ఆస్తికత్వం - నాస్తికత్వం

ఆస్తికత్వం

ఆస్తికుడు నాస్తికుడిగా మారటం రెండవ తరగతి పిల్లవాడు మూడవ తరగతికి రావడం వంటిది. చదవాల్సింది చాల ఉంది అని రెండు సంవత్సరాల క్రితం నేను చేసిన కామెంట్ చాల మంది నాస్తికులకు కోపం తెప్పించింది. అక్కడికి నేను ఆస్తికులను సమర్థించినట్లు వారు భావించి నా మీద వ్యతిరేకత పెంచుకున్నారు. నిజానికి అందులో నాస్తికులను ఆస్తికుల కన్నా ఉన్నతమైన వారిగా వర్ణించను. కాని నాస్తికులు మూడవ తరగతి మాత్రమేనా అనే అర్థంలో తీసుకొని బాధ పడిపోయారు.

నిజానికి ప్రపంచ మానవాళికి దేవుడు ఉన్నాడా?, లేడా? అనేది అతి చిన్న అంశము. ఈ సృష్టి ఎలా జరిగింది అనేది మనిషి జీవితానికి ఏమాత్రం సంబంధం లేని పనికి రాని విషయం. దానికోసం మనుషులు ఒకరిని ఒకరు ద్వేషించుకొని శత్రువులు లాగ భావించి వెకిలిగా హేళన చేసుకుంటూ జీవితాలను గడపడం వృధా.

ప్రపంచ సమస్యలలో ప్రధానమైన అసమానతలకు కారణాలను కనుగొని నివారించకుండా కేవలం దేవుడి మీద నమ్మకాన్ని ప్రశ్నించడం వల్ల సమాజానికి పెద్దగా ఉపయోగం ఉండదు. దేవుడిని మనిషి ఎందుకు ఆశ్రయిస్తున్నాడు అనే అంశాన్ని వదిలి నమ్ముతున్న మనిషిని ద్వేషించడం మొదలయ్యింది.

ప్రపంచంలోని అనేక అమానవీయ సమస్యలకు, అసమానతలకు, అశాంతికి ఆస్తికత్వం ఒక కారణం కావచ్చు. నాస్తికత్వం కూడా ఒక కారణం కావచ్చు. దీనిని ఎవరికీ వారు అంగీకరించక పోవచ్చు. కాని ఇవి రెండు పరోక్ష కారణాలే తప్ప ప్రత్యక్షంగా మనిషి లోని ద్వేషం ముఖ్యమమైన కారణం. ఆ ద్వేషానికి మతం గాని, మరొకటి గాని సహాయంగా వాడుకోవచ్చు తప్ప అవి ప్రత్యక్షంగా అమానవీయ ఘటనలకు పాల్పడవు. ద్వేషం కత్తి లాంటిదయితే దానికున్న పిడి వంటివి ఆస్తికత్వం లేదా నాస్తికత్వం. ప్రమాదకరమైన కత్తిని వదిలి ఆ కత్తికి చెక్క పిడి ఉండాలా లేదా లోహపు పిడి ఉండాలా అన్నది ఎంత అర్థంలేని పోరాటంలో ఆస్తిక నాస్తికుల మధ్య పోరాటం అంతే అర్థ రహితం.

- హరి రాఘవ

Keywords : atheism, theism
(13.02.2018 11:49:16pm)

No. of visitors : 3388

Suggested Posts


4 results found !


వృద్ధాప్యంలో కొందరు నాస్తికులు ఎందుకు ఆస్తికులుగా మారతారు?

హేతువాద నాస్తికుడిగా మారటం ఒక రాజకీయ పార్టీ నుండి వేరొక రాజకీయ పార్టీకి మారినట్లు కాదు. నిజమయిన హేతువాది మీద తీవ్రమయిన మానసిక ఒత్తిడి ఉంటుంది. దేనిని హేతుబద్దంగా ఆలోచించాలి, ఎంతవరకు హేతుబద్దంగా ఆలోచించాలి అనే విషయాలు అర్థం కాక ప్రతీ విషయాన్నీ తను హేతుబద్దంగా విశ్లేషించే ప్రయత్నం చేస్తాడు. అపరిమితంగా హేతుబద్ధ విశ్లేషణ వల్ల అతను పడే మానసిక శ్రమ ఈ ఒత్తిడికి

వ్యక్తి - సమాజం

వ్యక్తి - సమాజం, ఇవి రెండు వేరు వేరు అంశాలు. వ్యక్తి యొక్క ప్రవర్తన సామజిక పరిస్థిని బట్టి ఉంటుంది. అంత మాత్రాన తానూ సమాజానికి కట్టుబడి ఉన్నట్లు కాదు. ఏ వ్యక్తి కూడా సమాజానికి పూర్తి బద్దుడిగా ఉండడు. చాలసార్లు ఆలా ఉన్నట్లు నటించి ఇతరులను ఆలా ఉండాలి అని వాదిస్తాడు. సమాజం ఏర్పడటానికి కారణమే వ్యక్తి గతమయిన స్వార్థం. తనకు లాభం (డబ్బు మాత్రమే కాదు) ఉన్నంతవరకు

నాస్తికత్వం - సైన్స్

నాస్తికత్వం వేరు సైన్స్ వేరు. నాస్తికత్వం పరిధి చాల చిన్నది. దేవుడు, మతము మొదలైన ఆధ్యాత్మిక నమ్మకాలకు సంబంధిచినది మాత్రమే. సైన్స్ కి పరిధి లేదు. ఇది విశ్వం మొత్తానికి సంబంధిచినది. దీనికి ఆస్తికుడు, నాస్తికుడు, లేదా ఆ మతం వాడు ఈ మతం వాడు అని సంబంధం ఉండదు. పసిపిల్లవాడు తన తల్లి చనుబాలు త్రాగటం దగ్గరనుండి రాకెట్ ప్రయోగించడం వరకు ప్రతీ దానిలో సైన్స్ ఉంటుంది.

పరిమిత హేతువాదం

కార్ల్ మార్క్స్, మావో, వివేకానంద, రమణానంద, గాంధీ, బుద్ధుడు లేదా మరెవరో చెప్పాడనో మనిషి ఆ సిద్ధాంతాలను పట్టుకొని వేలాడటం వృధా. ఈ స్థితి మానసికమైన జడత్వానికి
Search Engine

బయలాజికల్ మదర్
ఫేస్బుక్ ఓసీడీ (FBOCD)
నిజం ఆవస్యకత
నిజాలన్నీ అబద్దాలే
కెరీర్
చీమ మెదడులో చేరిన వైరస్
వ్యక్తి
జీవితం
హ్యూమనిజం
నేనెవరు?
PTSD
డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు
రిజర్వేషన్స్
కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది?
టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?
మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా?
Autism Treatment
మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా?
NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు
టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన
పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!
పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?
మనుసులో భావాలే కలలుగా వస్తాయా?
కలలు నిజాలు అవుతాయా?
ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్
Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..?
తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?
టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి?
రెండవ కూతురు
ఏకాగ్రత పెంచుకోవడం ఎలా?
మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా?
ఫ్రీ థింకింగ్
పోరాటమా? బ్రతుకా?
more..
ఆస్తికత్వం