నిద్రలేమిని జయించడానికి మార్గాలు
మనిషికి ఆహారము, నీరు ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. ప్రతీరోజు సరయిన నిద్ర పోక పోయినట్లయితే ఆవ్యక్తి ప్రవర్తనలో తేడాలు వచ్చే అవకాశాలుంటాయి. వారు రోజూ చేసే పనులను సరిగా చెయ్యలేక పోవడం, హేతుబద్దంగా ఆలోచించి సరయిన నిర్ణయాలు తీసుకోలేక పోవడం, విసుగు, చిరాకు వంటివి గమనించవచ్చు.
చాల మంది దీర్ఘకాల నిద్రలేమితో బాధ పడుతుంటారు. వీరు సరిగా నిద్ర పోలేక పోవడం, ఒకవేళ నిద్ర పోయిన వెంటనే మెలుకువ రావడం లేదా మగత నిద్రలోనే గడుపుతుంటారు. వీరు గాఢ నిద్ర తక్కువగా పోతుంటారు. ఈ నిద్రలేమి అజీర్తి, గ్యాస్, అలసట, నీరసం వంటి శారీరక సమస్యలతో పాటు అనేక రకాల మానసిక సమస్యలకు కూడా కారణం అవుతుంది. ముఖ్యంగా వీరిలో తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన, ఆత్మన్యూనతా వంటి మానసిక సమస్యలే కాకుండా నిద్రపోలేని సమయంలో వీరు తీవ్రమైన ఒంటరితనంతో బాధ పడే అవకాశాలుంటాయి.
నిద్రలేమి వలన మెదడులోని ద్రవాల సమతుల్యత దెబ్బతింటుడం వలన డిప్రెషన్ కి లోనవడం, అది ఆత్మహత్యలకు దారి తీయవచ్చు. నిద్ర లేమితో బాధ పడేవారి లో ఆత్మా స్థైర్యం క్రమంగా తగ్గిపోయి ప్రతీ విషయాన్నీ అనుమానంతో చూస్తుంటారు. దీని వలన ఇతరుల పట్ల లేనిపోని అపోహలు పెంచుకోవడం వల్ల మానవ సంబంధాలు దెబ్బతినే అవకాశాలుంటాయి.
నిద్రలేమిని జయించడానికి వ్యక్తి దైనందిక జీవితం ఒక క్రమపద్ధతిలో ఉండాల్సి ఉంటుంది. క్రమ పద్దతిలో లేని దైనందిక జీవనం వల్ల శరీరానికి ఏ సమయంలో నిద్రపోవాలి ఏ సమయంలో నిద్రపోవాలి అర్థం కాక నిద్రలేమి కలిగే అవకాశాలుంటాయి. శరీరంలో ఉత్పత్తి అయ్యే మెలోటోనిన్ అనే హార్మోన్ మనకు నిద్ర కలగడానికి దోహదం చేస్తుంది. క్రమపద్ధతి లేని జీవనంలో హార్మోన్స్ సరిగా ఉత్పత్తి అయ్యే అవకాశాలు తక్కువ.
అలాగే ప్రతీరోజు ఒకే సమయంలో నిద్రపోవడం, ఒకే సమయంలో నిద్ర లేవడం వంటి అలవాట్లు అవసరం. బెడ్ రూమ్ ని కేవలం నిద్రపోవడానికి తప్ప వేరే విషయాలకు వాడ కూడదు. బెడ్ మీద నుండి టీవీ చూడడం, మొబైల్ చాటింగ్ వంటివి చెయ్యకూడదు. బెడ్ రూమ్ నిశ్శబ్దంగా, చీకటిగా ఉన్నట్లయితే మంచి నిద్ర పట్టేది అవకాశాలుంటాయి. ప్రతీ రోజు సరయిన శారీరక వ్యాయామం చెయ్యడం వల్ల నిద్రలేమికి జయించ వచ్చు.
తీవ్రమైన నిద్రలేమితో బాధ పడేవారు నిర్లక్ష్యం చెయ్యకుండా సైకాలజిస్ట్ ని కలసి కౌన్సిలింగ్ తీసుకున్నట్లైయితే ఆ సమస్య నుండి బయట పడవచ్చు. సమస్యకు కారణమయిన మూలలను బట్టి సైకాలజిస్ట్ థెరపీని సూచించడం జరుగుతుంది. హైప్నో థెరపీ ద్వారా నిద్రలేమి సమస్యనుండి త్వరగా బయటపడే అవకాశాలుంటాయి.
- హరి రాఘవ్
Keywords : sleep, insomnia, psychology
(11.04.2018 01:09:22pm)
No. of visitors : 1446
Suggested Posts
10 results found !
| ఫేస్బుక్ ఓసీడీ (FBOCD)ఫేస్బుక్ ఓసీడీ (FBOCD) మూడు రకాలుగా ఉంటుంది. ఇందులో #మొదటి రకం వారు తెల్లవారు ఝామున లేచిన వెంటనే ʹగుడ్ మార్నింగ్ʹ అంటూ పోస్ట్ పెట్టడడం తో ప్రారంభమయి అర్థ రాత్రి గుడ్ నైట్ అని పెట్టే వరకు కొనసాగుతుంది. ఈ మధ్యలో |
| నిజం ఆవస్యకతనిజాన్ని తెలుసుకోవడం అవసరమే. కానీ ప్రతీ నిజాన్ని తెలుసుకోవడం వల్ల జీవితం వృధా అవుతుంది. జ్ఞానం అనంతం. మనిషి జీవితం పరిమితం. పరిమిత జీవితకాలంలో చాలా వరకు తనకు తెలియకుండా సమాజ ప్రభావంతో కొట్టుకుపోతాడు. తనకు అర్థమయ్యింది అనుకునే లోపే తను అర్థం చేసుకున్నదంతా తప్పని అర్థమవుతుంది.
