గొత్తికోయలను మానవ దృక్పధంలో ఆదుకోవాలి

గొత్తికోయలను

ప్రకృతిలో సరిహద్దు నాగరిక మానవులు గీసుకున్న ఊహాజనిత రేఖలే తప్ప అవి నిజమయినవి కావు. రాష్ట్ర సరిహద్దులు, దేశ సరిహద్దులు కేవలం నాగరిక మానవులకు మాత్రమే ఉంటాయి. పక్షులు, జంతువులు, సెలయేర్లు, నదులకు ఎటువంటి సరిహద్దులు ఉండవు. అలాగే ప్రకృతితో సహజీవనం చేస్తున్న ఆదివాసులకు సరిహద్దుల పేరిట విడదీయటం సరికాదు.

సెప్టెంబర్ నెలలో భూపాలపల్లి జిల్లాలో గొత్తికోయల మీద పోలీసుల అమానుష చర్యలు విచారకరం. పోడు వ్యవసాయం చేసుకునే గొత్తి కోయలను అడవిని నాశనం చేస్తున్నారు అనే వంకతో దాడి చేసారు. కానీ నిజానికి ఈ దేశంలో అడవిని నాశనం చేసింది కోయలు కాదు. కేవలం కార్పొరేట్లు మాత్రమే.

గొత్తి కోయలు అమాయకులు. వీరు మామూలు కోయల కంటే వెనక బడిన వారు. వీరికి అక్షర జ్ఞానం లేదు. కనీసం తెలుగు కూడా మాట్లాడటం రాదు. అడవిలో దొరకిన వనరుల ఆధారంగా తడికెలు, బుట్టలు అల్లటం. బ్రతకటం, వేట ఆడటం వారి ప్రధాన వృత్తి. ఇప్పుడిప్పుడే కొంత అభివృద్ధి చెంది పోడు వ్యవసాయమా కూడా చేస్తున్నారు. గొత్తి కోయలకు అడవిలో స్వేచ్ఛగా తిరగటం వారి జీవన విధానంలో భాగం. వారికి ఒక స్థిరమయిన ప్రాంతం ఉండదు. అడవిలో వేటాడుతూ వలస వెళ్ళటం సహజం. చివరికి ఎక్కడో ఒక చోట ఉండిపోతారు.

వీరు ఛత్తీస్ ఘడ్ బస్తర్ అడవులలో ఎక్కువగా ఉంటారు. బస్తర్ జిల్లాకు ఆనుకొని ఉన్న పేరూరు, వాజెడ్, వెంకటాపూర్, చర్ల ప్రాంతపు అడవులలో కూడా వీరు సంచరించే వారు. ఈ ప్రాంతాలు ఇంతకు పూర్వము భద్రాచలం డివిజన్, ఖమ్మం జిల్లాలో ఉండేవి. అంతకు పూర్వం తూర్పుగోదావరి జిల్లాలో ఉండేవి. గత ఏడు దశాబ్దాలుగా ఈ ప్రాంతం రకరకాలుగా మారింది. కానీ ప్రకృతి మారదు కదా. అక్కడ ప్రకృతిలో బ్రతుకుతున్న జీవులకు ఈ విషయాలు తెలియవు. అలాగే గొత్తి కోయలకు కూడా ఈ విషయాలు తెలియవు.

కనీసం తాము ఏ రాష్ట్ర పౌరులేమో తెలియని, కనీసం రాష్ట్రం అంటూ ఒకటి ఉంటుంది అని తెలియని, తమ దేశం భారత దేశం అని కూడా తెలియని అమాయక గొత్తి కోయలను మనవాళ్ళు కాదు అని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించడం విచారకరం. దాదాపు 70 లక్షల సీమాంధ్రులు రెండు రాష్ట్రాలలోను ఓటు హక్కు కలిగి హాయిగా తెలంగాణ వాళ్ళుగా చెలామణీ అవుతున్నారు. సమంత వంటి హీరోయిన్స్ ను తెలంగాణ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించి కోట్ల రూపాయిలు ముట్టజెప్పుతున్నాము. బాపట్ల ఎంపీ గా పనిచేసిన దగ్గుపాటి రామానాయుడికి కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్రప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపింది. అటువంటిది కొన్ని వందల మంది నిరుపేద అమాయక గొత్తి కోయలు తెలంగాణకు బరువయ్యారా?

