ఆలోచన - ప్రవర్తన - విలువలు - మతం

ఆలోచన

వీటియొక్క క్రమం కనుక అర్థం చేసుకుంటే మొదటిది ఆలోచన. సమాజాన్ని బట్టి కొన్ని ఆలోచనలు ప్రవర్తన రూపంలోకి మారవచ్చు. కొన్ని మారక పోవచ్చు. ఇలా ప్రవర్తన రూపంలోకి మారినవి ఇతరులకు గాని, మిగిలిన ప్రకృతికి గాని హాని కలిగించ వచ్చు. అలా హాని కలిగించే ప్రవర్తనను నియంత్రించే ఉద్దేశ్యంతో విలువలు నిర్వచించబడతాయి. ఈ విలువలు పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. ఈ విలువలు నిర్వచిందడంలో నిర్వచించే వారి స్వార్థం కూడా ఉంటుంది. ఎప్పుడయితే సమాజంలో కొందరి ఆధిపత్యం నడుస్తుందో వారు వారికీ అనువుగా ఉండే ప్రవర్తనను విలువలుగా నిర్వచించడం మొదలవుతుంది. ఆ నిర్వచించిన విలువలకు లాజికల్ రూపం ఇవ్వటానికి ఫిలాసఫీ, ఐడియాలజీ, స్పిరిట్యుయాలిటీ మొదలయిన వాటిని వాడుకుంటారు. ఆ క్రమంలో వచ్చింది మతం.

ఈ మతం, విలువలు, ఫిలాసఫీ, ఐడియాలజీ మొదలయినవి కూడా ఒక వ్యక్తి ఆలోచన మీద ప్రభావం చూపుతుంది. వాటితో పాటు ఎన్నో ఎక్సటర్నల్ ఫాక్టర్స్ కూడా మన ఆలోచనను ప్రభావితం చేస్తుంది. ఆ అథారిటీ ని వ్యక్తిని సైకలాజికల్ గా బానిసని చేస్తుంది. వాటిని తెంచుకొని ఆలోచించడమే ఫ్రీ థింకింగ్. స్వేచ్చాయుతమైన ఆలోచన విధానం.

అయితే ఈ బంధనాలు తెంచుకోవటంలో కొందరు కొంతవరకే ప్రయత్నం చేసి మిగిలిన బానిసత్వాన్ని అంగీకరిస్తారు. ఏదో ఒక బంధనాన్ని తెంచుకోగలిగి ఎవరికీ వారు ఫ్రీ థింకర్ అనుకోవటం సహజం. ఒక మతస్తుడు వేరే మతం యొక్క ప్రభావాన్ని తెంచుకొని తానూ ఫ్రీ థింకర్ గా భావించుకుంటాడు. అలాగే చాలామంది నాస్తికులు కేవలం మత పరమయిన ప్రభావాన్ని తెంచుకొని దానిని ఫ్రీ థింకింగ్ అనుకుంటారు. అలాగే రైట్ ఐడియాలజీకి లోను కానీ లెఫ్టిస్టులు, లెఫ్ట్ ఐడీలోజికి లోను కానీ రైటిస్టులు కూడా ఫ్రీ థింకర్స్ గా భావించుకుంటారు.

ఇలా ఎవరికీ వారు కొన్నిటిని తెంచుకొని మరి కొన్నిటిని అంగీకరించడాన్ని ఫ్రీథింకింగ్ గా భావించడాన్ని హేతుబద్దంగా అంగీకరించలేము. ఫ్రీ థింకింగ్ అన్ని అథారిటీ లను బ్రేక్ చేసుకోవటం. అస్సలు అథారిటీ ఏంటి? అటువంటిది ఏమీ లేదు మేము ఫ్రీ థింకర్స్ అనుకుంటే చెప్పేది ఏమి ఉండదు. అది ఒక రాయిని గాలిలోకి విసిరితే ఆ రాయి తనకు తాను నేను భలే ఎగరగలుగుతున్నాను అని భావించడంవంటిది.

- హరి రాఘవ్

Keywords : thought, free-thinking, religion, values, society
(24.09.2017 07:41:30pm)

No. of visitors : 315

Suggested Posts


2 results found !


ఫ్రీ థింకింగ్

వీటియొక్క క్రమం కనుక అర్థం చేసుకుంటే మొదటిది ఆలోచన. సమాజాన్ని బట్టి కొన్ని ఆలోచనలు ప్రవర్తన రూపంలోకి మారవచ్చు. కొన్ని మారక పోవచ్చు. ఇలా ప్రవర్తన రూపంలోకి మారినవి ఇతరులకు గాని, మిగిలిన ప్రకృతికి గాని హాని కలిగించ వచ్చు. అలా హాని కలిగించే ప్రవర్తనను నియంత్రించే ఉద్దేశ్యంతో విలువలు నిర్వచించబడతాయి. ఈ విలువలు పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. ఈ విలువలు నిర్

స్వేచ్ఛ

సామాజికంగా స్వేచ్ఛగా బ్రతకటం అంటే రూల్స్ బ్రేక్ చెయ్యటం కాదు. లేదా రూల్స్ గుడ్డిగా ఫాలో అవటం కాదు. స్వేచ్ఛగా బ్రతకటం అంటే రూల్స్ ఎందుకు ఉన్నాయో అర్థం చేసుకొని వాటి వల్ల ఉపయోగం ఉంటే పాటించడం లేదనుకుంటే రూల్స్ ని మార్చే ప్రయత్నం చెయ్యటం. రూల్స్ ఉన్నాయి కాబట్టి వాటికీ పవిత్రత ఆపాదించి వాటిని పాటించడం కూడా బానిసత్వమే. లేదా వాటిని ఎందుకు బ్రేక్ చేస్తున్నామో త
Search Engine

బయలాజికల్ మదర్
ఫేస్బుక్ ఓసీడీ (FBOCD)
నిజం ఆవస్యకత
నిజాలన్నీ అబద్దాలే
కెరీర్
చీమ మెదడులో చేరిన వైరస్
వ్యక్తి
జీవితం
హ్యూమనిజం
నేనెవరు?
PTSD
డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు
రిజర్వేషన్స్
కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది?
టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?
మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా?
Autism Treatment
మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా?
NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు
టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన
పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!
పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?
మనుసులో భావాలే కలలుగా వస్తాయా?
కలలు నిజాలు అవుతాయా?
ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్
Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..?
తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?
టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి?
రెండవ కూతురు
ఏకాగ్రత పెంచుకోవడం ఎలా?
మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా?
ఫ్రీ థింకింగ్
పోరాటమా? బ్రతుకా?
more..
ఆలోచన