మనిషి తన మానసిక జీవితానికి సంబంధం లేని ఏ నిజాన్ని తెలుసుకున్నా అది వృధానే. అంత |
| కెరీర్ʹహరి రాఘవ్ గారు!! మీరెన్ని చెప్పినా మనిషి కెరీర్ కే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనిపిస్తుంది. మీ మాటలను నమ్మి ఒక్క రోజు రెస్ట్ తీసుకున్నా కెరీర్ లో వెనుకబడి పోవడం ఖాయం. మిగిలిన వాళ్ళు ముందుకు వెళ్లి పోతారు. అంతెందుకు మీరు మాత్రం అన్నేసి కౌన్సెలింగ్స్ ఇవ్వడం లేదా? మీకు కూడా కెరీర్ ముఖ్యం కాదా? నా కెందుకో మీరు చెప్పే దానిని పూర్తిగా నమ్మ బుద్ధి కావడం లేదు.ʹ
ʹనమ్ |
| చీమ మెదడులో చేరిన వైరస్చాల కాలం క్రితం ఒక ప్రత్యేకమైన చీమల జాతి ఉండేదట. ఆ జాతి అంతరించి పోవడానికి ఒక అరుదైన వైరస్ కారణం. ఈ వైరస్ కేవలం ఆ చీమల మెదడు ఆధారం గానే జీవించగలదు. అడవిలో నివసించే ఈ చీమలు చాల శక్తివంతమైనవి మరియూ తెలివయినవి కూడా. ఎలా చేరిందో తెలియదు ఆ అరుదైన వైరస్ ఆ చీమల జాతికి చెందిన ఒక చీమ మెదడులోకి చేరుకుంది.
అప్పటి నుండి ఆ వైరస్ ఆ చీమ మెదడును హ్యాండిల్ చెయ్యడం మొదలు |
| వ్యక్తినిజానికి ఈ సమాజంలో మారాల్సింది ఏదయినా ఉంది అంటే అది నేనే (వ్యక్తి). నేను మారితే మొత్తం సమాజం మారుతుంది. నేను మారకుండా సమాజం మారదు. వ్యక్తిగా ఎదగలేని నేను సమాజాన్ని మార్చాలని ప్రయత్నించడం వృధా మరియూ నన్ను నేను చేసుకునే మోసం. |
| జీవితంఆధునిక కాలంలో మనిషి తన జీవితంలో ఎదురయ్యే ఆనందాన్ని అనుభవించడం కన్నా, తను ఆ స్థితికి చేరుకున్నాని ఇతరులకు తెలియజేయడంలో ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు. అనుకోకుండా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడినా లేదా ఏదైనా విహార యాత్రకు వెళ్ళినా ఆ అందమైన అనుభూతులను ఆస్వాదించ కుండా అక్కడ సెల్ఫీలు ఎలా తీసుకుంటే బాగుంటదో అనే ఆలోచనలే వారి మనస్సులో మొదలవుతాయి. |
| హ్యూమనిజంహ్యూమనిజం జంతువుల వలే కాకుండా మనిషి సహజంగా విలువలతో కూడిన ప్రవర్తన కలిగియుంటాడు, తరువాత సమాజ ప్రభావం వలన చెడుగా మారతాడు అని నమ్ముతుంది. దీనినే #హ్యూమనిస్టిక్ #సైకాలజీ అని కూడా అంటారు. పర్సన్ సెంటర్డ్ థెరపీ, సెల్ఫ్-యాక్షువలైజేషన్ వంటి థెరపీలు హ్యూమనిజంలో భాగాలు.
యాభైవ దశకంలో అబ్రహం మాసలౌ, కార్ల్ రోజర్స్, షార్లెట్ బహెల్ర్ మరియూ కొందరు సైకాలజిస్ట్లు ప్రతిప |
| నేనెవరు?Who am I? | Hari Raghav |
| కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది?ఒక వ్యక్తికి ఒక సబ్జెక్టు పట్ల ఇంటరెస్ట్ ఉన్నదీ లేనిదీ ఎలా తెలుస్తుంది? కెరీర్ ఎన్నుకునేటపుడు ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి? ఒకవేళ కెరీర్ మార్చుకోవాల్సి వస్తే ఎటువంటి శ్రద్ధ వహించాలి? |
| టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?టీనేజ్ పిల్లలో వచ్చే మానసిక శారీరక మార్పులేంటి? వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? వారితో తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలి? |
| డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు |
| కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది? |
| టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి? |
| మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా? |
| మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా? |
| NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు |
| టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి? |
| బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన |
| పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? |
| మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!! |
| పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా? |
| మనుసులో భావాలే కలలుగా వస్తాయా? |
| Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..? |
| తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా? |
| టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి? |
| మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా? |
more..