నిజంగా తెలంగాణ ముఖ్యమంత్రి తలచుకుంటే గొత్తి కోయలను ఆదుకోవటం చాల సులభమయిన పని. ఇంత చిన్న పనికి వెనుకాడటం కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. అంతే కాకుండా రాజకీయంగా కూడా ప్రతి పక్షాలకు విమర్శించే అవకాశం కూడా కలుగుతుంది. రాజకీయాలు ఎలా ఉన్న నా తెలంగాణ గడ్డ భారతీయులు ఎవరయినా బ్రతుకు తెరువుకు వస్తే ఆశ్రయం ఇస్తుంది అని చెప్పుకోడానికి గర్వపడుతున్నాను. మనుషులెవరికయినా తెలంగాణ తన మావత్వాన్ని చూపుతుంది. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి పునరాలోచించాల్సి ఉంది. గొత్తి కోయలను మానవత్వ దృక్పధంలో చూడాలి.

- హరి రాఘవ్

Keywords : gotti, koyalu, tribes, telangana, adivasi
(31.10.2017 02:12:39pm)

No. of visitors : 2442

Suggested Posts


3 results found !


అమాయక గొత్తి కోయల్ని తరలించొద్దు - హైకోర్టు

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం జలగలంచ గ్రామంలో నివసిస్తున్న గొత్తి కోయలను అక్కడి నుంచి ఖాళీ చేయించవద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. గొత్తి కోయల జీవన విధానా నికి ఇబ్బందులు కల్పించరాదని, వెంటనే వారికి తాగునీటి సౌకర్యం కల్పించాలని ఆదేశిస్తూ మధ్యం తర ఉత్తర్వులు జారీ చేసింది. అడవుల్లో నివాసం ఉండేందుకు ఆదివాసీలకు చట్టం వెసులు

అమాయక గిరిజనులపై నగరపు వికృతదాడి

వారంతా అమాయకపు గిరిపుత్రులు. వారంతా ప్రకృతి ఒడిలో స్వచ్ఛమైన నవ్వులు చిందిస్తూ బ్రతికే మానవులు. వారంతా చెట్లు చేమలతో, అడవి జంతువులతో ప్రేమతో కలసి జీవనం సాగిస

ఎంత కాలం ఈ రిజర్వేషన్స్..??

కొందరు ఆదివాసులకు, దళితులకు, బిసిలకు వేల సంవత్సరాలుగా అన్యాయం జరిగన మాట వాస్తవమే. అందుకు బదులుగా ఇచ్చిన రిజర్వేషన్స్ ఒప్పుకుంటాము కానీ ఎన్ని సంవత్సరాలని ఇస్
Search Engine

బయలాజికల్ మదర్
ఫేస్బుక్ ఓసీడీ (FBOCD)
నిజం ఆవస్యకత
నిజాలన్నీ అబద్దాలే
కెరీర్
చీమ మెదడులో చేరిన వైరస్
వ్యక్తి
జీవితం
హ్యూమనిజం
నేనెవరు?
PTSD
డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు
రిజర్వేషన్స్
కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది?
టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?
మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా?
Autism Treatment
మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా?
NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు
టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన
పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!
పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?
మనుసులో భావాలే కలలుగా వస్తాయా?
కలలు నిజాలు అవుతాయా?
ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్
Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..?
తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?
టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి?
రెండవ కూతురు
ఏకాగ్రత పెంచుకోవడం ఎలా?
మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా?
ఫ్రీ థింకింగ్
పోరాటమా? బ్రతుకా?
more..
గొత్తికోయలను