ఆదివాసి.. లంబాడా వివాదం ‍-ఎం.రత్నమాల

ఆదివాసి..

ఆదిలాబాద్‌ (పాత) జిల్లాలో ఆదివాసీలు, లంబాడాల మధ్య గత రెండు నెలలుగా సాగుతున్న ఘర్షణ తెలంగాణలోని ఖమ్మం మొదలైన ఏజెన్సీ ప్రాంతాలకే కాదు, ఆదిలాబాద్‌ జిల్లా (పాత) పొరుగున రెండు రాష్ట్రాల సరిహద్దు మహారాష్ట్రలోని ఏజెన్సీ ప్రాంతాలకు ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్నది. 2017 అక్టోబర్‌ 6న జోడెన్‌ఘాట్‌లోని ఆదివాసి మ్యూజియంలో ఉన్న లంబాడా స్త్రీ విగ్రహాన్ని ఆదివాసీలు తగులబెట్టడం తో ఈ రెండు తెగల మధ్య ఘర్షణ మొదలైంది. ఈ ఘర్షణలకు మూలం 1976లో అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా ప్రకటించింది. మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి. ఈ వలసల ఉదృతి వల్ల అంతకు ముందు ఇక్కడ మైనస్‌ 2 శాతం మాత్రమే ఉన్న ఆదివాసీల జనాభా అభివృద్ధి రేటు ఒక్క 1976 సంవత్సరంలోనే 6 శాతం పెరిగింది. లంబాడాలను షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో మహారాష్ట్ర నుంచి వెల్లువెత్తిన లంబాడాల వలస కారణంగా జిల్లాలో ఒకే సంవత్సరంలో అంతకు ముందు మైనస్‌ జనాభా అభివృద్ధి రేటు ఇంత పెద్ద మొత్తంలో పెరగడానికి దారితీసింది. లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడాన్ని అదివాసీలు అప్పుడే వ్యతిరేకించారు. ఆనాటి నుంచి ఈ విషయంపై ఆదివాసీల అసంతృప్తి గతంలో కూడా అనేక పర్యాయాలు ఆదివాసీలు బహిరంగంగా ప్రకటిస్తూ వస్తూనే ఉన్నారు.

ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ వద్ద కొన్నిసార్లు, హైదరాబాద్‌లోని ట్రైబల్‌ వెల్‌ఫేర్‌ కమిషనరేట్‌ వద్ద ఆందోళనలు చేశారు. నేను పౌరహక్కుల సంఘం అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న కాలంలో రెండు సార్లు హైదరాబాద్‌లో మాసబ్‌ ట్యాంక్‌ పక్కన ఉన్న ట్రైబల్‌ కమిషనర్‌ కార్యాలయం వద్ద ఆదివాసీలు ఆందోళన చేసినప్పుడు నేను వారితో పాల్గొని కమిషనర్‌కి వినతి పత్రం ఇచ్చాం. ఇందువల్లనే గతంలో కూడా ఆదివాసీలకు ఈ విషయంపై ఆందోళన చేశారని చెప్పగలుగుతున్నాను.

అసలు ఆదివాసీలకు, లంబాడాలకు రూపురేఖల్లోనే శరీర వర్ణం, వస్త్రధారణ, ఆచార వ్యవహారాలు, మొత్తంగా ఈ రెండు వర్గాల సంస్కృతికి ఏమాత్రం పోలికలు లేవు. అభివృద్ధి విషయంలో కూడా మైదాన ప్రాంతాలతో సంబంధం ఉన్న లంబాడాలు విద్య, ఉద్యోగ, తదితర విషయాల్లో ఆదివాసీల కంటే ఎంతో ముందున్నారు. లంబాడాలను షెడ్యూల్డు తెగగా ప్రకటించిన తర్వాత ఆదిలాబాద్‌ (పాత) షెడ్యూల్డు తెగకు ప్రత్యేకించిన నియోజకవర్గాలన్నింటిలో ఎంఎల్‌ఎలు అత్యధికులు (పేరు చివరన రాథోడ్‌, నాయక్‌ కలిగినవారు లంబాడాలే) మండల, స్థానిక సంస్థల్లో కూడా లంబాడాలే అత్యధికంగా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో, గురుకుల పాఠశాలల్లోని, వీటికి అనుబంధంగా ఉన్న విద్యార్థి వసతి గృహాల్లో దాదాపు 60 శాతానికి పైగా లంబాడాలు ఉంటున్నారు. 1992 - 1994 సంత్సరాల్లో నేను ఆదిలాబాద్‌ జిల్లాలో దిన పత్రిక రిపోర్టర్‌గా పనిచేస్తున్న కాలంలో నేను జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి పరిశీలించిన, సేకరించిన సందర్భంలో నేను గుర్తించిన విషయం ఇది కనుకనే నేనీ విషయం స్పష్టంగా చెప్పగలుగుతున్నాను.

రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్డు (సి) సెక్షన్‌ పేరా 13 ఆర్టికల్‌ 244 (1) ప్రకారం లంబాడా ఉద్యోగులు ఆదివాసి షెడ్యూల్డు ప్రాంతాల్లో ఉద్యోగానికి అనర్హులంటూ జిల్లాలోని లంబాడా ఉద్యోగులను ఈ ప్రాంతం నుంచి పంపించాలని ప్రస్తుతం ఆందోళన కొనసాగిస్తున్న ఆదివాసీలు డిమాండ్‌ చేస్తున్నారు. జైనూరు మండంలోని మార్లవాయి పాఠశాలకు, ఆ తర్వాత నార్మూరు మండల కేంద్రంలోని పాఠశాలలకు ఆదివాసీలు తాళాలు వేశారు. అసలే అభద్రతా భావంతో ఉన్న ఆదివాసీలకు ప్రభుత్వ చర్యలు మరింత ఆజ్యం పోసినట్లయింది. అక్టోబర్‌ 6న ఆదివాసి మ్యూజియంలో లంబాడా స్త్రీ విగ్రహాన్ని తగలబెట్టారని పోలీసులు కేసు రిజిష్టర్‌ చేయడం, కొందరిని అరెస్టు చేయడం పట్ల నిరసనగా ఆదివాసీలు చేపట్టిన ర్యాలీకి అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్న పోలీసు అధికారులు లంబాడాల ర్యాలీకి అనుమతించడం ఆదివాసీల ఆగ్రహానికి అజ్యం పోసినట్లయింది. ఈ దాంతో నవంబర్‌ 12న లంబాడాలు తలపెట్టిన మరో ప్రదర్శనను పోలీసులు అనుమతించలేదు.

నవంబర్‌ 8న ఇంద్రవెల్లి స్థూపం వద్ద నుంచి ఉట్నూరు ఐటిడిఎకు ఆదివాసీలు నిర్వహించిన రోజే లంబాడా అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 25 మంది లంబాడా ఉపాధ్యాయులు ఐటిడిఎ ముందు ధర్మా చేశారు. ఇరు వర్గాల మధ్య ఐటిడిఎ ముందు తీవ్ర ఘర్షణ జరిగింది. అందుకే నవంబర్‌ 12న లంబాడాలు తలపెట్టిన సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కాని అంతకు ముందు లంబాడాల ధర్నాకు ఆదివాసీలు అదే రోజు ప్రదర్శన ఉందని తెలిసి కూడా అనుమతులు ఇచ్చారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇరు వర్గాల మధ్య సామరస్యతకు ప్రయత్నించడం కంటే రెచ్చగొట్టే వ్యవహారంగానే కనిపించడంలో అవాస్తవమేమీ లేదు.

ఏ విధంగా చూసినా ఆదివాసీల ఆగ్రహంలో న్యాయం ఉంది. ఇంత కాలంగా ఆదివాసీల్లో ఈ విషయంపై రగులుతూ వస్తున్న అసంతృప్తి ఇప్పుడు కట్టలు తెంచుకుని ఆందోళన అలజడి ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరింది. అంతేకాదు, గతకొంత కాలంగా వాల్మీకి బోయలు కూడా తమను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇట్ల ఒక తెగ తర్వాత మరో తెగ తమను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించాలని అంటూపోతే చివరికి తమ పరిస్థితి ఏమిటని ఆదివాసీలు ఆందోళన చెందుతున్నారు. లంబాడాలు కొంత కాలంగా తమను లంబాడాలు అనవద్దని, గొర్బాయిలు (గొరా - ఎరుపు వర్గం) అనాలని అంటున్నారు. కానీ, ప్రస్తుతం ఆదివాసీలతో ఘర్షణ పడుతున్న లంబాడాలు తాము చేస్తున్న ఆందోళనలన్నీ లంబాడా ఉపాధ్యాయ సంఘం - లంబాడా ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలోనే చేస్తున్నారు. కనుక నేను కూడా ఇక్కడ లంబాడాలనే పేర్కొంటూ రాయాల్సి వచ్చింది. లంబాడాలని షెడ్యూల్డు తెగగా ప్రకటించారు గనుక ఇక్కడ మాత్రం గొర్బాయిలు అనాలనే వాదన తెలివిగా దాటవెస్తున్నారు లంబాడాలు. ఎంతైన మైదాన ప్రాంతాల సంబంధంతో అబ్బిన తెలివి తేటలు కదా లంబాడాలవి. వెనక్కి పోతున్న కొద్దీ ఎప్పటికప్పుడు మారుమూలలకు నెట్టివేయబడుతున్న ఆదివాసీలు విగ్రహం తగలబెట్టారన్న ఐదుగురు ఆదివాసీలను అరెస్టు చేయడం వాళ్లను మరింత రెచ్చగొట్టడమే. ఈ అరెస్టు తర్వాతనే ఆదివాసీలు లంబాడా టీచర్లు వెళ్లిపోవాలంటూ పాఠశాలలకు తాళాలు వేశారు. దొంగే దొంగ అని అరిచినట్లు లంబాడాలు ఒక ఆదివాసి (కొలామ్‌ తెగ) యువకున్ని కొట్టి అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్‌, డబ్బులు లాక్కున్నారు. ఇది పిర్యాదు చేసినా పోలీసులు ఏ చర్యా తీసుకోలేదు. ఇవన్నీ చూసీ ప్రభుత్వం లంబాడాలతో కుమ్మక్కయిందని ఆదివాసీలు అనుకోవడంలో అవాస్తవమేమీ లేదు.

