మోసం

మోసం

మనిషి ఒకరినొకరు తమ తెలివితో మోసం చేసుకోవడం కారణంగానే సమాజం ఏర్పడింది. ఒకరినొకరు మోసగించుకోకుండా ప్రతీ వ్యక్తికీ జీవించే ప్రాధమిక హక్కు కల్పించడం సమాజం అనే కాన్సెప్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం. కానీ వ్యక్తి సమాజంలోని కట్టుబాట్లను అంగీకరిస్తూనే తన అవసరాల కోసం ఇతరులను సాధ్యమైనంత మేర మోసం చేసి బ్రతకాలని చూస్తూ ఉంటాడు. కొన్ని రకాల మోసాలను చట్ట పరిధిలోకి వస్తే కొన్ని రకాలు నైతికత ఆధారంగా నిర్ణయిస్తాము.

మోసం ఎవరు, ఎవరిని, ఏ పరిస్థితులలో చేశారనేది సామాజికంగా ముఖ్యమైన అంశం. సమాజంలో అన్ని విధాలా మోసపోయిన వ్యక్తి తన ప్రాధమిక అవసరాల కోసం మోసం చేస్తే చట్టపరంగా దానిని మోసంగా పరిగణిస్తాము. ఉదాహరణకు కూరగాయలు అమ్ముకునే వ్యక్తి తూకంలో మోసం చేస్తే చట్టప్రకారం అది నేరం. కానీ వ్యవస్థలో దళారులు, పెట్టుబడి దారులు కూరగాయలను కోల్డ్ స్టోరేజి నిల్వఉంచి, మార్కెట్ లో తాత్కాలిక డిమాండ్ సృష్టించి ఎక్కువ రేటుకు అమ్మితే దానిని మోసంగా చట్టం పరిగణించే అవకాశాలు తక్కువ.

వ్యక్తి గతంగా చూసినపుడు సమాజం నడుస్తున్న తీరులో మోసం ఉంటుంది. కొన్నిసార్లు ఆర్థికపరమైనవయితే కొన్ని సార్లు భావోద్వేగపరంగా మనల్ని బాధ పెడతాయి. నమ్మి ఉమ్మడి కుటుంబంలో కొనసాగుతున్నప్పుడు అన్నదమ్ములు ఒకరినొకరు మోసం చేసుకునే అవకాశముంటుంది. నిజానికి అన్న మోసం చేసి పొందిన డబ్బు కన్నా తమ్ముడు తన అన్న తనను మోసం చేసాడు అనే బాధ ఎక్కువగా ఉంటుంది. అలాగే భార్యభర్తల మధ్య కూడా జరుగుతుంది. బాగా సంపాదన పెరిగాక భర్త తన భార్యతో విడాకులు కోరుతూ అవసరమైన భరణం చెల్లించడానికి సిద్దపడ్డప్పుడు భార్యకు డబ్బు ఇచ్చే ఆనందం కన్నా తన భర్త అనైతిక నిర్ణయం ఆమెను ఎక్కువ బాధకు గురిచేస్తుంది.

ఒక ఎక్సిస్టెన్షలిస్టుగా నేను నావరకు మోసం జరిగిన దానికన్నా ఆ మోసం వల్ల నాకు వచ్చే మానసిక వేధన ఆధారంగా నిర్ణయం తీసుకుంటా. కొన్ని సార్లు చాల చిన్న విషయాలే నన్ను అత్యధికంగా బాధిస్తే మరి కొన్నిసార్లు ఎంతో పెద్ద విషయాలు కూడా నన్ను తాకావు. కారణం ఆ సమయంలో నా అవసరం మరియూ నేను వాటికి ఇచ్చే ప్రాధాన్యత. నేను నమ్మడం మోస పోవడం జరగదు. చాల విషయాలలో మోసపోవడానికి నేను సిద్దపడి పోతాను. నాకు ఎవరన్నా డబ్బు ఇస్తే దానిని లెక్క పెట్టుకోను. అది నమ్మకంతో కాదు. నాకు డబ్బు లెక్కపెట్టుకోవడం చాల చిరకయినా పని. కొన్నిసార్లు వాళ్ళు తక్కువ ఇచ్చి మోసం చెయ్యొచ్చు. లేదా పొరబాటున తక్కువ కూడా ఇవ్వొచ్చు. మరి కొన్ని సార్లు ఎక్కువ కూడా ఇవ్వొచ్చు. ఎలా ఇచ్చినా నేను లెక్క పెట్టుకోకుండా తీసుకుంటాను. అందులో ఎక్కువ తక్కువలు నాకు అనవసరం. కానీ ఇది అందరికీ సాధ్యపడదు. ఒక సంస్థ కోసమో లేదా ఒక ప్రోడక్ట్ కొనడం కోసమో తీసుకునే విషయంలో మోసం జరిగితే అది తీవ్రంగా ఆర్థికంగా బాధిస్తుంది.

