అనైతిక హేతువాదం విషం

అనైతిక

అనైతిక హేతువాదం విషం

పై వాక్యంలో 3 పదాలు ఉన్నాయి. 1) అనైతికత 2) హేతువాదం 3) విషం. ఈ మూడు పదాలను ఏ ఉద్దేశ్యంతో చెప్పబడినవో వివరించి విశ్లేషితే పూర్తిగా అర్థం అయ్యే అవకాశాలు ఎక్కువ.

విషం :
మొదట విషం అనే పదం గురించి విశ్లేషిస్తే అది ప్రమాదకరం, అపాయకరం అనే అర్థంతో వాడబడింది. అయితే ఇక్కడ ఎవరికి ప్రమాదకరం అనే విషయాన్ని చెప్పాలి. ఇది మానవాళి మొత్తానికి చెప్పబడినది. సాధారణంగా మానవాళి అనగానే మనం మనకు తెలిసిన వర్గాలను మాత్రమే తీసుకుంటాము. అమెజాన్ పరీవాహక ప్రాంతంలో అప్పుడే పుట్టిన బిడ్డనుండి అమెరికా ప్రెసిడెంట్ కాండిడేట్ వరకు సమానమయిన ఇంపార్టెన్స్ ఉండే మానవాళి.

అనైతిక :
రెండవది నైతికత గురించి. నైతికత అనేది కాలాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. ఫలానా ప్రవర్తనని నైతికమైనది మరో రకమైనది అనైతిహికమైనది అని ఖచ్చితంగా నిర్వచించడం సాధ్యపడదు. అటువంటపుడు ఏది నైతికతో నిర్ధారించలేని స్థితిలో అనైతికత అని ఎలా అంటారు అని కూడా అనవచ్చు. అప్పటి పరిస్థితులలో ఏదయితే బలహీనమైన వర్గాలు ఉంటాయో వాటికి వ్యతిరేకంగా పని చెయ్యటాన్ని అనైతికత గా భావించాను. ఇష్యూని బట్టి ఈ వర్గాలు మారుతుండవచ్చు. అడవిలోకి వెళ్లిన మనిషిని పులి వేటాడి చంపడము, పులిని మనిషి చంపడము ఒకే విధంగా చూడలేం. కారణం అడవి పులి నివాసం ఉండే ప్రాంతం. అక్కడ అడవి అనేది కాంటెక్స్ట్. ఆ కాంటెక్స్ట్ ని వదిలేస్తే రెండు సమానమయినవిగా కనిపిస్తాయి.

హేతువాదం :
మూడవది ముఖ్యమయినది హేతువాదం. హేతువాదం ఒక ఆలోచన విధానం. దానికి నైతికత, అనైతికత, విలువలు, విలువలు లేక పోవటం తో సంబంధం ఉండదు. ఈ విధానంలో ఏదయితే ఇన్పుట్ ఇస్తామో దానిని బట్టి అవుట్ ఫుట్ వస్తుంది. తప్పు హేతువాదానికి కాదు. తప్పు ఇన్ ఫుట్ ఇచ్చేటటువంటి వ్యక్తిది. భౌతికమైన అంశాలను హేతుబద్దంగా ఆలోచిస్తే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. కారణం వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేసే అంశాలు చాల కొద్దిగా ఉంటాయి. అవికూడా ప్రతిఒక్కరు చూడటమో, వినటమో, అనుభవం పొందటానికి అవకాశం ఉండేవి. కానీ బిహేవియరల్ రిలేటెడ్ ఇష్యూ అలా ఉండవు. ఒక వ్యక్తి, లేదా వక్తుల సమూహం ప్రవర్తన, ఆలోచనా తీరుని అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. అందులో చాల వరకు మానశికమైనవి.

ఫిసికల్ సైన్స్ సూత్రాలు పనిచేసినట్లు బిహేవియరల్ సైన్స్ సూత్రాలు పని చెయ్యవు. ఈ విషయాన్ని హేతువాదులు విస్మరించరాదు. నిజానికి హేతువాదులు, హేతువాదులు కానీ వారు అని ఉండరు. ఖచ్చితమైన డివిజన్ ఉండదు. పొలిటికల్ పార్టీలు లాగా కొందరు హేతువాదులు కొందరు హేతువాదులు కాదు అనటం సరి కాదు. ప్రతీ మనిషి లోను హేతుబద్దత ఉంటుంది. ఉదాహరణకు నాస్తికుడిని అయినా నేను కార్ కి ఏదయినా అడ్డు వస్తే బ్రేక్ తొక్కుతాను. మరో ఆస్తికుడు కూడా అదే పని చేస్తాడు. అది మాని దేవుడిని ప్రార్థించడు. కేవలం కొన్ని విశ్వాసాల పట్ల మాత్రమే వైరుధ్యం ఉంటుంది.

