జ్ఞానం - అజ్ఞానం - అహం
ఒక మనిషికి దేని గురించి జ్ఞానం ఉండాలి? ఎందుకు ఉండాలి? ఎంతవరకు ఉండాలి? అనే జ్ఞానం ప్రతీ వ్యక్తికీ అవసరం. అవసరం ఉన్న లేకున్నా ప్రతీ విషయం పట్ల జ్ఞానం కలిగి ఉండాలి అనుకోవటం అది లేక పోవటాన్ని అజ్ఞానం గా భావించడమే మనిషి అజ్ఞానం.
జ్ఞానం అనంతమయినది. మనిషి జీవితం పరిమితమయినది. పరిమితమయిన జీవితంలో పరిమిత జ్ఞానం మాత్రమే తెలుసుకోగలడు. అపరిమితమయిన జ్ఞానాన్ని పరిమిత జీవితంలో తెలుసుకోలేడు. ఈ ʹఇన్ఫర్మేషన్ ఎరాʹ లో కూడా మనిషి దయగలిగింది సమాచారం మాత్రమే. అది కూడా పరిమితమయిన సమాచారం. ఈ స్వల్పమయిన జీవిత కాలంలో ఏ విషయం పట్ల, ఏ సమయంలో, ఎంత వరకు జ్ఞానాన్ని కలిగి ఉండాలో అవగాహన ప్రతీ వ్యక్తికీ అవసరం. ఈ అవగాహన కలిగి ఉన్న వ్యక్తిని జ్ఞానీ అంటారు. అంతే తప్ప జ్ఞానీ అనగా అపరిమితమైన జ్ఞానం మొత్తం అతనిలో ఉంది అని కాదు.
జ్ఞానం అనే నాణానికి మరో పార్శం అజ్ఞానం. జ్ఞానం లేనిదే అజ్ఞానం ఉండదు. సమకాలీన పరిస్థితులలో సమాజంలో ఉన్న జ్ఞానాన్ని మనకు అవసరం ఉన్నా పొందకుండా ఉండటమే అజ్ఞానం. ఇక్కడ ʹఅవసరంʹ మరియూ ʹసమకాలీనʹ అనే పదాలను విస్మరించరాదు. ఒక ʹసివిల్ ఇంజినీర్ʹ కు ʹబయో కెమిస్ట్రీʹ గురించి జ్ఞానం లేక పోవటం అజ్ఞానం కాదు. ఒక ʹపెయింటర్ʹ కు ʹఆటో మొబైల్ ఇంజినీరింగ్ʹ తెలియక పోవటం అజ్ఞానం కాదు. ఒక ʹసైకాలజిస్ట్ʹ కి ʹసెకండరీ మార్కెట్ సూత్రాలుʹ తెలియక పోవటం అజ్ఞానం కాదు. అలాగే ఒక 500 సంవత్సరాల క్రితం బ్రతికిన వ్యక్తికి ʹడిజిటల్ కెమెరాʹలో వాడే ʹసిమాస్ చిప్-సెట్ʹ గురించి తెలియక పోవటం అజ్ఞానం కాదు. కానీ అవన్నీ తెలుసు అనుకోవటం అతని అజ్ఞానాన్ని సూచిస్తుంది.
వ్యక్తి తన జీవన క్రమంలో తనకు అవసరమైన జ్ఞానాన్ని సముపార్జించ కుండా తనకు తెలుసు అనే అహం తో వచ్చేది అజ్ఞానము. అహం నమ్మకం నుండి వస్తుంది. అంతవరకు తనకు తెలిసిన సమాచారమే జ్ఞానం అనుకోవటం వల్ల వ్యక్తికి అహం వస్తుంది. ఆ అహం వ్యక్తి అవసరమయిన కొత్త సమాచారాన్ని, జ్ఞానాన్ని పొందకుండా అడ్డుపడటం వల్ల అతను అజ్ఞానిగా మారతాడు.
- హరి రాఘవ్
Keywords : knowledge, ignorance, ego
(24.09.2017 12:21:24am)
No. of visitors : 2229
Suggested Posts
2 results found !
| చీమ మెదడులో చేరిన వైరస్చాల కాలం క్రితం ఒక ప్రత్యేకమైన చీమల జాతి ఉండేదట. ఆ జాతి అంతరించి పోవడానికి ఒక అరుదైన వైరస్ కారణం. ఈ వైరస్ కేవలం ఆ చీమల మెదడు ఆధారం గానే జీవించగలదు. అడవిలో నివసించే ఈ చీమలు చాల శక్తివంతమైనవి మరియూ తెలివయినవి కూడా. ఎలా చేరిందో తెలియదు ఆ అరుదైన వైరస్ ఆ చీమల జాతికి చెందిన ఒక చీమ మెదడులోకి చేరుకుంది.
అప్పటి నుండి ఆ వైరస్ ఆ చీమ మెదడును హ్యాండిల్ చెయ్యడం మొదలు |
| నేను - నమ్మకాలు - మనోభావాలునేను అంటే ఆస్తికులు మత గ్రంధాల ఆధారంగా ఆత్మగా భావిస్తారు. నాస్తికులు ఈ వాదనను కొట్టి పారేస్తారు. అయితే నేను ఎవరు అని హేతుబద్దంగా ప్రశ్నించుకుంటే " నేను - నా |
| డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు |
| కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది? |
| టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి? |
| మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా? |
| మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా? |
| NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు |
| టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి? |
| బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన |
| పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? |
| మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!! |
| పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా? |
| మనుసులో భావాలే కలలుగా వస్తాయా? |
| Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..? |
| తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా? |
| టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి? |
| మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా? |
more..