అలాగే నాకు ఇతర ఆర్ధిక లావాదేవీలలో కూడా నేను లెక్కించను. వారు మోసం చేసినా ఓకే అని వారితో కొనసాగుతాను. ఎవరు మోసం చేస్తారు ఎవరు పొరపాటున తప్పు చేస్తారో వారు మాట్లాడే విధానాన్ని బట్టి అంచనా వేసుకుంటా తప్ప డబ్బు విషయంలో చెక్ చేసుకోను. నా వరకు ఎవరయినా మోసం చేస్తే వచ్చే నష్టం కన్నా వారు మోసం చేశారనే భావన నా మనస్సుకు కష్టంగా ఉంటుంది. అందుకు నేను ఈ పంధా ఎన్నుకున్నాను. పాలవాళ్ళు, కూరగాయల వాళ్ళు, పేపర్ వాళ్ళు, సర్వెంట్స్ మోసాన్ని అస్సలు పట్టించుకోను. కానీ వాళ్ళు నేను పట్టించుకోనని మరింత శ్రద్దగా వాళ్ళు నాకు సర్వీస్ చేస్తారు తప్ప ఎప్పుడూ మోసం చెయ్యరు. ఎప్పుడయినా పెద్ద ఎత్తున మోస పోతే మరోసారి అదే పొరపాటు జరగకుండా జాగ్రత్త తీసుకుంటాను.

- హరి రాఘవ్

Keywords : cheating, psychology
(25.06.2018 07:27:18am)

No. of visitors : 3597

Suggested Posts


10 results found !


ఫేస్బుక్ ఓసీడీ (FBOCD)

ఫేస్బుక్ ఓసీడీ (FBOCD) మూడు రకాలుగా ఉంటుంది. ఇందులో #మొదటి రకం వారు తెల్లవారు ఝామున లేచిన వెంటనే ʹగుడ్ మార్నింగ్ʹ అంటూ పోస్ట్ పెట్టడడం తో ప్రారంభమయి అర్థ రాత్రి గుడ్ నైట్ అని పెట్టే వరకు కొనసాగుతుంది. ఈ మధ్యలో

నిజం ఆవస్యకత

నిజాన్ని తెలుసుకోవడం అవసరమే. కానీ ప్రతీ నిజాన్ని తెలుసుకోవడం వల్ల జీవితం వృధా అవుతుంది. జ్ఞానం అనంతం. మనిషి జీవితం పరిమితం. పరిమిత జీవితకాలంలో చాలా వరకు తనకు తెలియకుండా సమాజ ప్రభావంతో కొట్టుకుపోతాడు. తనకు అర్థమయ్యింది అనుకునే లోపే తను అర్థం చేసుకున్నదంతా తప్పని అర్థమవుతుంది. మనిషి తన మానసిక జీవితానికి సంబంధం లేని ఏ నిజాన్ని తెలుసుకున్నా అది వృధానే. అంత

కెరీర్

ʹహరి రాఘవ్ గారు!! మీరెన్ని చెప్పినా మనిషి కెరీర్ కే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనిపిస్తుంది. మీ మాటలను నమ్మి ఒక్క రోజు రెస్ట్ తీసుకున్నా కెరీర్ లో వెనుకబడి పోవడం ఖాయం. మిగిలిన వాళ్ళు ముందుకు వెళ్లి పోతారు. అంతెందుకు మీరు మాత్రం అన్నేసి కౌన్సెలింగ్స్ ఇవ్వడం లేదా? మీకు కూడా కెరీర్ ముఖ్యం కాదా? నా కెందుకో మీరు చెప్పే దానిని పూర్తిగా నమ్మ బుద్ధి కావడం లేదు.ʹ ʹనమ్

