కుంగుబాటు.. వద్దు తడబాటు

కుంగుబాటు..

పిల్లలు తల్లిదండ్రులతో అన్ని విషయాలు చెప్పేలా వాతావరణం ఉండాలి. కొందరు లోపాలను వైద్యుల వద్ద అంగీకరించరు. ఇతరుల సహాయాన్ని కళంకంగా భావిస్తారు. అలాంటి వ్యక్తులను దగ్గరకు తీసుకుని సహాయం చేయాలి. నేను వైద్యుడి వద్దకు వెళ్లినపుడు నాలోని అంతర్గత యుద్దాన్ని సగం గెలిచినట్లు అనిపించింది. విజయమనేది సమాజంలో చాలా మార్పు తీసుకువస్తుంది. పరీక్షల సమయంలో ఎదురయ్యే కుంగుబాటును ఎదుర్కొనేలా విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించాలి. సాంకేతిక పరిజ్ఞానం, యాప్‌లు అవగాహన కల్పిస్తాయి కానీ మనిషిని ఆరోగ్యంగా చేయలేవు. మానవ స్పర్శ, ఒకరికి ఒకరు సహాయం, వైద్యులతోనే సాధ్యమవుతుంది.
- దీపికా పదుకొణె

ప్రజల్లో కుంగుబాటు ప్రపంచం ముందు ఓ వ్యాధిలా రానుంది.. ప్రతి ముగ్గురిలో ఒకరు తమ జీవితంలో ఒకసారి ఈ రుగ్మత ఎదుర్కొంటున్నారు.. కుంగుబాటు సమస్య నుంచి రాత్రికిరాత్రి బయటపడటం సాధ్యం కాదు.. మానసిక వైద్యుల చికిత్స, సూచనలు సలహాలతో నెమ్మదిగా సాధారణ జీవితానికి రావచ్చు..2014లో నేను కుంగుబాటుతో బాధపడుతున్నపుడు నా తల్లి పరిస్థితిని గుర్తించి సకాలంలో చికిత్స అందించారు.. గెలుపోటములు మానవ జీవితంలో అంతర్భాగం..అనుభవాలే జీవిత విలువను తెలియజేస్తాయని సినీనటి దీపికా పదుకొణె అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రులు పిల్లల్లో సమస్యలు గుర్తించాలని, తమతో బాధలు చెప్పుకునే స్వేచ్ఛ ఇవ్వాలని సూచించారు. మీరొక్కరే కుంగుబాటు సమస్యలో లేరు. మీరు ఒంటరివారు కాదు అన్న ధైర్యం చెప్పి సహాయం చేయాలన్నారు. జనరల్‌ ఫిజీషియన్లకు మానసిక వైద్యంపై లోతైన శిక్షణ ఇవ్వాల్సిన అవసరముందని, కార్పొరేట్‌ కంపెనీలూ మానసిక వైద్యులను నియమించాలని ఆమె సూచించారు. బుధవారమిక్కడ ప్రపంచ ఐటీసదస్సులో ʹమానసిక వైద్యంʹపై జరిగిన ప్లీనరీలో దీపిక మాట్లాడారు.

దీపిక మాట్లాడుతుందని తెలియగానే మధ్యాహ్నం మూడు గంటలకే ఐటీ కాంగ్రెస్‌ జరుగుతున్న హెచ్‌ఐసీసీ సభా ప్రాంగణం నిండిపోయింది. కొద్దిమంది నిలుచొనే ఆమె మాటలను ఆసక్తిగా విన్నారు. మధ్యాహ్నం 3.25కు మాట్లాడటం ప్రారంభించిన దీపిక 4.10 ప్రాంతంలో ముగించి వెంటనే సభా ప్రాంగణం నుంచి వెళ్లిపోయారు. ఒకరిద్దరు ఆమె ప్రసంగం మధ్యలో ప్రశ్నలడిగారు. తన అనుభవాలకు సూచనలు జతచేస్తూ ఆమె ప్రసంగం సాగింది. ʹకుంగుబాటుతో బాధపడుతున్నపుడు ఇంటి నుంచి బయటకు రావాలని, ఇతరులను చూడాలని, మాట్లాడాలని అనిపించలేదు. నాలో నేను బాధపడుతుండేదానిని. అమ్మ నా పరిస్థితిని చూసి, నాతో మాట్లాడి సమస్యను గుర్తించి చికిత్స ఇప్పించారు. వైద్యుల సూచన మేరకు జీవనశైలి మార్చుకున్నా. ఎక్కువగా నిద్రపోవడం, సరైన సమయంలో ఆహారం, మందులు తీసుకొని వేదన నుంచి బయటపడ్డాను. మా అమ్మతో నాకున్న చనువు కారణంగా సమస్య నుంచి బయటపడి ఇప్పుడిలా మీ ముందు ఉన్నాను.

