దేవుడు - అస్తిత్వవాదం

దేవుడు

#ఎక్సిస్టెన్షలిజం లో తమ మానసిక స్థితినే కాకుండా ఇతరుల మానసిక స్థితి పట్ల శ్రద్ద వహించడం జరుగుతుంది. వ్యక్తి జీవితం అంటే అతని మానసిక స్థితి మాత్రమే. ప్రతీ విషయాన్నీ తను తీసుకునే విధానాన్ని బట్టి అతనికి అది బాధ కలిగించడం లేదా ఆనందాన్ని కలిగించడం జరుగుతుంది.

ఒక విషయం ఒకరిని బాధించనంత మాత్రాన ఇతరులను బాధించదని భావించరాదు. లేదా ఒక విషయం మనల్ని బాధించినంత మాత్రాన ఇతరులను బాధిస్తుంది అని కూడా భావించరాదు. అది వారి వారి మానసిక స్థితిని బట్టి ఉంటుంది. ఎక్సిస్టెన్షలిస్ట్ ప్రధమం గా వీలయినంత వరకు ఇతరుల మనస్సులు నొచ్చుకోకుండా తన మానసిక స్థితిని కాపాడుకుంటూ ఉంటాడు.

ఎక్సిస్టెన్షలిజంలో గతానికి లేదా భవిష్యత్తు కన్నా ప్రస్తుతానికి ఎక్కువ విలువ నివ్వడం జరుగుతుంది. గతంలో ఎటువంటి సమాజంలో బ్రతికాము, మనం ఎటువంటి సమాజం కోరుకుంటున్నాము కన్నా ప్రస్తుతం ఉన్న సామాజిక పరిస్థితులను అర్థం చేసుకొని సాటి వారితో ఎలా మెలగాలో తెలియజేస్తుంది.

సాధారణంగా ఎక్సిస్టెన్షలిస్టులు ఎక్కువమంది నాస్తికులంటారు. కానీ ఈ నాస్తికులకు సమాజంలో ఇతర నాస్తికులకు తేడా ఉంటుంది. ఎక్సిస్టెన్షలిస్టులు దేవుడి ఉనికిని నమ్మకపోవచ్చు గాని దేవుడు అనే కాన్సెప్ట్ యొక్క ఉనికిని గుర్తిస్తారు. సమాజంలో ఎక్కువ మంది దేవుడి ఉనికిని అంగీకరిస్తున్నారు అనే దానిని ఎక్సిస్టెన్షలిస్టులు అంగీకరిస్తారు.

నిజానికి ఎక్సిస్టెన్షలిస్టులకు దేవుడి ఉనికితో పనిలేదు. అలాగే తన జీవితాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేయని సైన్స్ తో కూడా పని లేదు. కానీ ఇతరుల నమ్మకాలను, మనోభావాలను దెబ్బదీయడం వాళ్ళ సమాజంలోని ప్రశాంతకు ఇబ్బంది కలిగే అవకాశమున్నందున అటువంటి చర్యలకు వారు దూరంగా ఉంటారు.

- హరి రాఘవ్

Keywords : existentialism, god, religion
(02.07.2018 11:38:40am)

No. of visitors : 2219

Suggested Posts


2 results found !


దేవుని సృష్టిలో గ్రహణాల పాత్ర

ప్రకృతిలో ఏ జీవికి అవసరం పడని దేవుడు అనే కాన్సెప్ట్ మనిషికి అవసరం పడింది. దానికి కారణం మనిషికి ఉన్న మెమరీ, ఎమోషన్స్ కావచ్చు. రోజు సూర్యుడు తూర్పున ఉదయించడం,

మనిషి; దైవత్వం

మనిషి తనలోని దైవత్వాన్ని కోల్పోయినపుడు దైవం కోసం బయట వెతుకుతాడు. ఆ క్రమంలో ఇతరులను కలుస్తాడు. వారిలో దైవత్వాన్ని కూడా గుర్తించ లేక వారిని అడుగుతాడు. వారు చె
Search Engine

బయలాజికల్ మదర్
ఫేస్బుక్ ఓసీడీ (FBOCD)
నిజం ఆవస్యకత
నిజాలన్నీ అబద్దాలే
కెరీర్
చీమ మెదడులో చేరిన వైరస్
వ్యక్తి
జీవితం
హ్యూమనిజం
నేనెవరు?
PTSD
డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు
రిజర్వేషన్స్
కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది?
టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?
మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా?
Autism Treatment
మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా?
NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు
టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన
పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!
పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?
మనుసులో భావాలే కలలుగా వస్తాయా?
కలలు నిజాలు అవుతాయా?
ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్
Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..?
తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?
టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి?
రెండవ కూతురు
ఏకాగ్రత పెంచుకోవడం ఎలా?
మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా?
ఫ్రీ థింకింగ్
పోరాటమా? బ్రతుకా?
more..
దేవుడు