పేదరికంలో ఆకలి చావులుంటాయి తప్ప ఆత్మహత్యలుండవు

పేదరికంలో

మనిషి ప్రాధమిక అవసరాలు తీరనిదే ఇతర విషయాలను పట్టించుకోడు. ప్రాధమిక అవసరాలకోసం తను ఏమయినా చేస్తాడు. సాటి ప్రాణిని చంపుతాడు. సాటి మనిషిని చంపుతాడు, అవసరమైతే బానిసత్వం వహిస్తాడు. ఎవరికయినా తలొంచుతాడు. అది మతమయినా, పెట్టుబడి దారుడయినా, దోపిడీ దారుడయినా.. ప్రాధమిక అవసరాలు తీరనిదే తను హేతుబద్దంగా ఆలోచించలేడు, సైంటిఫిక్ థింకింగ్ అలవర్చుకోలేడు.

సైన్స్ ఎప్పుడూ ఉంటుంది. అభివృద్ధి చెందేది టెక్నాలజీ మాత్రమే. సైంటిఫిక్ థింకింగ్ వల్ల అభివృద్ధి చెందిన టెక్నాలజీని దోపిడీదారుడు కేవలం దోపిడీ చెయ్యడానికే ఉపయోగించుకుంటాడు తప్ప మానవాళి ఉన్నతి కొరకు ఉపయోగించడు. సైన్స్ ఫలితాలు మొదట చేరేది సంపన్న వర్గాలాగే కాబట్టి అసమానతలు తగ్గక పోగా అవి మరింత పెరుగుతాయి. ఆ తప్పు సైన్స్ ది కాదు. మతము, ఆధిపత్య వర్గాలు, పెట్టుబడి దారులు ఎప్పటికీ తమ ఆధిపత్యం నిలుపుకోవాలని ప్రయత్నమే చేస్తారు.

ప్రపంచంలో అసమానతలు కొనసాగుతూ మెజారిటీ ప్రజలకు ప్రాధమిక అవసరాలు తీరే అవకాశాలు లేనపుడు వారు మూఢ నమ్మకాలని కలిగి ఉంటారు. ఏదో ఒక విధంగా బ్రతకాలనే ప్రయత్నం చేస్తాడు తప్ప విరమించుకోడు. పేదరికంలో ఆకలి చావులుంటాయి తప్ప ఆత్మహత్యలుండవు. టెక్నాలజీ పెరిగే కొద్దీ అసమానతలు పెరుగుతూనే ఉంటాయి. దానికి కారణం వ్యవస్థ. బలవంతుడు మరింత బలంగా మారడానికి బలహీనులను తన ఆధీనంలో ఉంచుకోడానికి భౌతికంగా టెక్నాలజీని, మానసికంగా మత విశ్వాసాలను పెంపొందిస్తాడు. ఈ స్థితి అనంతమైనది.

ప్రార్థన స్థలాల బయట బిక్షాటన చేసే వారి ఆకలి తీర్చకుండా నాస్తికత్వం బోధించడం వల్ల ఉపయోగం లేదు. ఈ భూప్రపంచంలో ఎంత గొప్ప నాస్తికుడయినా వారిని నాస్తికులుగా మార్చలేరు. ఎంత గొప్ప హేతువాదయినా వారిని హేతుబద్దంగా ఆలోచింపజేయలేడు. ప్రపంచ సమస్యలన్నిటికీ మూల కారణం హేతుబద్దంగా ఆలోచించ లేకపోవడం. హేతుబద్దంగా ఆలోచించలేక పోవడానికి కారణం అసమానతలు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా అసమానతలు తొలగవు. సామజిక మార్పు రానిదే భౌతిక మైన మార్పులు వృధాగా మారతాయి.

- హరి రాఘవ్

Keywords : science, rationalism
(19.06.2018 02:12:31pm)

No. of visitors : 1875

Suggested Posts


10 results found !