-ఎం.రత్నమాల, సీనియర్ జర్నలిస్టు, విరసం సభ్యురాలు
(సీనియర్ జర్నలిస్టు, విరసం సభ్యురాలు ఎం.రత్నమాల రాసిన ఈ వ్యాసం వీక్షణం డిసెంబర్, 2017 సంచికలో ప్రచురించబడినది)

Keywords : adivasi, lambada, adilabad, girijan, telangana, kcr, reservations
(03.12.2017 09:56:53pm)

No. of visitors : 1478

Suggested Posts


4 results found !


గొత్తికోయలను మానవ దృక్పధంలో ఆదుకోవాలి

ప్రకృతిలో సరిహద్దు నాగరిక మానవులు గీసుకున్న ఊహాజనిత రేఖలే తప్ప అవి నిజమయినవి కావు. రాష్ట్ర సరిహద్దులు, దేశ సరిహద్దులు కేవలం నాగరిక మానవులకు మాత్రమే ఉంటాయి. పక్షులు, జంతువులు, సెలయేర్లు, నదులకు ఎటువంటి సరిహద్దులు ఉండవు. అలాగే ప్రకృతితో సహజీవనం చేస్తున్న ఆదివాసులకు సరిహద్దుల పేరిట విడదీయటం సరికాదు. సెప్టెంబర్ నెలలో భూపాలపల్లి జిల్లాలో గొత్తికోయల మీద పోలీస

అమాయక గొత్తి కోయల్ని తరలించొద్దు - హైకోర్టు

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం జలగలంచ గ్రామంలో నివసిస్తున్న గొత్తి కోయలను అక్కడి నుంచి ఖాళీ చేయించవద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. గొత్తి కోయల జీవన విధానా నికి ఇబ్బందులు కల్పించరాదని, వెంటనే వారికి తాగునీటి సౌకర్యం కల్పించాలని ఆదేశిస్తూ మధ్యం తర ఉత్తర్వులు జారీ చేసింది. అడవుల్లో నివాసం ఉండేందుకు ఆదివాసీలకు చట్టం వెసులు

అమాయక గిరిజనులపై నగరపు వికృతదాడి

వారంతా అమాయకపు గిరిపుత్రులు. వారంతా ప్రకృతి ఒడిలో స్వచ్ఛమైన నవ్వులు చిందిస్తూ బ్రతికే మానవులు. వారంతా చెట్లు చేమలతో, అడవి జంతువులతో ప్రేమతో కలసి జీవనం సాగిస

ఎంత కాలం ఈ రిజర్వేషన్స్..??

కొందరు ఆదివాసులకు, దళితులకు, బిసిలకు వేల సంవత్సరాలుగా అన్యాయం జరిగన మాట వాస్తవమే. అందుకు బదులుగా ఇచ్చిన రిజర్వేషన్స్ ఒప్పుకుంటాము కానీ ఎన్ని సంవత్సరాలని ఇస్
Search Engine

బయలాజికల్ మదర్
ఫేస్బుక్ ఓసీడీ (FBOCD)
నిజం ఆవస్యకత
నిజాలన్నీ అబద్దాలే
కెరీర్
చీమ మెదడులో చేరిన వైరస్
వ్యక్తి
జీవితం
హ్యూమనిజం
నేనెవరు?
PTSD
డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు
రిజర్వేషన్స్
కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది?
టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?
మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా?
Autism Treatment
మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా?
NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు
టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన
పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!
పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?
మనుసులో భావాలే కలలుగా వస్తాయా?
కలలు నిజాలు అవుతాయా?
ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్
Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..?
తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?
టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి?
రెండవ కూతురు
ఏకాగ్రత పెంచుకోవడం ఎలా?
మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా?
ఫ్రీ థింకింగ్
పోరాటమా? బ్రతుకా?
more..
ఆదివాసి..