వచ్చే చలికాలంలో నేనింక బతకను

వచ్చే

ప్రొఫెసర్ సాయిబాబా అక్టోబర్ 17న రాసిన ఉత్తరం వసంతకు అక్టోబర్ 25న అందింది.

ప్రియమైన వసంత

రాబోయే చలికాలం తలచుకుంటే భయమేస్తోంది. ఇప్పటికే విడువని జ్వరంతో వణికిపోతున్నాను. నా దగ్గర దుప్పటి లేదు. స్వెటర్ గానీ, జాకెట్ గానీ లేవు. ఉష్ణోగ్రత తగ్గిపోయే కొద్దీ నా రెండు కాళ్ళలో, ఎడమ చేతిలో నొప్పి భరించలేనంతగా పెరిగిపోతుంది. నవంబర్ నుండి ఇక్కడ ప్రారంభమయ్యే చలికాలంలో నేను జీవించి ఉండటం అసాధ్యం. చివరి ఊపిరులు తీసుకుంటున్న జంతువులాగా నేనిక్కడ పడి ఉన్నాను. ఎనిమిది నేలలు ఎలాగో ప్రాణాన్ని నెట్టుకొచ్చాను. కానీ వచ్చే చలికాలంలో నేనింక బతకను. నేనిది కచ్చితంగా చెప్పగలను. ఇక మీదట నా ఆరోగ్యం గురించి రాయడం కూడా నిష్ప్రయోజనం.

ఈ నెలాఖరుకల్లా ఎలాగైనా సీనియర్ న్యాయవాదిని ఏర్పాటు చేయి. నవంబర్ మొదటి వారంలో గాని, వీలైతే అక్టోబర్ చివరి వారంలోగానీ నా బెయిల్ అప్లికేషన్ పెట్టమని గాడ్లింగ్ గారికి చెప్పు. ఇలా చేయకపోతే నా పరిస్థితి చేయి దాటి పోతుందని గుర్తించు. దానికి నేను బాధ్యుడిని కాను. దీని గురించి ఇక మళ్ళీ రాసేది కూడా ఉండదని స్పష్టం చేస్తున్నా.

మిసెస్ రెబెక్కా గారితో, నందితా నారాయణ్ తో నువ్వు మాట్లాడాలి. అలాగే ప్రొఫెసర్ హరగోపాల్ తో, మరి కొందరితో కూడా మాట్లాడు. పరిస్థితి వివరంగా చెప్పు. త్వరపడాలి. మీ అందరికీ పదే పదే యాచకుడిలా, దిక్కులేనివాడిలా మొరపెట్టుకొని నేను మానసికంగా కుంగిపోతున్నాను. కానీ ఎవరూ ఒక్క అంగుళం కూడా కదలడం లేదు. నా ప్రస్తుత పరిస్థితి ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. తొంబై శాతం వైకల్యం ఉన్న మనిషి, పని చేస్తున్న ఒకే ఒక చేయితో పోరాడుతూ, అనేక జబ్బులతో బాధపడుతూ జైలు ఊచల వెనక ఉన్నాడని ఎవరూ అర్థం చేసుకోరు. నా జీవితం గురించి ఎవరూ పట్టించుకోరు. ఇది కేవలం నేరపూరిత నిర్లక్ష్యం. నిర్దయాపూరిత వైఖరి.

నీ ఆరోగ్యం జాగ్రత్త. నీ ఆరోగ్యమే నా ఆరోగ్యం, మొత్తం కుటుంబ ఆరోగ్యం. నీ ఆరోగ్యం గురించి ఆలోచించే వాళ్ళు ఇప్పటికైతే ఇంకెవరూ లేరు. నేను నీ దగ్గరికి వచ్చే వరకు నువ్వు నీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకుండా కాపాడుకోవాలి.

బోలెడంత ప్రేమతో
నీ
సాయి

Keywords : saibaba, human rights
(29.10.2017 10:13:14pm)

No. of visitors : 2606

Suggested Posts


5 results found !


