంది. ఎప్పుడయితే ఎదుటివాళ్ళకు వీరి పట్ల చిరాకు వచ్చి బ్లాక్ చేసినా విపరీతమయిన డిప్రెషన్ కి లోనవ్వటం జరుగుతుంది. కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడే అవకాశాలున్నాయి. ఇటువంటి లక్షణాలు ఎక్కువగా టీన్స్ లోను, యువతలోనూ కనిపిస్తున్నాయి.
ఇటువంటి వారిని గుర్తించి తగిన కౌన్సిలింగ్ ఇప్పించాల్సిన భాద్యత ప్రధమంగా పేరెంట్స్ పైన ఉంది. అయితే భారత్ లో ఫస్ట్ జెనెరేషన్ ఎడ్యుకేటెడ్ కూడా ఫేస్బుక్ ఉపయోగించడం వల్ల పేరెంట్స్ వీటిని అర్థం చేసుకునే స్థితిలో లేరు. అటువంటి సందర్భాలలో టీచర్స్ మరియూ మిగిలిన సమాజం కూడా వీరిని గుర్తించాల్సి ఉంది. మరీ ముఖ్యంగా ఫేస్బుక్ పైన అధికంగా సమయం గడిపే ఇంట్రావర్ట్స్, సెల్ఫ్-ఎస్టీమ్ తక్కువ ఉన్నవారిని గమనిస్తూ ఉండాలి. వారు ప్రవర్తనలో మార్పులు గమనిస్తే వెంటనే కౌన్సిలింగ్ ఇప్పించాలి.
- హరి రాఘవ్
Keywords : facebook, social media, depression, loneliness, psychology
(26.10.2017 07:17:14pm)
No. of visitors : 565
Suggested Posts
10 results found !
| ఫేస్బుక్ ఓసీడీ (FBOCD)ఫేస్బుక్ ఓసీడీ (FBOCD) మూడు రకాలుగా ఉంటుంది. ఇందులో #మొదటి రకం వారు తెల్లవారు ఝామున లేచిన వెంటనే ʹగుడ్ మార్నింగ్ʹ అంటూ పోస్ట్ పెట్టడడం తో ప్రారంభమయి అర్థ రాత్రి గుడ్ నైట్ అని పెట్టే వరకు కొనసాగుతుంది. ఈ మధ్యలో |
| నిజం ఆవస్యకతనిజాన్ని తెలుసుకోవడం అవసరమే. కానీ ప్రతీ నిజాన్ని తెలుసుకోవడం వల్ల జీవితం వృధా అవుతుంది. జ్ఞానం అనంతం. మనిషి జీవితం పరిమితం. పరిమిత జీవితకాలంలో చాలా వరకు తనకు తెలియకుండా సమాజ ప్రభావంతో కొట్టుకుపోతాడు. తనకు అర్థమయ్యింది అనుకునే లోపే తను అర్థం చేసుకున్నదంతా తప్పని అర్థమవుతుంది.
మనిషి తన మానసిక జీవితానికి సంబంధం లేని ఏ నిజాన్ని తెలుసుకున్నా అది వృధానే. అంత |
| కెరీర్ʹహరి రాఘవ్ గారు!! మీరెన్ని చెప్పినా మనిషి కెరీర్ కే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనిపిస్తుంది. మీ మాటలను నమ్మి ఒక్క రోజు రెస్ట్ తీసుకున్నా కెరీర్ లో వెనుకబడి పోవడం ఖాయం. మిగిలిన వాళ్ళు ముందుకు వెళ్లి పోతారు. అంతెందుకు మీరు మాత్రం అన్నేసి కౌన్సెలింగ్స్ ఇవ్వడం లేదా? మీకు కూడా కెరీర్ ముఖ్యం కాదా? నా కెందుకో మీరు చెప్పే దానిని పూర్తిగా నమ్మ బుద్ధి కావడం లేదు.ʹ
ʹనమ్ |
| చీమ మెదడులో చేరిన వైరస్చాల కాలం క్రితం ఒక ప్రత్యేకమైన చీమల జాతి ఉండేదట. ఆ జాతి అంతరించి పోవడానికి ఒక అరుదైన వైరస్ కారణం. ఈ వైరస్ కేవలం ఆ చీమల మెదడు ఆధారం గానే జీవించగలదు. అడవిలో నివసించే ఈ చీమలు చాల శక్తివంతమైనవి మరియూ తెలివయినవి కూడా. ఎలా చేరిందో తెలియదు ఆ అరుదైన వైరస్ ఆ చీమల జాతికి చెందిన ఒక చీమ మెదడులోకి చేరుకుంది.
అప్పటి నుండి ఆ వైరస్ ఆ చీమ మెదడును హ్యాండిల్ చెయ్యడం మొదలు |
| వ్యక్తినిజానికి ఈ సమాజంలో మారాల్సింది ఏదయినా ఉంది అంటే అది నేనే (వ్యక్తి). నేను మారితే మొత్తం సమాజం మారుతుంది. నేను మారకుండా సమాజం మారదు. వ్యక్తిగా ఎదగలేని నేను సమాజాన్ని మార్చాలని ప్రయత్నించడం వృధా మరియూ నన్ను నేను చేసుకునే మోసం. |
| జీవితంఆధునిక కాలంలో మనిషి తన జీవితంలో ఎదురయ్యే ఆనందాన్ని అనుభవించడం కన్నా, తను ఆ స్థితికి చేరుకున్నాని ఇతరులకు తెలియజేయడంలో ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు. అనుకోకుండా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడినా లేదా ఏదైనా విహార యాత్రకు వెళ్ళినా ఆ అందమైన అనుభూతులను ఆస్వాదించ కుండా అక్కడ సెల్ఫీలు ఎలా తీసుకుంటే బాగుంటదో అనే ఆలోచనలే వారి మనస్సులో మొదలవుతాయి. |
| హ్యూమనిజంహ్యూమనిజం జంతువుల వలే కాకుండా మనిషి సహజంగా విలువలతో కూడిన ప్రవర్తన కలిగియుంటాడు, తరువాత సమాజ ప్రభావం వలన చెడుగా మారతాడు అని నమ్ముతుంది. దీనినే #హ్యూమనిస్టిక్ #సైకాలజీ అని కూడా అంటారు. పర్సన్ సెంటర్డ్ థెరపీ, సెల్ఫ్-యాక్షువలైజేషన్ వంటి థెరపీలు హ్యూమనిజంలో భాగాలు.
యాభైవ దశకంలో అబ్రహం మాసలౌ, కార్ల్ రోజర్స్, షార్లెట్ బహెల్ర్ మరియూ కొందరు సైకాలజిస్ట్లు ప్రతిప |
| నేనెవరు?Who am I? | Hari Raghav |
| కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది?ఒక వ్యక్తికి ఒక సబ్జెక్టు పట్ల ఇంటరెస్ట్ ఉన్నదీ లేనిదీ ఎలా తెలుస్తుంది? కెరీర్ ఎన్నుకునేటపుడు ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి? ఒకవేళ కెరీర్ మార్చుకోవాల్సి వస్తే ఎటువంటి శ్రద్ధ వహించాలి? |
| టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?టీనేజ్ పిల్లలో వచ్చే మానసిక శారీరక మార్పులేంటి? వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? వారితో తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలి? |
| డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు |
| కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది? |
| టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి? |
| మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా? |
| మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా? |
| NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు |
| టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి? |
| బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన |
| పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? |
| మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!! |
| పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా? |
| మనుసులో భావాలే కలలుగా వస్తాయా? |
| Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..? |
| తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా? |
| టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి? |
| మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా? |
more..