నాస్తికత్వం - సైన్స్
నాస్తికత్వం వేరు సైన్స్ వేరు. నాస్తికత్వం పరిధి చాల చిన్నది. దేవుడు, మతము మొదలైన ఆధ్యాత్మిక నమ్మకాలకు సంబంధిచినది మాత్రమే. సైన్స్ కి పరిధి లేదు. ఇది విశ్వం మొత్తానికి సంబంధిచినది. దీనికి ఆస్తికుడు, నాస్తికుడు, లేదా ఆ మతం వాడు ఈ మతం వాడు అని సంబంధం ఉండదు. పసిపిల్లవాడు తన తల్లి చనుబాలు త్రాగటం దగ్గరనుండి రాకెట్ ప్రయోగించడం వరకు ప్రతీ దానిలో సైన్స్ ఉంటుంది. ప్రతీ వ్యక్తికీ ఎంతో కొంత సైన్స్ తెలిసిఉంటుంది.
కుండలు చెయ్యటం దగ్గరనుండి కంప్యూటర్ చిప్స్ చేసేవాడు దాకా అందరూ సైంటిఫిక్ గా థింక్ చేస్తేనే అది వస్తుంది తప్ప మరో రకంగా రాదు. గురుత్వాకర్షణను అర్థం చేసుకోవటం దగ్గరనుండి వ్యక్తి ప్రవర్తనను అర్థం చేసుకోవటం వరకు రక రకాల ఫీల్డ్స్ లో సైన్స్ ఉంటుంది. కాబట్టి ఏ వ్యక్తి కూడా నాకు సైన్స్ తో పరిచయం ఉంది నీకు లేదు అని విషయం బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయటం సరి కాదు. ఏదయినా ఒక రీసెర్చ్ చెయ్యటానికి పూర్తి హేతుబద్దమయిన ఒక మెథడాలజీ ఉంటుంది. దానిని తెలుసుకొని దాని ప్రకారం మనం చేసిన రీసెర్చ్ ప్రెసెంట్ చేస్తే త్వరగా అందరికి అర్థం అవుతుంది.
ఒక వ్యక్తి ఆస్తికత్వం నుంచి నాస్తికుడు అయిపోగానే హఠాత్తుగా సైంటిస్ట్ అయిపోడు. సైన్స్ ఒక వర్గానికి, లేదా కొందరి సొత్తు కాదు. సైన్స్ వారసత్వం కాదు. మతం కాదు. నాది సైన్స్ కుటుంబం, మా తాతల నుండి సైంటిస్టులు అని చెప్పుకోవటం ఒక మూర్ఖత్వం. సైన్స్ ని దిగజార్చే ఒక ప్రక్రియ మాత్రమే.
- హరి రాఘవ్
Keywords : atheism, science, rationalism
(30.09.2017 09:43:43pm)
No. of visitors : 2088
Suggested Posts
4 results found !
| పేదరికంలో ఆకలి చావులుంటాయి తప్ప ఆత్మహత్యలుండవుమనిషి ప్రాధమిక అవసరాలు తీరనిదే ఇతర విషయాలను పట్టించుకోడు. ప్రాధమిక అవసరాలకోసం తను ఏమయినా చేస్తాడు. సాటి ప్రాణిని చంపుతాడు. సాటి మనిషిని చంపుతాడు, అవసరమైతే బానిసత్వం వహిస్తాడు. ఎవరికయినా తలొంచుతాడు. అది మతమయినా, పెట్టుబడి దారుడయినా, దోపిడీ దారుడయినా.. ప్రాధమిక అవసరాలు తీరనిదే తను హేతుబద్దంగా ఆలోచించలేడు, సైంటిఫిక్ థింకింగ్ అలవర్చుకోలేడు.
సైన్స్ ఎప్పుడూ ఉ |
| సామాజిక దృక్పధం లేని శాస్త్రవేత్తలు ఉగ్రవాదులకన్నా ప్రమాదంసమాజంలో శాస్త్రీయ దృక్పధం పెరగాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. ఈ విషయం భారత రాజ్యాంగంలో సైతం స్పష్టంగా చెప్పబడినది. అందుకు అనుకూలంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. మూఢనమ్మకాలను పారద్రోలుతూ ప్రజలలో అవగాహనా సదస్సులు నిర్వహించాలి. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా చట్టాలు రూపొంచాలి. సైన్స్ ప్రచారకులు పెరగాలి. ఇటీవల భారత్ లో హేతువాదులు, నాస్తికుల పైన మత ఛాందస వాదులు, |
| భారత్ లో పరిశోధనల పై కుల ప్రభావంనేటి చదువుకున్న యువతకు సైన్స్ అనగానే నాసా లేదా ఇస్రో గుర్తొస్తుంటాయి. ఏది చెప్పినా నాసా చెప్పాలి. లేదా ఇస్రో చెయ్యాలి. చివరికి పురాణాలలో చెప్పబడిన వాటిని కూడా నాసా పరిశోధించి చెప్పింది అని ప్రచారం చెయ్యటం వాటిని ప్రజలు నమ్మటం జరుగుతుంది. ఇవి కేవలం స్పేస్ కి సంబంధించిన పరిశోధనలు చేసే సంస్థలు. గేమ్స్ లో క్రికెట్ కి విపరీతమైన గ్లామర్ రుద్దినట్లు సైన్స్ లో క |
| శాస్త్రం - సైన్స్ʹసైన్స్ʹ కి తెలుగులో ʹశాస్త్రంʹ అని చాల సంవత్సరాలుగా వాడుతున్నారు. కానీ మతసంబంధమయిన విషయాలను కూడా ʹశాస్త్రంʹ అని వాడటంతో ఈ మధ్య సైన్స్ ని ʹవిజ్ఞాన శాస్త్రంʹ |
| డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు |
| కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది? |
| టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి? |
| మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా? |
| మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా? |
| NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు |
| టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి? |
| బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన |
| పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? |
| మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!! |
| పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా? |
| మనుసులో భావాలే కలలుగా వస్తాయా? |
| Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..? |
| తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా? |
| టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి? |
| మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా? |
more..