చీమ మెదడులో చేరిన వైరస్

చాల కాలం క్రితం ఒక ప్రత్యేకమైన చీమల జాతి ఉండేదట. ఆ జాతి అంతరించి పోవడానికి ఒక అరుదైన వైరస్ కారణం. ఈ వైరస్ కేవలం ఆ చీమల మెదడు ఆధారం గానే జీవించగలదు. అడవిలో నివసించే ఈ చీమలు చాల శక్తివంతమైనవి మరియూ తెలివయినవి కూడా. ఎలా చేరిందో తెలియదు ఆ అరుదైన వైరస్ ఆ చీమల జాతికి చెందిన ఒక చీమ మెదడులోకి చేరుకుంది. అప్పటి నుండి ఆ వైరస్ ఆ చీమ మెదడును హ్యాండిల్ చెయ్యడం మొదలు

వ్యక్తి

నిజానికి ఈ సమాజంలో మారాల్సింది ఏదయినా ఉంది అంటే అది నేనే (వ్యక్తి). నేను మారితే మొత్తం సమాజం మారుతుంది. నేను మారకుండా సమాజం మారదు. వ్యక్తిగా ఎదగలేని నేను సమాజాన్ని మార్చాలని ప్రయత్నించడం వృధా మరియూ నన్ను నేను చేసుకునే మోసం.

జీవితం

ఆధునిక కాలంలో మనిషి తన జీవితంలో ఎదురయ్యే ఆనందాన్ని అనుభవించడం కన్నా, తను ఆ స్థితికి చేరుకున్నాని ఇతరులకు తెలియజేయడంలో ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు. అనుకోకుండా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడినా లేదా ఏదైనా విహార యాత్రకు వెళ్ళినా ఆ అందమైన అనుభూతులను ఆస్వాదించ కుండా అక్కడ సెల్ఫీలు ఎలా తీసుకుంటే బాగుంటదో అనే ఆలోచనలే వారి మనస్సులో మొదలవుతాయి.

హ్యూమనిజం

హ్యూమనిజం జంతువుల వలే కాకుండా మనిషి సహజంగా విలువలతో కూడిన ప్రవర్తన కలిగియుంటాడు, తరువాత సమాజ ప్రభావం వలన చెడుగా మారతాడు అని నమ్ముతుంది. దీనినే #హ్యూమనిస్టిక్ #సైకాలజీ అని కూడా అంటారు. పర్సన్ సెంటర్డ్ థెరపీ, సెల్ఫ్-యాక్షువలైజేషన్ వంటి థెరపీలు హ్యూమనిజంలో భాగాలు. యాభైవ దశకంలో అబ్రహం మాసలౌ, కార్ల్ రోజర్స్, షార్లెట్ బహెల్ర్ మరియూ కొందరు సైకాలజిస్ట్లు ప్రతిప

నేనెవరు?

Who am I? | Hari Raghav

కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది?

ఒక వ్యక్తికి ఒక సబ్జెక్టు పట్ల ఇంటరెస్ట్ ఉన్నదీ లేనిదీ ఎలా తెలుస్తుంది? కెరీర్ ఎన్నుకునేటపుడు ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి? ఒకవేళ కెరీర్ మార్చుకోవాల్సి వస్తే ఎటువంటి శ్రద్ధ వహించాలి?

టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?

టీనేజ్ పిల్లలో వచ్చే మానసిక శారీరక మార్పులేంటి? వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? వారితో తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలి?
Search Engine

బయలాజికల్ మదర్
ఫేస్బుక్ ఓసీడీ (FBOCD)
నిజం ఆవస్యకత
నిజాలన్నీ అబద్దాలే
కెరీర్
చీమ మెదడులో చేరిన వైరస్
వ్యక్తి
జీవితం
హ్యూమనిజం
నేనెవరు?
PTSD
డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు
రిజర్వేషన్స్
కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది?
టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?
మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా?
Autism Treatment
మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా?
NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు
టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన
పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!
పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?
మనుసులో భావాలే కలలుగా వస్తాయా?
కలలు నిజాలు అవుతాయా?
ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్
Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..?
తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?
టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి?
రెండవ కూతురు
ఏకాగ్రత పెంచుకోవడం ఎలా?
మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా?
ఫ్రీ థింకింగ్
పోరాటమా? బ్రతుకా?
more..
మోసం