సామాజిక దృక్పధం లేని శాస్త్రవేత్తలు ఉగ్రవాదులకన్నా ప్రమాదం

సామాజిక

సమాజంలో శాస్త్రీయ దృక్పధం పెరగాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. ఈ విషయం భారత రాజ్యాంగంలో సైతం స్పష్టంగా చెప్పబడినది. అందుకు అనుకూలంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. మూఢనమ్మకాలను పారద్రోలుతూ ప్రజలలో అవగాహనా సదస్సులు నిర్వహించాలి. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా చట్టాలు రూపొంచాలి. సైన్స్ ప్రచారకులు పెరగాలి.

ఇటీవల భారత్ లో హేతువాదులు, నాస్తికుల పైన మత ఛాందస వాదులు, రాజకీయ మతస్తులు దాడులు చెయ్యడం. హత్యలు చెయ్యడం విచారం కలిగిస్తుంది. సమాజంలో శాస్త్రీయ దృక్పధం పెంచే ప్రయత్నం చేసే వారికి రక్షణ కరువుతున్న తరుణంలో హేతువాదులు, నాస్తికులు కూడా గ్రూప్స్ గా ఏర్పడుతున్నారు. ఒక కామన్ ఎజెండా తో వారిని వారు కాపాడుకుంటూ పని చెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఎప్పుడయితే హేతువాదులు ఒక గ్రూప్ గా ఏర్పడి తమను తాము కాపాడుకోవాలని ప్రయత్నిస్తారో అప్పుడు వారు తమకు వ్యతిరేకంగా భావించిన వారిని ద్వేషించడం మొదలవుతుంది. ద్వేషం వారి మనస్సులోకి ప్రవేశించిన మరుక్షణం వారిలో హేతుబద్దత తగ్గి మూర్ఖంగా ఎదుటి వారి మీద దాడి చేసే అవకాశము ఉంటుంది.

నాణానికి మరో వైపు పెట్టుబడి దారీవ్యవస్థ చేతిలోకి సైన్స్ వెళ్లడం. నిజానికి సైన్స్ ఎవరి చేతిలోనూ ఉండదు. కానీ పెట్టుబడి దారి వయవస్థలో పరిశోధనలకు కావలసిన పెట్టుబడులు సామాన్యుడికి అందుబాటులో ఉండవు. కేవలం కొద్ది మంది వ్యక్తుల చేతుల్లోనే దేశం లోని అధిక భాగం వనరులు ఉండటం వల్ల శాస్త్రవేత్తలు పెట్టుబడి దారుల వశం అవుతారు. వారి పరిశోధన సమాజ శ్రేయస్సు వైపు కాకుండా పెట్టుబడి దారుల లాభాలను వైపుగా కొనసాగుతుంది.

సామజిక దృక్పధం లేని శాస్త్రవేత్తలను డబ్బుతో కొనడం పెట్టుబడి దారులకు కష్టమైనా పని ఏమీ కాదు. రాజకీయ పార్టీలను ప్రభావితం చేసే వారికి అనుకూలమైన శాస్త్రవేత్తలను నామినేటెడ్ పదవులలో నియమించడం భారత్ లో కొత్త ఏమీ కాదు. భారత్ లో ముఖ్యంగా ఫార్మా రంగంలో జరిగే పరిశోధనలన్నీ సామజిక దృక్పధంతో కాకుండా కేవలం లాభాలను ఆర్జించే దృక్పధంతో జరుగుతున్నాయి. చివరికి ప్రజలు పాటించే ఆహారానియమాలను కూడా పాటించనివ్వకుండా ప్రతీది డాక్టర్ చెప్పాలి అనే దబాయిస్తున్నారు.

ఆరోగ్య సంబంధమైన ప్రతీ చిన్న విషయాన్నీ కూడా జబ్బుగా పరిగణించి మందులు వాడించడం, ఆ మందుల వల్ల మళ్ళీ కొత్త జబ్బులు రావడం తరుచుగా చూస్తున్నాము. సామజిక దృక్పధంతో ఎవరయినా హేతువాదులు ప్రజలకు ఏదయినా విషయాన్నీ చేరువచేసే ప్రయత్నం చేస్తేనే పెట్టుబడి దారులకు తొత్తులుగా మారిన సాటి హేతువాదులు ʹనువ్వెవరివి చెప్పడానికిʹ అని కొందరు డాక్టర్స్ నో, లేదా కొందరు శాస్త్రవేత్తలనో వెనకేసుకొని మీడియా సహాయంతో వారిమీద అనైతిక వ్యక్తి గత దాడిని చెయ్యడం జరుగుతుంది.

