పిల్లలను అవమానిస్తున్నారు.. చంపేస్తున్నారు..

పిల్లలను

హాయిగా సీతాకోక చిలకలు లాగా తోటి పిల్లలతో ఆడుతూ పాడుతూ బడిలో నేర్చుకున్న పిల్లలకు ప్రయివేట్ స్కూల్స్ హటాత్తుగా నాన్న ఫీజు కట్టలేదని నిలబెట్టి అవమానిస్తున్నాయి. తరగతులకు అనుమతించకుండా అడ్డుకుంటున్నాయి. హాల్ టికెట్స్ ఇవ్వమంటూ బెదిరిస్తాయి. పరీక్షా ప్రారంభమయిన అర్థ గంట వరకు బయటనే నిలబెడతాయి. తోటివారు పరీక్షలు రాసేస్తుంటే రాత్రంతా చదివి వచ్చి కనీసం పేపర్ ముట్టుకొని స్థితిలో ఆ చిన్నారి మనస్సు క్రుంగి పోతుంది. దారుణమయిన మానసిక వేదన, అవమానానికి గురవుతుంది.

మల్కాజ్ గిరి జ్యోతి మోడల్ స్కూల్ లో తొమ్మిదవ తరగతి చదువుతున్న సాయి దీప్తిని ఫీజు కట్టలేదని యాజమాన్యం పరీక్ష రాయనివ్వలేదు. దానితో తీవ్ర మనస్తాపం చెందిన సాయి దీప్తి తల్లిదండ్రులకు ఒక లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఇదొక్కటే కాదు రెండు రాష్ట్రాలలో ప్రయివేట్ స్కూల్స్ లో ఫీజు కట్టలేదని పిల్లలను అవమానించడం నిత్యం సాధారణమైన విషయం.

ఫీజు అనేది తల్లిదండ్రులకు స్కూల్ యాజమాన్యానికి సంబంధించిన విషయం. పేరెంట్స్ ఫీజు కట్టకపోతే పిల్లలను అవమానించడం, తరగతులకు అనుమతించక పోవడం, పరీక్షలకు అనుమతించక పోవడం ఒక అనైతిక మైన ప్రాక్టీస్. విద్య హక్కు ప్రకారం ప్రతీ బిడ్డ చదువుకునే హక్కు కలిగి ఉంటుంది. దానికి కావలసిన వసతులు ప్రభుత్వాలు సమకూర్చాలి. స్కూల్స్ అన్నీ కూడా నాన్ ప్రాఫిట్ మోటివ్ తో ఏర్పడిన సొసైటీస్. విద్యారంగంలో లాభాపేక్ష లేకుండా విద్యారంగంలో సేవ చేస్తామని ఏర్పడిన స్కూల్స్ పిల్లలను ఫీజు కోసం అత్యంత దారుణంగా అవమానించడం చూస్తున్నాము.

చిన్న పిల్లల మనస్సు చాల సున్నితంగా ఉంటుంది. బాల్యంలో వారు ఎదుర్కునే అవమానాలన్నీ పెరిగి పెద్దయ్యాక వారి వ్యక్తిత్వం మీద ప్రభావం చూపుతాయి. అవి వారిని నీడలాగా వెంటాడుతూ వారు బ్రతికున్నంత కాలం వ్యతిరేక ప్రభావం చూపుతూ వారిని బాధపెడుతుంటాయి. స్కూల్ యాజమాన్యాలు తమ ఫీజు వాసులు చేసుకోడానికి తల్లిదండ్రులను సంప్రదించాలి తప్ప ఒకసారి స్కూల్ కి అనుమతించిన తరువాత పిల్లలను అవమానించి కూడదు. మిగతా పిల్లల నుండి కేవలం ఫీజు కట్టలేదని వేరు చెయ్యడం వివక్ష క్రింద పరిగణించాలి. స్కూల్ ఫీజు వసూలు చేసుకోడానికి ఇతర మార్గాలను ఎదుర్కోవాలి తప్ప పిల్లలను అవమానించే సంస్కృతి మారాలి.

- హరి రాఘవ్

Keywords : school, kid, fee
(04.02.2018 04:00:06am)

No. of visitors : 1979

Suggested Posts


10 results found !