హ్యూమనిజం

హ్యూమనిజం జంతువుల వలే కాకుండా మనిషి సహజంగా విలువలతో కూడిన ప్రవర్తన కలిగియుంటాడు, తరువాత సమాజ ప్రభావం వలన చెడుగా మారతాడు అని నమ్ముతుంది. దీనినే #హ్యూమనిస్టిక్ #సైకాలజీ అని కూడా అంటారు. పర్సన్ సెంటర్డ్ థెరపీ, సెల్ఫ్-యాక్షువలైజేషన్ వంటి థెరపీలు హ్యూమనిజంలో భాగాలు. యాభైవ దశకంలో అబ్రహం మాసలౌ, కార్ల్ రోజర్స్, షార్లెట్ బహెల్ర్ మరియూ కొందరు సైకాలజిస్ట్లు ప్రతిప

తెగని మానవ సంబంధాల వేధిక నా తెలంగాణ

సరిగ్గా సంవత్సరం క్రితం ఒక స్నేహితుడి చెల్లి పెండ్లి సంబంధం గురించి కూకట్ పల్లి లో ఒక మ్యారేజ్ బ్యూరోకు నేను, నా స్నేహితుడు కలసి వెళ్ళాము. సైకాలజిస్ట్ అవ్వటం వలన ఎక్కడకు వెళ్ళిన అక్కడి మనుషుల ప్రవర్తనను నిశితంగా గమనించడం నా జీవితంలో భాగం అయిపోయింది. ఓ పెద్ద వయస్కుడు మ్యారేజ్ బ్యూరో నడుపుతున్నాడు. అతను అమ్మాయి (పెండ్లి కూతురు) ఫోటో మరియూ బయోడేట తీసుకొని,

మానవత్వం - హేతువాదం

తల్లిదండ్రుల సమాధుల మధ్యలో ఒక చిన్న పిల్లవాడు నిద్రిస్తూ ఉండే ఒక ఫోటో సామాజిక మాధ్యమాలలో ఎప్పటినుండో హల్ చల్ చేస్తుంది. దానిని నమ్మిన వారు తిరిగి షేర్ చెయ్యటం జరుగుతూ ఉంది. అయితే కొంచెం రీసెర్చ్ చేస్తే అది ఒక ఫోటో షూట్ లో భాగంగా తీసింది. అది నిజం కాదు అని తెలుస్తుంది. విషయం ఏమిటంటే ప్రతీ సందర్భంలోనూ మనస్సు హేతుబద్దంగానే ఆలోచిస్తోందా? అలాగే ఆలోచించాలా? కొ

మనిషి; దైవత్వం

మనిషి తనలోని దైవత్వాన్ని కోల్పోయినపుడు దైవం కోసం బయట వెతుకుతాడు. ఆ క్రమంలో ఇతరులను కలుస్తాడు. వారిలో దైవత్వాన్ని కూడా గుర్తించ లేక వారిని అడుగుతాడు. వారు చె

మానవత్వం లేని ఏ వాదమయినా అది ఉగ్రవాదమే..

ఏ వాదమయినా ఏదో ఒక సందర్భంలో అప్పటి పరిస్థితులను బట్టి వ్యక్తుల ఆలోచనల నుండి పుడుతుంది. ఏవాదం కూడా దానికి అదిగా గాలిలో నుండి పుట్టదు. వాదం ఏదయినా అప్పుడు ఆ వ
Search Engine

బయలాజికల్ మదర్
ఫేస్బుక్ ఓసీడీ (FBOCD)
నిజం ఆవస్యకత
నిజాలన్నీ అబద్దాలే
కెరీర్
చీమ మెదడులో చేరిన వైరస్
వ్యక్తి
జీవితం
హ్యూమనిజం
నేనెవరు?
PTSD
డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు
రిజర్వేషన్స్
కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది?
టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?
మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా?
Autism Treatment
మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా?
NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు
టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన
పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!
పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?
మనుసులో భావాలే కలలుగా వస్తాయా?
కలలు నిజాలు అవుతాయా?
ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్
Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..?
తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?
టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి?
రెండవ కూతురు
ఏకాగ్రత పెంచుకోవడం ఎలా?
మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా?
ఫ్రీ థింకింగ్
పోరాటమా? బ్రతుకా?
more..
వచ్చే