ఓ ఆదివాసీని కొట్టి చంపారు..ప్రశ్నించిన వారిపై కాల్పులు జరిపి మరొకరిని చంపేశారు

ఓ

గుజరాత్‌లోని దాహోద్‌ జిల్లా జేసావాడా పట్టణ పోలీసులు ఓ దొంగతనం కేసులో చిలకోట అనే గ్రామానికి చెందిన‌ ఓ ఆదివాసీని నిందితుడిగా నిర్ణయించారు. బుధవారంనాడు హుటాహుటిన ఆగ్రామానికి వెళ్ళి అతని సోదరుడైన కమేశ్ గమారా అనే వ్యక్తిని పట్టుకొచ్చారు. ఓ రోజంతా పోలీసులు అతన్ని తీవ్ర చిత్రహింసలపాల్జేశారు. పోలీసుల క్రూరమైన హింసలకు తట్టుకోలేక కమేశ్ చనిపోయాడు. దాంతో ఆ అన్యాయాన్ని ప్రశ్నించడానికి గురువారం చిలకోట గ్రామానికి చెందిన 5 వందల మంది ఆదివాసులు పోలీసు స్టేషన్ కు చేరుకొని నిరసనకు దిగారు. దాంతో కస్టడీ మృతి కేసు ఎక్కడ తమ మీదకు వస్తుందోననే భయంతో పోలీసులు ఆ ఆదివాసులను అక్కడినుండి తరిమేయడానికి దొరికిన వారిని దొరికినట్టు చితకబాదారు. బాష్పవాయువు ప్రయోగించారు. అంతటితో సరిపెట్టక నిరసనకారులపై గన్‌ ఎక్కుపెట్టి కాల్పులు జరపటం మొదలుపెట్టారు. ఈ కాల్పుల్లో రామాసు మొహానియా అనే ఆదివాసీ మృతి చెందగా అనేక మంది గాయాలపాలయ్యారు. కొన్ని పోలీసు వాహనాలు తగలబడిపోయాయి. వాటిని ఆందోళనకారులే తగులబెట్టారని పోలీసులు ఆరోపిస్తుండగా తమపై కేసులు బనాయించేందుకు పోలీసులే ఈ ఈ కుట్ర‌కు పాల్పడ్డారని ఆదివాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోలీసు కాల్పుల్లో చనిపోయిన మొహానియాకు ఆందోళనతో ఎలాంటి సంబంధంలేదని ఆయన కుటుంబసభ్యులు చెబుతున్నారు. పొరుగున అమిల్‌ గ్రామానికి చెందిన మొహానియా కూరగాయాల కోసం జేసావాడకు వచ్చి పోలీసు కాల్పుల్లో మృతి చెందారని వారు చెబుతున్నారు.

Source : Avani News

Keywords : tribe, Gujarat, fire
(29.10.2017 01:38:53pm)

No. of visitors : 1758

Suggested Posts


5 results found !


కల్యాణి

ఈ గోండు వనిత చిన్నదే. డిగ్రీ దాకా చదివింది. ఓపెన్ యూనివర్సిటీ లో. తనకు నాలుగు నెలల పాప. భర్త అదే తండాకు చెందిన వాడు. వ్యవసాయం చేస్తాడు. చిత్రమేమిటంటే ఆమెకు బిడ్డ పుట్టాకే పెళ్లి అయింది. అదేమిటనుకోకండి. విశ్వాసం పునాదిగా బతికే మనుషుల్లో ఏది ఆలస్యం కాదు, భయమూ లేదు. అవును. నెల తప్పింది. ఇంట్లో చెప్పింది. చూస్తున్నారుగా. వీరే తల్లీదండ్రులు. ఏమనలేదు. మనలా తి

గొత్తికోయలను మానవ దృక్పధంలో ఆదుకోవాలి

ప్రకృతిలో సరిహద్దు నాగరిక మానవులు గీసుకున్న ఊహాజనిత రేఖలే తప్ప అవి నిజమయినవి కావు. రాష్ట్ర సరిహద్దులు, దేశ సరిహద్దులు కేవలం నాగరిక మానవులకు మాత్రమే ఉంటాయి. పక్షులు, జంతువులు, సెలయేర్లు, నదులకు ఎటువంటి సరిహద్దులు ఉండవు. అలాగే ప్రకృతితో సహజీవనం చేస్తున్న ఆదివాసులకు సరిహద్దుల పేరిట విడదీయటం సరికాదు. సెప్టెంబర్ నెలలో భూపాలపల్లి జిల్లాలో గొత్తికోయల మీద పోలీస

అమాయక గొత్తి కోయల్ని తరలించొద్దు - హైకోర్టు

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం జలగలంచ గ్రామంలో నివసిస్తున్న గొత్తి కోయలను అక్కడి నుంచి ఖాళీ చేయించవద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. గొత్తి కోయల జీవన విధానా నికి ఇబ్బందులు కల్పించరాదని, వెంటనే వారికి తాగునీటి సౌకర్యం కల్పించాలని ఆదేశిస్తూ మధ్యం తర ఉత్తర్వులు జారీ చేసింది. అడవుల్లో నివాసం ఉండేందుకు ఆదివాసీలకు చట్టం వెసులు

అమాయక గిరిజనులపై నగరపు వికృతదాడి

వారంతా అమాయకపు గిరిపుత్రులు. వారంతా ప్రకృతి ఒడిలో స్వచ్ఛమైన నవ్వులు చిందిస్తూ బ్రతికే మానవులు. వారంతా చెట్లు చేమలతో, అడవి జంతువులతో ప్రేమతో కలసి జీవనం సాగిస

ఎంత కాలం ఈ రిజర్వేషన్స్..??

కొందరు ఆదివాసులకు, దళితులకు, బిసిలకు వేల సంవత్సరాలుగా అన్యాయం జరిగన మాట వాస్తవమే. అందుకు బదులుగా ఇచ్చిన రిజర్వేషన్స్ ఒప్పుకుంటాము కానీ ఎన్ని సంవత్సరాలని ఇస్
Search Engine

బయలాజికల్ మదర్
ఫేస్బుక్ ఓసీడీ (FBOCD)
నిజం ఆవస్యకత
నిజాలన్నీ అబద్దాలే
కెరీర్
చీమ మెదడులో చేరిన వైరస్
వ్యక్తి
జీవితం
హ్యూమనిజం
నేనెవరు?
PTSD
డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు
రిజర్వేషన్స్
కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది?
టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?
మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా?
Autism Treatment
మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా?
NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు
టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన
పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!
పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?
మనుసులో భావాలే కలలుగా వస్తాయా?
కలలు నిజాలు అవుతాయా?
ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్
Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..?
తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?
టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి?
రెండవ కూతురు
ఏకాగ్రత పెంచుకోవడం ఎలా?
మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా?
ఫ్రీ థింకింగ్
పోరాటమా? బ్రతుకా?
more..
ఓ