ఒకరి ప్రాణాన్ని అయినా కాపాడాలని...
ఈ రుగ్మత నుంచి బయటపడినందున కనీసం ఒక్కరి జీవితాన్నయినా రక్షించాలన్న ఉద్దేశంతో ʹది లివ్‌ లవ్‌ లాఫ్‌ʹ ఫౌండేషన్‌ ఏర్పాటు చేశాను. విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల వారికి అవగాహన కల్పిస్తున్నాం. కర్ణాటకలోని దావనగిరిలో నిర్వహించిన కార్యక్రమాలు ఎంతో సంతృప్తి ఇచ్చాయి. కార్పొరేట్‌ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల్లో 42.5శాతం మంది కుంగుబాటుతో బాధపడుతున్నారు. వచ్చే ఏడాదికి ఈ సంఖ్య తగ్గాలి. చాలా మంది తమలోని సమస్యను విభాగాధిపతులకు చెప్పరు. చికిత్సకు సమయం కావాలని కోరితే ఎక్కడ ఉద్యోగం నుంచి తీసివేస్తారోనని ఆందోళనతో సమస్యను జటిలం చేసుకుంటున్నారు. ఇప్పటికైనా కార్పొరేట్‌ సంస్థల యజమానులు, నిర్వాహకులు తమ సంస్థల్లో మానసిక వైద్యులను నియమించి ఉద్యోగులకు అవసరమైన కౌన్సెలింగ్‌ నిర్వహించడాన్ని తప్పనిసరి చేయాలి.ʹ

Courtesy : Eenadu

Keywords : deepika, depression, psychology
(26.02.2018 09:43:53am)

No. of visitors : 504

Suggested Posts


10 results found !


ఫేస్బుక్ ఓసీడీ (FBOCD)

ఫేస్బుక్ ఓసీడీ (FBOCD) మూడు రకాలుగా ఉంటుంది. ఇందులో #మొదటి రకం వారు తెల్లవారు ఝామున లేచిన వెంటనే ʹగుడ్ మార్నింగ్ʹ అంటూ పోస్ట్ పెట్టడడం తో ప్రారంభమయి అర్థ రాత్రి గుడ్ నైట్ అని పెట్టే వరకు కొనసాగుతుంది. ఈ మధ్యలో

నిజం ఆవస్యకత

నిజాన్ని తెలుసుకోవడం అవసరమే. కానీ ప్రతీ నిజాన్ని తెలుసుకోవడం వల్ల జీవితం వృధా అవుతుంది. జ్ఞానం అనంతం. మనిషి జీవితం పరిమితం. పరిమిత జీవితకాలంలో చాలా వరకు తనకు తెలియకుండా సమాజ ప్రభావంతో కొట్టుకుపోతాడు. తనకు అర్థమయ్యింది అనుకునే లోపే తను అర్థం చేసుకున్నదంతా తప్పని అర్థమవుతుంది. మనిషి తన మానసిక జీవితానికి సంబంధం లేని ఏ నిజాన్ని తెలుసుకున్నా అది వృధానే. అంత

కెరీర్

ʹహరి రాఘవ్ గారు!! మీరెన్ని చెప్పినా మనిషి కెరీర్ కే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనిపిస్తుంది. మీ మాటలను నమ్మి ఒక్క రోజు రెస్ట్ తీసుకున్నా కెరీర్ లో వెనుకబడి పోవడం ఖాయం. మిగిలిన వాళ్ళు ముందుకు వెళ్లి పోతారు. అంతెందుకు మీరు మాత్రం అన్నేసి కౌన్సెలింగ్స్ ఇవ్వడం లేదా? మీకు కూడా కెరీర్ ముఖ్యం కాదా? నా కెందుకో మీరు చెప్పే దానిని పూర్తిగా నమ్మ బుద్ధి కావడం లేదు.ʹ ʹనమ్