బయలాజికల్ మదర్

19 సంవత్సరాల స్నేహ కడప జిల్లా జమ్మలమడుగు నుండి హైదరాబాద్ వచ్చి హాస్టల్లో ఉంటూ బి.ఫార్మసీ చదువుతుంది. గత కొన్ని నెలలుగా తీవ్రమైన డిప్రెషన్‌తో బాధ పడుతున్న స్నేహ కౌన్సిలింగ్ తీసుకుంటుంది. ఆమె బాల్యం గురించి లోతయిన విశ్లేషణ చేస్తున్నపుడు కొన్ని సున్నితమైన అంశాల పైన మరింత స్పష్టత వచ్చింది. స్నేహకు ఊహ తెలిసీ తెలియని వయస్సులో తల్లి చనిపోయింది. బయటి వాళ్ళయితే

టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?

టీనేజ్ పిల్లలో వచ్చే మానసిక శారీరక మార్పులేంటి? వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? వారితో తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలి?

పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!

మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!

పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?

పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?

తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?

తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?

ఒంటరి బిడ్డ వలన ఇబ్బంది ఏంటి?

ఇందిరా గాంధీ హయాములో దేశంలో జనసాంద్రత ఎక్కువగా ఉంది దాన్ని నియంత్రించాలని కుటుంభం నియంత్రణ పథకాలను తెచ్చారు. ప్రభుత్వం చాల డబ్బు వెచ్చించి చిన్నకుటుంబం వల్ల కలిగే లాభాలను ప్రచారం చేసింది. ʹమేమిద్దరం మాకిద్దరుʹ అనే నినాదం దేశంలో ప్రతీ గ్రామంలో గోడలపైన దర్శనమిచ్చింది. పీవీ నరసింహారావు హయాంలో మొదలయిన గ్లోబలైజేషన్ వల్ల ప్రజలలో ఆర్థికంగా పోటీ పడటం పెరిగి చివర

పిల్లలు చదవడం లేదని కొడుతున్నారా?

పిల్లలు చదవడం లేదని కొడుతున్నారా?

ఆనందపు తలుపులు

మనిషి జీవితానికి పరమార్థం వెతికే పనిలో పడతారు కొందరు మేధావులు. హాయిగా జీవించడమే తప్ప మారే పరమార్థం ఉండేది తెలుసుకుంటారు అందులో కొందరు. భార్య పిల్లలను వదిలి జ్ఞానం కోసం వెళ్లిన బుద్ధుడు ప్రపంచాన్ని గురువు, దేవుడు అయ్యాడు. కానీ ఆ భార్య పిల్లల దృష్టిలో బుద్ధుడు వేరు. సమాజంలో ఉన్న స్థితిని మరచి, ఉన్న భాద్యతలు మరచి భవిష్యత్తుకు ఇతరులను వదిలి వెళ్లడం వల్ల సమాజ

పిల్లల జ్ఞాపకశక్తి - తల్లిదండ్రుల పాత్ర - 2

చదువు అనగానే జ్ఞాపక శక్తి గుర్తు వస్తుంది. చాలామంది తల్లిదండ్రులు నా కొడుకుకి జ్ఞాపక శక్తి తక్కువ, లేదా నాకూతురికి తెలివి తక్కువ వంటి పదాలు వాడటం చూస్తాము. జ్ఞాపకశక్తి, తెలివి ఇవి వేటికి అవి వేరువేరు కాదు. వీటితో పాటు అనేక అంశాలు మిళితమై ఉంటాయి. ఒక విద్యార్థి తను ఒకసారి చూసిన సినిమా డైలాగ్స్ గుర్తుపెట్టుకున్నంత బాగా తన సబ్జక్ట్స్ విషయాలను గుర్తు పెట్టు
Search Engine

బయలాజికల్ మదర్
ఫేస్బుక్ ఓసీడీ (FBOCD)
నిజం ఆవస్యకత
నిజాలన్నీ అబద్దాలే
కెరీర్
చీమ మెదడులో చేరిన వైరస్
వ్యక్తి
జీవితం
హ్యూమనిజం
నేనెవరు?
PTSD
డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు
రిజర్వేషన్స్
కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది?
టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?
మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా?
Autism Treatment
మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా?
NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు
టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన
పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!
పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?
మనుసులో భావాలే కలలుగా వస్తాయా?
కలలు నిజాలు అవుతాయా?
ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్
Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..?
తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?
టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి?
రెండవ కూతురు
ఏకాగ్రత పెంచుకోవడం ఎలా?
మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా?
ఫ్రీ థింకింగ్
పోరాటమా? బ్రతుకా?
more..
పిల్లలను