అనైతిక హేతువాదం విషం

పై వాక్యంలో 3 పదాలు ఉన్నాయి. 1) అనైతికత 2) హేతువాదం 3) విషం. ఈ మూడు పదాలను ఏ ఉద్దేశ్యంతో చెప్పబడినవో వివరించి విశ్లేషితే పూర్తిగా అర్థం అయ్యే అవకాశాలు ఎక్కువ. విషం : మొదట విషం అనే పదం గురించి విశ్లేషిస్తే అది ప్రమాదకరం, అపాయకరం అనే అర్థంతో వాడబడింది. అయితే ఇక్కడ ఎవరికి ప్రమాదకరం అనే విషయాన్ని చెప్పాలి. ఇది మానవాళి మొత్తానికి చెప్పబడినది. సాధారణంగా మానవా

హేతువాదులు అంటే ఎవరు?

1) హేతువాదులు అంటే ఎవరు? విషయాన్నీ హేతుబద్దంగా విశ్లేషించి అర్థం చేసుకునేవారు. అలాగే ఇతరులకు వివరించేటపుడు హేతుబద్దంగా వివరించేవారు. హేతువాదులు అంటే హిందువులను తిట్టేవారు, ముస్లిమ్స్ ని తిట్టేవారు, క్రైస్తవులను తిట్టేవారు కాదు. తిట్టడం, పోట్లాడటం, అవమానించడం హేతువాదులు పని కాదు. ఎవరన్నా హేతువాదులు అలా చేస్తుంటే అది వారి వ్యక్తిగత లక్షణం తప్ప హేతువాదానిక

పూర్తి హేతుబద్ధత ఎంత వరకు సాధ్యం?

సాధారణంగా వ్యక్తులు తమకు తాము హేతువాదులుగా చెప్పుకుంటారు. నాస్తికులే కాకుండా చాలామంది ఆస్తికులు కూడా తమను హేతువాదులుగా భావిస్తూ ఉంటారు. ప్రతీ ఒక్కరూ కూడా తమ ఆలోచన హేతుబద్దమైనదిగానే భావిస్తూ ఉంటారు. నిజంగా ప్రపంచంలో ఎవరయినా ఒక వ్యక్తి పూర్తి హేతుబద్దంగా ఆలోచించగలడా? అని ప్రశ్నించుకుంటే ʹలేదుʹ అనే సమాధానమే వస్తుంది. మనిషి ఆలోచనలను ప్రభావితం చేసే అంశాల గుర

హేతువాద వ్యాప్తి

కొంత కాలం క్రితం రాజస్థాన్ లోని జైసల్మేర్ అనే చిన్న పట్టణంలో ఒక పది మంది హేతువాదులు ఉండేవారు. వారు వారి ఉద్యోగాలు చేసుకొంటున్న క్రమంలో ఒకరి గురించి ఒకరు తెలుసుకొని స్నేహితులుగా మారారు. వారు పది మంది ప్రతీ ఆదివారం ఒకదగ్గర టీ, బిస్కేట్స్ తీసుకుంటూ హేతువాదం గురించి చర్చించుకునే వారు. అలాగే మూఢనమ్మకాల గురించి చర్చించుకునేవారు. మూఢనమ్మకాలు కలిగిఉన్నవారి మీద

వృద్ధాప్యంలో కొందరు నాస్తికులు ఎందుకు ఆస్తికులుగా మారతారు?

హేతువాద నాస్తికుడిగా మారటం ఒక రాజకీయ పార్టీ నుండి వేరొక రాజకీయ పార్టీకి మారినట్లు కాదు. నిజమయిన హేతువాది మీద తీవ్రమయిన మానసిక ఒత్తిడి ఉంటుంది. దేనిని హేతుబద్దంగా ఆలోచించాలి, ఎంతవరకు హేతుబద్దంగా ఆలోచించాలి అనే విషయాలు అర్థం కాక ప్రతీ విషయాన్నీ తను హేతుబద్దంగా విశ్లేషించే ప్రయత్నం చేస్తాడు. అపరిమితంగా హేతుబద్ధ విశ్లేషణ వల్ల అతను పడే మానసిక శ్రమ ఈ ఒత్తిడికి