- హరి రాఘవ్

Keywords : science, society
(01.03.2018 05:18:45am)

No. of visitors : 2269

Suggested Posts


4 results found !


పేదరికంలో ఆకలి చావులుంటాయి తప్ప ఆత్మహత్యలుండవు

మనిషి ప్రాధమిక అవసరాలు తీరనిదే ఇతర విషయాలను పట్టించుకోడు. ప్రాధమిక అవసరాలకోసం తను ఏమయినా చేస్తాడు. సాటి ప్రాణిని చంపుతాడు. సాటి మనిషిని చంపుతాడు, అవసరమైతే బానిసత్వం వహిస్తాడు. ఎవరికయినా తలొంచుతాడు. అది మతమయినా, పెట్టుబడి దారుడయినా, దోపిడీ దారుడయినా.. ప్రాధమిక అవసరాలు తీరనిదే తను హేతుబద్దంగా ఆలోచించలేడు, సైంటిఫిక్ థింకింగ్ అలవర్చుకోలేడు. సైన్స్ ఎప్పుడూ ఉ

భారత్ లో పరిశోధనల పై కుల ప్రభావం

నేటి చదువుకున్న యువతకు సైన్స్ అనగానే నాసా లేదా ఇస్రో గుర్తొస్తుంటాయి. ఏది చెప్పినా నాసా చెప్పాలి. లేదా ఇస్రో చెయ్యాలి. చివరికి పురాణాలలో చెప్పబడిన వాటిని కూడా నాసా పరిశోధించి చెప్పింది అని ప్రచారం చెయ్యటం వాటిని ప్రజలు నమ్మటం జరుగుతుంది. ఇవి కేవలం స్పేస్ కి సంబంధించిన పరిశోధనలు చేసే సంస్థలు. గేమ్స్ లో క్రికెట్ కి విపరీతమైన గ్లామర్ రుద్దినట్లు సైన్స్ లో క

నాస్తికత్వం - సైన్స్

నాస్తికత్వం వేరు సైన్స్ వేరు. నాస్తికత్వం పరిధి చాల చిన్నది. దేవుడు, మతము మొదలైన ఆధ్యాత్మిక నమ్మకాలకు సంబంధిచినది మాత్రమే. సైన్స్ కి పరిధి లేదు. ఇది విశ్వం మొత్తానికి సంబంధిచినది. దీనికి ఆస్తికుడు, నాస్తికుడు, లేదా ఆ మతం వాడు ఈ మతం వాడు అని సంబంధం ఉండదు. పసిపిల్లవాడు తన తల్లి చనుబాలు త్రాగటం దగ్గరనుండి రాకెట్ ప్రయోగించడం వరకు ప్రతీ దానిలో సైన్స్ ఉంటుంది.

శాస్త్రం - సైన్స్

ʹసైన్స్ʹ కి తెలుగులో ʹశాస్త్రంʹ అని చాల సంవత్సరాలుగా వాడుతున్నారు. కానీ మతసంబంధమయిన విషయాలను కూడా ʹశాస్త్రంʹ అని వాడటంతో ఈ మధ్య సైన్స్ ని ʹవిజ్ఞాన శాస్త్రంʹ
Search Engine

బయలాజికల్ మదర్
ఫేస్బుక్ ఓసీడీ (FBOCD)
నిజం ఆవస్యకత
నిజాలన్నీ అబద్దాలే
కెరీర్
చీమ మెదడులో చేరిన వైరస్
వ్యక్తి
జీవితం
హ్యూమనిజం
నేనెవరు?
PTSD
డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు
రిజర్వేషన్స్
కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది?
టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?
మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా?
Autism Treatment
మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా?
NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు
టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన
పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!
పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?
మనుసులో భావాలే కలలుగా వస్తాయా?
కలలు నిజాలు అవుతాయా?
ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్
Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..?
తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?
టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి?
రెండవ కూతురు
ఏకాగ్రత పెంచుకోవడం ఎలా?
మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా?
ఫ్రీ థింకింగ్
పోరాటమా? బ్రతుకా?
more..
సామాజిక