చీమ మెదడులో చేరిన వైరస్

చాల కాలం క్రితం ఒక ప్రత్యేకమైన చీమల జాతి ఉండేదట. ఆ జాతి అంతరించి పోవడానికి ఒక అరుదైన వైరస్ కారణం. ఈ వైరస్ కేవలం ఆ చీమల మెదడు ఆధారం గానే జీవించగలదు. అడవిలో నివసించే ఈ చీమలు చాల శక్తివంతమైనవి మరియూ తెలివయినవి కూడా. ఎలా చేరిందో తెలియదు ఆ అరుదైన వైరస్ ఆ చీమల జాతికి చెందిన ఒక చీమ మెదడులోకి చేరుకుంది. అప్పటి నుండి ఆ వైరస్ ఆ చీమ మెదడును హ్యాండిల్ చెయ్యడం మొదలు

వ్యక్తి

నిజానికి ఈ సమాజంలో మారాల్సింది ఏదయినా ఉంది అంటే అది నేనే (వ్యక్తి). నేను మారితే మొత్తం సమాజం మారుతుంది. నేను మారకుండా సమాజం మారదు. వ్యక్తిగా ఎదగలేని నేను సమాజాన్ని మార్చాలని ప్రయత్నించడం వృధా మరియూ నన్ను నేను చేసుకునే మోసం.

జీవితం

ఆధునిక కాలంలో మనిషి తన జీవితంలో ఎదురయ్యే ఆనందాన్ని అనుభవించడం కన్నా, తను ఆ స్థితికి చేరుకున్నాని ఇతరులకు తెలియజేయడంలో ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు. అనుకోకుండా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడినా లేదా ఏదైనా విహార యాత్రకు వెళ్ళినా ఆ అందమైన అనుభూతులను ఆస్వాదించ కుండా అక్కడ సెల్ఫీలు ఎలా తీసుకుంటే బాగుంటదో అనే ఆలోచనలే వారి మనస్సులో మొదలవుతాయి.

హ్యూమనిజం

హ్యూమనిజం జంతువుల వలే కాకుండా మనిషి సహజంగా విలువలతో కూడిన ప్రవర్తన కలిగియుంటాడు, తరువాత సమాజ ప్రభావం వలన చెడుగా మారతాడు అని నమ్ముతుంది. దీనినే #హ్యూమనిస్టిక్ #సైకాలజీ అని కూడా అంటారు. పర్సన్ సెంటర్డ్ థెరపీ, సెల్ఫ్-యాక్షువలైజేషన్ వంటి థెరపీలు హ్యూమనిజంలో భాగాలు. యాభైవ దశకంలో అబ్రహం మాసలౌ, కార్ల్ రోజర్స్, షార్లెట్ బహెల్ర్ మరియూ కొందరు సైకాలజిస్ట్లు ప్రతిప

నేనెవరు?

Who am I? | Hari Raghav

కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది?

ఒక వ్యక్తికి ఒక సబ్జెక్టు పట్ల ఇంటరెస్ట్ ఉన్నదీ లేనిదీ ఎలా తెలుస్తుంది? కెరీర్ ఎన్నుకునేటపుడు ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి? ఒకవేళ కెరీర్ మార్చుకోవాల్సి వస్తే ఎటువంటి శ్రద్ధ వహించాలి?

టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?

టీనేజ్ పిల్లలో వచ్చే మానసిక శారీరక మార్పులేంటి? వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? వారితో తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలి?
Search Engine

బయలాజికల్ మదర్
ఫేస్బుక్ ఓసీడీ (FBOCD)
నిజం ఆవస్యకత
నిజాలన్నీ అబద్దాలే
కెరీర్
చీమ మెదడులో చేరిన వైరస్
వ్యక్తి
జీవితం
హ్యూమనిజం
నేనెవరు?
PTSD
డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు
రిజర్వేషన్స్
కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది?
టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?
మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా?
Autism Treatment
మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా?
NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు
టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన
పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!
పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?
మనుసులో భావాలే కలలుగా వస్తాయా?
కలలు నిజాలు అవుతాయా?
ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్
Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..?
తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?
టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి?
రెండవ కూతురు
ఏకాగ్రత పెంచుకోవడం ఎలా?
మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా?
ఫ్రీ థింకింగ్
పోరాటమా? బ్రతుకా?
more..
కుంగుబాటు..