మానవత్వం - హేతువాదం

తల్లిదండ్రుల సమాధుల మధ్యలో ఒక చిన్న పిల్లవాడు నిద్రిస్తూ ఉండే ఒక ఫోటో సామాజిక మాధ్యమాలలో ఎప్పటినుండో హల్ చల్ చేస్తుంది. దానిని నమ్మిన వారు తిరిగి షేర్ చెయ్యటం జరుగుతూ ఉంది. అయితే కొంచెం రీసెర్చ్ చేస్తే అది ఒక ఫోటో షూట్ లో భాగంగా తీసింది. అది నిజం కాదు అని తెలుస్తుంది. విషయం ఏమిటంటే ప్రతీ సందర్భంలోనూ మనస్సు హేతుబద్దంగానే ఆలోచిస్తోందా? అలాగే ఆలోచించాలా? కొ

నాస్తికత్వం - సైన్స్

నాస్తికత్వం వేరు సైన్స్ వేరు. నాస్తికత్వం పరిధి చాల చిన్నది. దేవుడు, మతము మొదలైన ఆధ్యాత్మిక నమ్మకాలకు సంబంధిచినది మాత్రమే. సైన్స్ కి పరిధి లేదు. ఇది విశ్వం మొత్తానికి సంబంధిచినది. దీనికి ఆస్తికుడు, నాస్తికుడు, లేదా ఆ మతం వాడు ఈ మతం వాడు అని సంబంధం ఉండదు. పసిపిల్లవాడు తన తల్లి చనుబాలు త్రాగటం దగ్గరనుండి రాకెట్ ప్రయోగించడం వరకు ప్రతీ దానిలో సైన్స్ ఉంటుంది.

హేతువాదం - కమ్యూనికేషన్

ఏదయినా ఒక విషయాన్నీ హేతుబద్దంగా కమ్యూనికేట్ చెయ్యాలి అంటే మొదట కమ్యూనికేషన్ గురించి కొంత అవగాహన ఏర్పర్చుకోవలసి ఉంటుంది. కమ్యూనికేషన్ అనగానే చాల మంది భాష అను

హేతువాదం

ఆదిమకాలం నుంచి మనిషి ఎమోషన్స్ ఒకవైపు విషయాన్నీ హేతుబద్దంగా విశ్లేషించకుండా అంగీకరించేలాగా చేస్తుంటే మరోవైపు హేతుబద్దంగా విశ్లేషించడం ద్వారా ప్రగతి సాధిస్తున

పరిమిత హేతువాదం

కార్ల్ మార్క్స్, మావో, వివేకానంద, రమణానంద, గాంధీ, బుద్ధుడు లేదా మరెవరో చెప్పాడనో మనిషి ఆ సిద్ధాంతాలను పట్టుకొని వేలాడటం వృధా. ఈ స్థితి మానసికమైన జడత్వానికి
Search Engine

బయలాజికల్ మదర్
ఫేస్బుక్ ఓసీడీ (FBOCD)
నిజం ఆవస్యకత
నిజాలన్నీ అబద్దాలే
కెరీర్
చీమ మెదడులో చేరిన వైరస్
వ్యక్తి
జీవితం
హ్యూమనిజం
నేనెవరు?
PTSD
డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు
రిజర్వేషన్స్
కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది?
టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?
మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా?
Autism Treatment
మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా?
NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు
టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన
పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!
పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?
మనుసులో భావాలే కలలుగా వస్తాయా?
కలలు నిజాలు అవుతాయా?
ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్
Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..?
తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?
టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి?
రెండవ కూతురు
ఏకాగ్రత పెంచుకోవడం ఎలా?
మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా?
ఫ్రీ థింకింగ్
పోరాటమా? బ్రతుకా?
more..
పేదరికంలో