విశ్వాసాలు అనేవి పూర్తి మానసిక మైనవి. సామాజికమైనవి. వాటిని అర్థం చేసుకోవటానికి భౌతిక, రసాయనిక సైన్స్ సూత్రాలను అర్థం చేసుకున్నట్లు చేసుకుంటే సాధ్యపడదు. బిహేవియరల్ సైన్స్ సూత్రాలను ఉపయోగించాలి. ఏ విషయం అయినా కాంటెక్స్ట్ మార్చితే లేదా సెలెక్టివ్ ఫాక్టర్స్ ని మాత్రం తీసుకొని అనలైజ్ చేస్తే తప్పుడు ఫలితాలు వస్తాయి. బిహేవియరల్ ఇష్యూస్ అన్ని కూడా మరొక ఇష్యూ తోని ముడి పడి ఉంటాయి. ఆ మరో ఇష్యూ ఇంకో 4 ఇష్యూలతో ముడిపడి ఉంటుంది.

ఉదాహరణకు ప్రస్తుతం భారత్ దేశంలో అన్ని మతాల వారు ఉన్నారు కాబట్టి ఇది అందరికి చెందుతుంది అనే ఒక వాదన. దానికి బదులుగా ఛాందసవాద హిందువులు కొందరు ఈ దేశం వేల సంవత్సరాల నుండి హిందువులు ఉన్నారు, మిగిలిన వారు తరువాత వచ్చారు కాబట్టి ఇది హిందూ దేశం అని వాదిస్తారు. వీరు వర్తమానానికి తక్కువ ప్రాధాన్యత ఇచ్చి చరిత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆ చరిత్ర కూడా సెలెక్టివ్ గా తీసుకుంటారు. వారి సిద్ధాంతం ప్రకారం చరిత్ర ఆధారంగా తీసుకుంటే హిందువులకంటే ముందు ఈదేశంలో ఎవరు ఉన్నారు? అసలు మనుషులు లేనపుడు ఈ భూమి ఎవరిది అనే ప్రశ్నలు వేసుకోరు. ఏ దేశం ఎవరిది అనే విషయంలో కాంటెక్స్ట్ మార్చితే అర్థం మారినట్లు ప్రతీ విషయాన్ని కాంటెక్స్ట్ మార్చితే అర్థం మారిపోతుంది.

అయితే ప్రతీ హేతువాది కూడా తనకు అనుకూలంగా ఉన్న అంశాలను మాత్రమే తీసుకొని మిగిలిన వాటి ప్రాధాన్యత తగ్గించి విషయాన్ని తప్పు దోవ పట్టించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇతరులు కూడా దానిని ప్రశ్నించకుండా ఆమోదిచడం జరుగుతుంది. ప్రశ్నించిన వారి పట్ల ఆధిపత్యం గల హేతువాది ప్రశ్నించడాన్ని అనైతికతగా చిత్రీకరించడం జరుగుతుంది. పూర్వం రాజుల దగ్గర బ్రాహ్మణులూ/మంత్రులు చేసిన పని అదే. అప్పుడు కూడా హేతువాదం ఉండేది. కానీ రాజుకు అనుకూలమైన హేతువాదాన్ని స్వాగతించి వ్యతిరేకమైన హేతువాదాన్ని నిర్ధాక్షిణ్యంగా నిర్మూలించే వారు. ఆ ఫలితంగానే మనకు మతాలూ, మూఢ నమ్మకాలూ లభించాయి.

