ఇంటిపై చిన్నారి తల గ్రహణం వేళ... క్షుద్రపూజ?

ఇంటిపై

ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చిలుకానగర్‌లో దారుణం చేటుచేసుకుంది. దాదాపు మూడునెలల వయస్సు కలిగిన చిన్నారి తలభాగాన్ని వేరుచేసి, భవనంపై వేశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం కలిగించింది. చంద్రగ్రహణం కావడం, చిన్నారి తలభాగం మాత్రమే లభ్యం కావడం, తలను వేరుచేయడంలాంటి అంశాల నేపథ్యంలో క్షుద్రపూజలు, ఇతర అంశాల నేపథ్యంపై స్థానికంగా చర్చంశనీయంగా మారింది. దీంతో స్థానిక ప్రజలు భయందోళనకు గురవుతున్నారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఉన్నతాధికా రులు సంఘటన స్థలానికి చేరుకొని సమగ్రవిచారణకు ఆదేశించారు. చిన్నారి తలభాగం లభ్యంకావడంపై అన్నివిభాగాల సహాయంతో కేసును దర్యాప్తు చేస్తున్నారు. జాయింట్ సీపీ తరుణ్‌జోషి, డీసీపీ ఉమామహేశ్వరశర్మ, ఏసీపీ కృష్ణమూర్తి సంఘటన స్థలాన్ని పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. వీరితోపాటు డాగ్‌స్కాడ్, క్లూస్‌టీం, ఎస్‌ఓటీ విభాగాలు కేసులో భాగమై ఆధారాలు సేకరిస్తున్నారు.

ఉప్పల్ చిలుకానగర్ ప్రాంతంలో నివాసం ఉంటు న్న రాజశేఖర్ క్యాబ్‌డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే రాత్రి ఆరవేసిన బట్టలు తీయడానికి కుటుంబ సభ్యులు భవనంపైకి వెళ్లారు. ఉదయం 11 గంటల సమయంలో వెళ్లిన వారికి సుమారు మూడునెలల వయస్సు కలిగిన చిన్నారి తలను గమనించారు. వెంటనే రాజశేఖర్ స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

అయితే తలభాగం లభించిన చిన్నారి వివరాలు తెలియలేదు. వీటితోపాటు ఎక్కడి నుంచి తీసుకువచ్చారు.. ఈ ప్రాంతంలోని వారికి ఏమైనా సంబంధాలు ఉన్నా యా.. మిస్సింగ్ కేసులు ఎక్కడైనా ఉన్నాయా .. అనే కోణంతోపాటు ఇతర భాగాలపై దృష్టిసారించారు. డాగ్‌స్కాడ్‌తో విచారణ చేపట్టగా ఈ ప్రాంతంలోని ఇంట్లోకి వెళ్లి తిరిగి వచ్చింది. దీనితో కేసుకు సంబంధం ఉన్న వ్యక్తుల కదలికలపై పోలీసులు దృష్టిసారించారు. ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్లు, నాచారం సీఐ విఠల్‌రెడ్డి, ఎస్సై కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.

నేరస్తులను పట్టుకుంటాం

చిన్నారి తలను ఓ ఇంటిపై వేసిన సంఘటనపై సమగ్ర విచారణ చేపడుతాం. చిన్నారి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే సంఘటన ఎలా జరిగింది అనే అంశాలను పరిశీలిస్తున్నాం. డాగ్‌స్కాడ్, క్లూస్‌టీంలతో దర్యాప్తు ముమ్మరం చేశాం. తలమాత్రమే లభించడం, ఇతర భాగాలు, నేరానికి పాల్పడిన వ్యక్తుల కోసం పూర్తిస్థాయిలో విచారణ చేపడుతాం. క్షుద్రపూజలు అనే కోణంలో కూడా విచారణ చేపడుతాం.

- ఉమామహేశ్వరశర్మ, డీసీపీ

Keywords : eclipse
(02.02.2018 07:30:57pm)

No. of visitors : 2018

Suggested Posts


1 results found !


దేవుని సృష్టిలో గ్రహణాల పాత్ర

ప్రకృతిలో ఏ జీవికి అవసరం పడని దేవుడు అనే కాన్సెప్ట్ మనిషికి అవసరం పడింది. దానికి కారణం మనిషికి ఉన్న మెమరీ, ఎమోషన్స్ కావచ్చు. రోజు సూర్యుడు తూర్పున ఉదయించడం,
Search Engine

బయలాజికల్ మదర్
ఫేస్బుక్ ఓసీడీ (FBOCD)
నిజం ఆవస్యకత
నిజాలన్నీ అబద్దాలే
కెరీర్
చీమ మెదడులో చేరిన వైరస్
వ్యక్తి
జీవితం
హ్యూమనిజం
నేనెవరు?
PTSD
డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు
రిజర్వేషన్స్
కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది?
టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?
మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా?
Autism Treatment
మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా?
NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు
టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన
పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!
పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?
మనుసులో భావాలే కలలుగా వస్తాయా?
కలలు నిజాలు అవుతాయా?
ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్
Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..?
తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?
టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి?
రెండవ కూతురు
ఏకాగ్రత పెంచుకోవడం ఎలా?
మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా?
ఫ్రీ థింకింగ్
పోరాటమా? బ్రతుకా?
more..
ఇంటిపై