నేను - నమ్మకాలు - మనోభావాలు
నేను అంటే ఆస్తికులు మత గ్రంధాల ఆధారంగా ఆత్మగా భావిస్తారు. నాస్తికులు ఈ వాదనను కొట్టి పారేస్తారు. అయితే నేను ఎవరు అని హేతుబద్దంగా ప్రశ్నించుకుంటే " నేను - నా ఆలోచనలు వాటి ప్రతిస్పందన" అని అర్థం అవుతుంది. ఆ ఆలోచనలు ఎక్కడివి? ఏ ప్రభావంతో వస్తున్నాయి. నేను ఆలోచిస్తున్నానా? లేక నేను ఆలోచిస్తున్నాను అనే ఆలోచన నాకు వచ్చిందా? నా ఆలోచనలను బాహ్యంగా, శారీరకంగా ప్రభావితం చేసే అంశాలు ఏంటి అని ప్రశ్నించుకుంటే నా ఆలోచనలు పూర్తిగా నావి కావు అని అర్థం అవుతుంది. ఎప్పుడయితే నా ఆలోచనలు కేవలం నావి కావు అని అర్థం అవుతుందో అప్పటినుండి ʹనేనుʹ అనే అహం తగ్గటం ప్రారంభమవుతుంది.
నమ్మకాలు సాధారణంగా మన మైండ్ ప్రతీసారి ప్రతీ విషయాన్నీ పరిగణలోకి తీసుకొని ప్రాసెస్ చేసి అర్థం చేసుకునే టైం లేక, లేదా మానసికంగా బలంగా లేకపోవటం వల్ల ఏర్పడతాయి. సాధారణంగా మనకు లభించిన సమాచారాన్ని జెనరలైజ్ చెయ్యటం జరుగుతుంది. తరువాత స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ లభించిన తరువాత జెనరలైజ్ చేసిన అభిప్రాయాన్ని బలపరుచుకోవటం, లేదా మార్చుకోవటం జరుగుతుంది. అయితే ఇక్కడ వ్యక్తి ʹఅహంʹ చాల కీలకపాత్ర వహిస్తుంది. తాను జెనరలైజ్ చేసి తీసుకున్న ఒక నిర్ణయాన్ని స్పెసిఫిక్ సమాచారం లభించిన తరువాత కూడా మార్చుకోవడానికి అహం ఒప్పుకోదు. అది తాను నిజాన్ని గుర్తించడం కన్నా తనను ఓడిపోకుండా కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తుంది. అవి బలపడి నమ్మకాలుగా మారతాయి. మరింత బలపడి వాటిని ప్రశ్నించకుండా, ప్రశ్నించనివ్వకుండా అడ్డుపడుతూ మూఢ నమ్మకాలుగా మారతాయి. మత పరమయిన నమ్మకాలు, మత రహితమయిన నమ్మకాలు ఏవయినా సరే వాటివెనుక జరిగే ప్రాసెస్ ఇలాగే ఉంటుంది.
మనోభావాలు భౌతికంగా కనిపించకున్నా ఎవరికయితే నమ్మకాలు బలంగా ఉంటాయో వారి నమ్మకాలూ ఎదుటివాళ్ళు ప్రశ్నిస్తున్నప్పుడు, లేదా తప్పు అని ప్రూవ్ చేస్తున్నపుడు ఆ వ్యక్తి అహం దానిని భరించలేక పోవటమే మనోభావాలు దెబ్బతినటం. తన అభిప్రాయాన్ని మార్చుకోవటానికి ఒప్పుకోక పోగా ఎదుటి వ్యక్తి మీద విపరీతమయిన మౌఖిక, శారీరక దాడులు చేస్తారు. ఇది కేవలం ఆస్తికులు మాత్రమే కాదు, నాస్తికులు, హేతువాదులలో కూడా కొంతమంది మనోభావాలు దెబ్బతినడం అనైతికంగా ఎదుటి వారిని అవమానించడం, దాడి చెయ్యటం జరుగుతుంది.కొంత మంది నాస్తికులు, హేతువాదులు అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే "తాను అభిమానించే ఒక వ్యక్తిని ప్రశ్నిస్తే పూనకం వచ్చినట్లు ఊగిపోయి అవతలి వ్యక్తిని అవమానపరిచే నాస్తికులు ఉన్న సమాజంలో, లేని దేవుడిని ఉన్నాడని నమ్ముతూ పూజించే ఆస్తికుడికి కోపం రావడంలో ఆశ్చరం ఏముంది?"
- హరి రాఘవ్
Keywords : religion, belief, sentiments, ego
(18.09.2017 08:46:33pm)
No. of visitors : 651
Suggested Posts
2 results found !
| చీమ మెదడులో చేరిన వైరస్చాల కాలం క్రితం ఒక ప్రత్యేకమైన చీమల జాతి ఉండేదట. ఆ జాతి అంతరించి పోవడానికి ఒక అరుదైన వైరస్ కారణం. ఈ వైరస్ కేవలం ఆ చీమల మెదడు ఆధారం గానే జీవించగలదు. అడవిలో నివసించే ఈ చీమలు చాల శక్తివంతమైనవి మరియూ తెలివయినవి కూడా. ఎలా చేరిందో తెలియదు ఆ అరుదైన వైరస్ ఆ చీమల జాతికి చెందిన ఒక చీమ మెదడులోకి చేరుకుంది.
అప్పటి నుండి ఆ వైరస్ ఆ చీమ మెదడును హ్యాండిల్ చెయ్యడం మొదలు |
| జ్ఞానం - అజ్ఞానం - అహంఒక మనిషికి దేని గురించి జ్ఞానం ఉండాలి? ఎందుకు ఉండాలి? ఎంతవరకు ఉండాలి? అనే జ్ఞానం ప్రతీ వ్యక్తికీ అవసరం. అవసరం ఉన్న లేకున్నా ప్రతీ విషయం పట్ల జ్ఞానం కలిగి ఉం |
| డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు |
| కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది? |
| టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి? |
| మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా? |
| మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా? |
| NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు |
| టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి? |
| బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన |
| పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? |
| మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!! |
| పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా? |
| మనుసులో భావాలే కలలుగా వస్తాయా? |
| Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..? |
| తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా? |
| టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి? |
| మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా? |
more..