Conclusion :
ఈ విధమైన సెలెక్టీవ్ హేతువాదం వలన ఆధిపత్య వర్గాలు లభ్ది పొంది బలహీన వర్గాలను అణిచివేస్తాయి. కాబట్టి హేతువాదాన్ని హేతువాదంగా కాకుండా దానిని ఒక సామాజిక విలువగా చిత్రీకరించడం అనేది సమాజానికి, ప్రకృతికి నష్టం కల్పిస్తుంది. మనిషి హేతువాది కావలసిన అవసరం ఉంది. కానీ అది ఒక పొలిటికల్ పార్టీ నుండి వేరే పొలిటికల్ పార్టీలోకి లేదా ఒక మతం నుండి వేరే మతం లోకి మారటం వంటిది కాదు అని గ్రహించాలి. నైతికత లేకుంటే హేతువాదం మానవాళికి నష్టదాయకం అని గ్రహించాలి.

- హరి రాఘవ్

Keywords : rationalism, ethics, moral, values
(02.05.2018 09:45:38am)

No. of visitors : 2399

Suggested Posts


10 results found !


పేదరికంలో ఆకలి చావులుంటాయి తప్ప ఆత్మహత్యలుండవు

మనిషి ప్రాధమిక అవసరాలు తీరనిదే ఇతర విషయాలను పట్టించుకోడు. ప్రాధమిక అవసరాలకోసం తను ఏమయినా చేస్తాడు. సాటి ప్రాణిని చంపుతాడు. సాటి మనిషిని చంపుతాడు, అవసరమైతే బానిసత్వం వహిస్తాడు. ఎవరికయినా తలొంచుతాడు. అది మతమయినా, పెట్టుబడి దారుడయినా, దోపిడీ దారుడయినా.. ప్రాధమిక అవసరాలు తీరనిదే తను హేతుబద్దంగా ఆలోచించలేడు, సైంటిఫిక్ థింకింగ్ అలవర్చుకోలేడు. సైన్స్ ఎప్పుడూ ఉ

హేతువాదులు అంటే ఎవరు?

1) హేతువాదులు అంటే ఎవరు? విషయాన్నీ హేతుబద్దంగా విశ్లేషించి అర్థం చేసుకునేవారు. అలాగే ఇతరులకు వివరించేటపుడు హేతుబద్దంగా వివరించేవారు. హేతువాదులు అంటే హిందువులను తిట్టేవారు, ముస్లిమ్స్ ని తిట్టేవారు, క్రైస్తవులను తిట్టేవారు కాదు. తిట్టడం, పోట్లాడటం, అవమానించడం హేతువాదులు పని కాదు. ఎవరన్నా హేతువాదులు అలా చేస్తుంటే అది వారి వ్యక్తిగత లక్షణం తప్ప హేతువాదానిక

పూర్తి హేతుబద్ధత ఎంత వరకు సాధ్యం?

సాధారణంగా వ్యక్తులు తమకు తాము హేతువాదులుగా చెప్పుకుంటారు. నాస్తికులే కాకుండా చాలామంది ఆస్తికులు కూడా తమను హేతువాదులుగా భావిస్తూ ఉంటారు. ప్రతీ ఒక్కరూ కూడా తమ ఆలోచన హేతుబద్దమైనదిగానే భావిస్తూ ఉంటారు. నిజంగా ప్రపంచంలో ఎవరయినా ఒక వ్యక్తి పూర్తి హేతుబద్దంగా ఆలోచించగలడా? అని ప్రశ్నించుకుంటే ʹలేదుʹ అనే సమాధానమే వస్తుంది. మనిషి ఆలోచనలను ప్రభావితం చేసే అంశాల గుర

హేతువాద వ్యాప్తి

కొంత కాలం క్రితం రాజస్థాన్ లోని జైసల్మేర్ అనే చిన్న పట్టణంలో ఒక పది మంది హేతువాదులు ఉండేవారు. వారు వారి ఉద్యోగాలు చేసుకొంటున్న క్రమంలో ఒకరి గురించి ఒకరు తెలుసుకొని స్నేహితులుగా మారారు. వారు పది మంది ప్రతీ ఆదివారం ఒకదగ్గర టీ, బిస్కేట్స్ తీసుకుంటూ హేతువాదం గురించి చర్చించుకునే వారు. అలాగే మూఢనమ్మకాల గురించి చర్చించుకునేవారు. మూఢనమ్మకాలు కలిగిఉన్నవారి మీద

వృద్ధాప్యంలో కొందరు నాస్తికులు ఎందుకు ఆస్తికులుగా మారతారు?

