ఎవరికి పిచ్చి?

ఎవరికి

చాలా మంది మానసికంగా సమస్యలున్న వారితో పాటు కొన్ని సార్లు మతి స్థిమితం లేని వారితో కూడా నేను మాట్లాడాల్సి వస్తుంది. వారికి మానసిక సమస్య కాదు నిర్ధారించుకొని వారిని డాక్టర్ని సంప్రదించాల్సిందిగా చెప్పడం జరుగుతుంది. ఇలా మాట్లాడేటపుడు మానసిక సమస్యలతో నా వద్దకు వచ్చే వారి కన్నా మతి స్థిమితం లేని వారిని డీల్ చెయ్యడం సులభం. ఎందుకంట మానసిక సమస్యలతో వచ్చేవారిలో చాల వరకు అహంకారంతోనో, లేదా విపరీతమైన ఆర్థిక పరమైన లేదా కీర్తి కోసమో సమస్యలలో పడతారు. కానీ మతి స్థిమితం లేని వారి మనస్సు చాల స్వచ్ఛంగా ఉంటుంది. మనకు కనిపించని ఏవో ఆకారాలు, శబ్దాలు వారికి కనిపిస్తూ ఉంటాయి. దానికి కారణం వారి మెదడులోని ఇబ్బందులుండడం.

ఇటీవల schizophrenia తో బాధపడుతున్న ఒక అమ్మాయితో దాదాపు 4 గంటల పాటు మాట్లాడాల్సి వచ్చింది. ఆమె వ్యక్తపరచిన అన్ని విషయాలలో లాజిక్ ఉంటుంది. మామూలు వ్యక్తులకు అది అర్థం కావడం లేదు. ఆమె మెదడులో ఏర్పడుతున్న వాటిని అర్థం చేసుకొని లాజికల్ గా విశ్లేషిస్తే ప్రతీ విషయానికి ఒక అర్థం ఉంది అని తెలుస్తుంది.

ఆంద్రప్రదేశ్ లో ఇటీవల బీహార్ నుండి ముఠా ఒకటి వచ్చి చిన్నపిల్లలను ఎత్తుకు పోతున్నారని పుకారు వచ్చింది. ఆ ముఠా సభ్యులు మతి స్థిమితం లేని వారిగా నటిస్తూ ఉంటారని ఆ పుకారులో సమాచారం. అంతే ప్రజలంతా పిచ్చెక్కినట్లు మతిస్థిమితం లేని వారిని దొరక పుచ్చుకొని చావ బాదుతున్నారు. వారు మతిస్థిమితం లేకపోవడాన్ని నటనగా భావిస్తూ కొడుతుంటే పాపం మతిస్థిమితం లేని ఆ అమాయకులను ఆదుకునే వారులేక దెబ్బలు తింటున్నారు.

వీటికి స్పందిస్తూ కాకినాడ SP ఒక వీడియో కూడా పోస్ట్ చేసారు. అటువంటి ముఠా ఏది రాష్ట్రంలో తిరగడం లేదని, ప్రజలు అనవసరంగా మతిస్థిమితం లేని వారిని కొట్టొద్దని, పోలీస్ వ్యవస్థ అప్రమత్తంగా ఉందని తెలియజేసారు. కాబట్టి ప్రజలు విజ్ఞతతో వ్యవహరించాలి. మతిస్థిమితం లేని వారిని హింసించడం కాకుండా వారిని అర్థం చేసుకోండి. ఒక వేళ అనుమానం ఉంటే పోలీస్ వారికి సమాచారాన్నివ్వండి.

- హరి రాఘవ్

Keywords : bihar, thieves, mad,
(22.05.2018 11:29:00am)

No. of visitors : 2644

Suggested Posts


2 results found !


When Education Fails..? | చదువులే ఫెయిలయితే..? | Hari Raghav

Education means not just remembering subject and putting it on the examination paper. It also does not mean learning about operating machines & handling sof

మడావి తుకారాం

పాత ఆదిలాబాద్ జిల్లా ప్రస్తుత కొమరం భీం ఆశీఫాబాద్ జిల్లా లోని ఉట్నూర్ ప్రాంతంలో ఆదివాసులు ప్రముఖంగా నివసిస్తున్నారు. దట్టమయిన అడవిలో అభివృద్ధికి ఆమడ దూరంలో
Search Engine

బయలాజికల్ మదర్
ఫేస్బుక్ ఓసీడీ (FBOCD)
నిజం ఆవస్యకత
నిజాలన్నీ అబద్దాలే
కెరీర్
చీమ మెదడులో చేరిన వైరస్
వ్యక్తి
జీవితం
హ్యూమనిజం
నేనెవరు?
PTSD
డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు
రిజర్వేషన్స్
కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది?
టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?
మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా?
Autism Treatment
మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా?
NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు
టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన
పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!
పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?
మనుసులో భావాలే కలలుగా వస్తాయా?
కలలు నిజాలు అవుతాయా?
ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్
Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..?
తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?
టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి?
రెండవ కూతురు
ఏకాగ్రత పెంచుకోవడం ఎలా?
మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా?
ఫ్రీ థింకింగ్
పోరాటమా? బ్రతుకా?
more..
ఎవరికి