హేతువాద నాస్తికుడిగా మారటం ఒక రాజకీయ పార్టీ నుండి వేరొక రాజకీయ పార్టీకి మారినట్లు కాదు. నిజమయిన హేతువాది మీద తీవ్రమయిన మానసిక ఒత్తిడి ఉంటుంది. దేనిని హేతుబద్దంగా ఆలోచించాలి, ఎంతవరకు హేతుబద్దంగా ఆలోచించాలి అనే విషయాలు అర్థం కాక ప్రతీ విషయాన్నీ తను హేతుబద్దంగా విశ్లేషించే ప్రయత్నం చేస్తాడు. అపరిమితంగా హేతుబద్ధ విశ్లేషణ వల్ల అతను పడే మానసిక శ్రమ ఈ ఒత్తిడికి

మానవత్వం - హేతువాదం

తల్లిదండ్రుల సమాధుల మధ్యలో ఒక చిన్న పిల్లవాడు నిద్రిస్తూ ఉండే ఒక ఫోటో సామాజిక మాధ్యమాలలో ఎప్పటినుండో హల్ చల్ చేస్తుంది. దానిని నమ్మిన వారు తిరిగి షేర్ చెయ్యటం జరుగుతూ ఉంది. అయితే కొంచెం రీసెర్చ్ చేస్తే అది ఒక ఫోటో షూట్ లో భాగంగా తీసింది. అది నిజం కాదు అని తెలుస్తుంది. విషయం ఏమిటంటే ప్రతీ సందర్భంలోనూ మనస్సు హేతుబద్దంగానే ఆలోచిస్తోందా? అలాగే ఆలోచించాలా? కొ

నాస్తికత్వం - సైన్స్

నాస్తికత్వం వేరు సైన్స్ వేరు. నాస్తికత్వం పరిధి చాల చిన్నది. దేవుడు, మతము మొదలైన ఆధ్యాత్మిక నమ్మకాలకు సంబంధిచినది మాత్రమే. సైన్స్ కి పరిధి లేదు. ఇది విశ్వం మొత్తానికి సంబంధిచినది. దీనికి ఆస్తికుడు, నాస్తికుడు, లేదా ఆ మతం వాడు ఈ మతం వాడు అని సంబంధం ఉండదు. పసిపిల్లవాడు తన తల్లి చనుబాలు త్రాగటం దగ్గరనుండి రాకెట్ ప్రయోగించడం వరకు ప్రతీ దానిలో సైన్స్ ఉంటుంది.

హేతువాదం - కమ్యూనికేషన్

ఏదయినా ఒక విషయాన్నీ హేతుబద్దంగా కమ్యూనికేట్ చెయ్యాలి అంటే మొదట కమ్యూనికేషన్ గురించి కొంత అవగాహన ఏర్పర్చుకోవలసి ఉంటుంది. కమ్యూనికేషన్ అనగానే చాల మంది భాష అను

హేతువాదం

ఆదిమకాలం నుంచి మనిషి ఎమోషన్స్ ఒకవైపు విషయాన్నీ హేతుబద్దంగా విశ్లేషించకుండా అంగీకరించేలాగా చేస్తుంటే మరోవైపు హేతుబద్దంగా విశ్లేషించడం ద్వారా ప్రగతి సాధిస్తున

పరిమిత హేతువాదం

కార్ల్ మార్క్స్, మావో, వివేకానంద, రమణానంద, గాంధీ, బుద్ధుడు లేదా మరెవరో చెప్పాడనో మనిషి ఆ సిద్ధాంతాలను పట్టుకొని వేలాడటం వృధా. ఈ స్థితి మానసికమైన జడత్వానికి
Search Engine

బయలాజికల్ మదర్
ఫేస్బుక్ ఓసీడీ (FBOCD)
నిజం ఆవస్యకత
నిజాలన్నీ అబద్దాలే
కెరీర్
చీమ మెదడులో చేరిన వైరస్
వ్యక్తి
జీవితం
హ్యూమనిజం
నేనెవరు?
PTSD
డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు
రిజర్వేషన్స్
కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది?
టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?
మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా?
Autism Treatment
మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా?
NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు
టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన
పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!
పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?
మనుసులో భావాలే కలలుగా వస్తాయా?
కలలు నిజాలు అవుతాయా?
ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్
Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..?
తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?
టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి?
రెండవ కూతురు
ఏకాగ్రత పెంచుకోవడం ఎలా?
మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా?
ఫ్రీ థింకింగ్
పోరాటమా? బ్రతుకా?
more..
అనైతిక